breaking news
threaten strike
-
మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు
ఇంఫాల్: ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మళ్లీ ఘర్షణలు మొదలయ్యాయి. మొయితీ వర్గం నాయకులను పోలీసులు శనివారం అరెస్టు చేయడంతో ఆ వర్గం ప్రజలు ఆదివారం వీధుల్లోకి వచ్చారు. నిరసనలతో హోరెత్తించారు. పోలీసులతో ఘర్షణకు దిగారు. నిషేధాజ్ఞలు లెక్కచేయకుండా ఆందోళనలు చేశారు. రోడ్లపై టైర్లు వేసి దహనం చేశారు. దాంతో ఇంఫాల్ వెస్ట్, ఇంఫాల్ ఈస్ట్ జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల రాకపోకలు అడ్డుకొనేందుకు రోడ్లు తవ్వేశారు. దుకాణాలపై దాడులకు దిగారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. తమ నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజధాని ఇంఫాల్‌లో కొందరు ఆత్మాహుతికి ప్రయత్నించినట్లు తెలిసింది. ముందు జాగ్రత్తగా ఇంఫాల్ లోయలోని ఐదు జిల్లాల్లో ప్రభుత్వం మొబైల్, ఇంటర్నెట్ సేవలు రద్దు చేసింది. కొన్నిచోట్ల కర్ఫ్యూ సైతం విధించింది. ఆంక్షలు ఐదు రోజులపాటు అమల్లో ఉంటాయని ప్రకటించింది. మరోవైపు మణిపూర్ గవర్నర్ అజయ్‌కుమార్ భల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఘర్షణలు కొనసాగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలు రాజభవన్లో గవర్నర్‌ను కలిశారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు ఆయనకు వివరించారు. మరోవైపు అస్సాంలోని జిరిబామ్ జిల్లాలోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి. మొయితీ వర్గానికి చెందిన అరంబాయ్ తెంగోల్ తెగ కీలక నాయకుడితోపాటు మరికొందరు సభ్యులు పోలీసులు శనివారం అరెస్టు చేయడం మణిపూర్, అస్సాంలో ఘర్షణలకు దారితీసింది. ఆ కీలక నాయకుడు కానన్ సింగ్ అంటున్నారు. అతడికి మొయితీల్లో గట్టి పట్టుంది. మణిపూర్‌లో 2023 నుంచి మొయితీలు, కుకీల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 260 మందికిపైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.సీఎం బీరేన్‌సింగ్ రాజీనామా చేయడంతో ఫిబ్రవరి నుంచి రాష్ట్రపతి పాలన సాగుతోంది.ఇది కూడా చదవండి: ‘డెమోక్రాట్లకు నిధులిస్తే బాగోదు’.. మస్క్‌కు ట్రంప్ వార్నింగ్ -
లంచం ఇవ్వకుంటే పిస్టల్‌తో కాల్చేస్తా.. ఫారెస్డ్ గార్డ్ బెదిరింపులు
మైసూరు(బెంగళూరు): కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు సేవలు అందిస్తూ సమాజంలో మంచి పేరుతో పాటు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంటే మరికొందరు లంచానికి ఆశపడుతున్నారు. తాజాగా లంచం కోసం ఓ ఫారెస్ట్ గార్డ్ హల్ చల్ చేయగా ఆ వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. అడిగినంత డబ్బు ఇవ్వక పోతే పిస్టల్‌తో కాల్చి వేస్తామని ఫారెస్డ్ గార్డు లారీ డ్రైవర్‌ను బెదిరించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కర్ణాటక–తమిళనాడు సరిహద్దులో పోలార్ వద్ద చెక్‌పోస్టు ఉంది. ఇక్కడ విధుల్లో ఉన్న ఫారెస్ట్ గార్డు అటుగా వచ్చిన లారీని నిలిపి సోదా చేశాడు. అడిగినంత డబ్బు ఇవ్వాలని, లేదంటే పిస్టల్‌తో కాల్చివేస్తామని లారీ డ్రైవర్‌ను డిమాండ్ చేశాడు. దృశ్యాలను సదరు లారీ డ్రైవర్ సెల్ఫోన్లో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. సదరు ఫారెస్ట్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. చదవండి: వీడియో: తప్పతాగిన సెక్యూరిటీ గార్డు వీరంగం.. లేడీస్ హాస్టల్లో యువతిపై వికృత చేష్టలు! -
ఆ జర్నలిస్ట్‌లకు శిక్ష తప్పదు: మావోయిస్టులు
సాక్షి, చర్ల: రాష్ట్ర సరిహద్దుల్లోని ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు పార్టీకి, మీడియాకు ప్రచ్ఛన్న యుద్ధం సాగుతోంది. బస్తర్ ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధులు మీడియా ముసుగులో దళారులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ ఈ నెల 9వ తేదీన మావోయిస్టు పార్టీ దక్షిణ సబ్ జోనల్ కమిటీ ఓ లేఖను విడుదల చేసింది. బస్తర్ ప్రాంతంలోని అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసీలను వెళ్లగొట్టి.. ఆ ప్రాంతంలో ఉన్న విలువైన గనులను దోచుకోవడానికి ప్రభుత్వాలు కుట్ర పన్నాయని ఆరోపించింది. అందులో భాగంగానే అటవీ ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రత్యేక బలగాలను తరలిస్తూ.. ఆదివాసీలపై దాడులు చేస్తూ.. వారిని వెళ్లగొట్టేందుకు యత్నిస్తున్నాయని పేర్కొంది. ఈ వ్యవహారంలో కొందరు సామాజిక కార్యకర్తలు, మీడియా ప్రతినిధుల పాత్ర కూడా ఉందని.. బీజాపూర్ జిల్లాకు చెందిన గణేశ్ మిశ్రా, లీలాధర్‌రథి, విజయ్, ఫారూఖ్ అలీ, సుబ్రాస్తు చౌదరి పేర్లను ప్రస్తావించింది. ఆ అవినీతిపరులను, కార్పొరేట్ శక్తుల బ్రోకర్లను ప్రజాకోర్టులో ప్రజలు తప్పకుండా శిక్షిస్తారంటూ పార్టీ తన లేఖలో పేర్కొంది. మీడియా ప్రతినిధుల్లో కలవరం.. మావోల హెచ్చరికలతో బస్తర్ ప్రాంతానికి చెందిన మీడియా ప్రతినిధుల్లో ఒక్కసారిగా కలవరం మొదలైంది. అయితే ఛత్తీస్‌గఢ్‌లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఇదేమి కొత్త కాదు.. ప్రాణాలకు తెగించి ఈ ప్రాంతాల్లో జర్నలిస్టులు పని చేస్తుంటారన్న విషయం తెలిసిందే. రెండున్నరేళ్ల క్రితం బీజాపూర్ జిల్లాలో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ సాయిరెడ్డితోపాటు అదే జిల్లాకు చెందిన మరొక జర్నలిస్టుపై అనుమానం పెంచుకున్న మావోలు హతమార్చారు. మావోయిస్టులకు కొన్నిసార్లు అందే తప్పుడు సమాచారంతోనే ఇటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వెనక్కి తగ్గిన మావోలు.. ఇక ఛత్తీస్‌గఢ్ జర్నలిస్టులపై మావోలు చేసిన ఆరోపణలను జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. మావోలకు అందే తప్పుడు సమాచారం వల్ల కిడ్నాప్‌లకు గురైన పలువురు అమాయక ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారుల పక్షాన నిలిచి జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి దండకారణ్యానికి వెళ్లి చర్చలు జరిపి సరైన సమాచారమిచ్చి బందీలుగా ఉన్న వారిని విడిపించడం జరిగింది. ఏళ్ల తరబడి పనిచేస్తున్న జర్నలిస్టులు ఇప్పటికీ సరైన ఇళ్లు లేక అద్దె ఇళ్లల్లోనే ఉంటున్నారని, అయితే మావోయిస్టుల ఆరోపణలను ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తూ వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టుల హెచ్చరికలను వెనక్కి తీసుకోవాలంటూ జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక జర్నలిస్టులకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన జర్నలిస్టు సంఘాలు మద్దతునిచ్చి ఆందోళనల్లో పాల్గొనడంతో మావోయిస్టులు అంతర్మథనంలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17న మావోయిస్టు పార్టీ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఆఫ్ మావోయిస్టు ఓ ప్రకటన విడుదల చేసింది. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు వద్దని, పరిస్థితిపై సామరస్యంగా చర్చించుకుందామని కోరింది. చదవండి: దూకుడే మంత్రం