breaking news
Three youngsters
-
పాతకక్షలతో ముగ్గురు యువకులపై దాడి
యాకుత్పురా: పాత కక్షల కారణంగా నలుగురు యువకులు ముగ్గురిపై దాడి చేసిన సంఘటన హైదరాబాద్ నగరం భవానీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్ఐ వి.రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. తలాబ్కట్టా మురాద్ మహాల్ ప్రాంతానికి చెందిన ముజఫర్ అలీ (22) చార్మినార్ సమీపంలో సెల్ఫోన్ రిపేరింగ్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. కాగా శనివారం రాత్రి దుకాణం వద్దకు వచ్చిన అక్రమ్ అనే యువకుడు ముజఫర్ ఇంటి వద్ద కొందరు యువకులు గుమిగూడారని చెప్పారు. దీంతో ముజఫర్ హుటాహుటిన తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటి వద్ద మజాజ్ అనే యువకుడు ఇమ్రాన్, షాబాజ్, ఇమ్రోజ్లతో కలిసి ముజఫర్పై దాడికి పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నారు. ముజఫర్ ఇంటి తలుపులు కొట్టగా ఇంట్లో నుంచి ముజఫర్ తల్లి బయటికి వచ్చింది. ఎవరు కావాలని అడగ్గా.. మజాజ్ తల్లిపై దాడి చేశాడు. దీంతో ముజఫర్, మజాజ్ల మధ్య గొడవ జరిగింది. మజాజ్ తన వెంట ఉన్న ఇమ్రాన్, ఇమ్రోజ్, షాబాజ్లతో కలిసి ముజఫర్పై దాడికి పాల్పడ్డాడు. దాడిని అడ్డుకోవడానికి వచ్చిన అబుబాకర్, సయ్యద్ మోయిజ్లను సైతం మజాజ్ గ్యాంగ్ చితకబాదారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ముజఫర్, అబుబాకర్, మోయిజ్లు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లారు. అనంతరం జరిగిన దాడిపై ముజఫర్ భవానీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పంజాబ్లో బాలికపై సామూహిక అత్యాచారం
మొగా: పంజాబ్లోని మొగా జిల్లాలో 14 ఏళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. మొగా జిల్లాలోని బధ్నికలన్ గ్రామానికి చెందిన బాలిక స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. శనివారం పాఠశాలకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో 20 ఏళ్ల లోపున్న సుఖ్జీవన్ సింగ్, జగ్సీర్ సింగ్ సహా మరో వ్యక్తి కారులో వచ్చి బాలికను కిడ్నాప్ చేశారు. అక్కడి నుంచి ఓ నిర్జనప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలిని అక్కడే వదిలి పారిపోయారు.