breaking news
Thrashes Police
-
నడి వయసు మహిళపై మధ్యప్రదేశ్ పోలీసుల దాష్టీకం
-
మహిళను కాళ్లతో తంతూ.. పిడిగుద్దులు గుద్దుతూ
భోపాల్: మాస్క్ ధరించని మహిళపై మధ్యప్రదేశ్ పోలీసులు దారుణంగా దాడి చేశారు. పురుష అధికారితో పాటు ఓ లేడీ పోలీసు ఆఫీసర్ సదరు మహిళను కాళ్లతో తంతూ.. పిడిగుద్దులు గుద్దుతూ.. జుట్టుపట్టుకుని లాగి.. చితకబాదారు. వారి చేతుల నుంచి బయటపడటానికి సదరు మహిళ శాయశక్తుల ప్రయత్తించినప్పటికి వీలు కాలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాస్క్ ధరించకపోవడం మహిళ తప్పే.. కానీ పోలీసులు ఇంత ఓవరాక్షన్ చేయడం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు. ఆ వివరాలు.. ఓ మహిళ తన కుమార్తెతో కలిసి సరుకులు తేవడానికి రోడ్డు మీదకు వచ్చింది. ఆ సమయంలో ఆమె మాస్క్ ధరించలేదు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులు సదరు మహిళపై దాడి చేశారు. మహిళా పోలీసు అధికారి మహిళను పట్టుకుని ఉండగా.. పురుష అధికారి మాత్రం ఆమె చేయి పట్టి లాగి.. కాళ్లతో తంతూ.. సదరు మహిళపై పిడిగుద్దులు కురిపించాడు. మహిళా అధికారి ఆమెను పోలీస్ వ్యాన్లో ఎక్కించడానికి ప్రయత్నిస్తుండగా.. ఆమె కూతురు తల్లిని వెనక్కి లాగే ప్రయత్నం చేసింది. అధికారులు ఏ మాత్రం కనికరించకుండా ఆమె జుట్టు పట్టుకుని లాక్కెళ్లి వ్యాన్లో ఎక్కించేందుకు ప్రయత్నించారు. కుదరకపోవడంతో ఓ మహిళ అధికారి ఆమె చంప పగలకొడుతుంది. రోడ్డు మీద వెళ్తున్నవాళ్లు ఈ అరచకాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనుల ‘‘నేరస్తులను కూడా ఇంత దారుణంగా కొట్టరు కదా.. మాస్క్ ధరించనందుకు.. పెద్దావిడ అని కూడా చూడకుండా ఇంత దారుణంగా దాడి చేస్తారా.. మీరు మనుషులా రాక్షసులా’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: మాస్క్ పెట్టుకోనందుకు ప్రధానికి రూ.14 వేల జరిమానా -
మహిళా ఎమ్మెల్యే భర్త వీరంగం!
-
మహిళా ఎమ్మెల్యే భర్త వీరంగం!
జైపూర్: చలానా రాశాడన్న కారణంగా బీజేపీ ఎమ్మెల్యే భర్త ఓ పోలీసుపై దుర్భాషలాడుతూ.. దాడిచేశారు. ఈ ఘటన రాజస్థాన్ లోని కోటా జిల్లా మహవీర్ నగర్ పోలీస్ స్టేషనల్ పరిధిలో చోటుచేసుకుంది. స్టేషన్ ఎస్ హెచ్ఓ రామ్ బసైదా కథనం ప్రకారం.. బీజేపీ కార్యకర్త వెళ్తున్న వాహనాన్ని ఆపిన పోలీసులు తనిఖీ చేసి, డాక్యుమెంట్లు లేని కారణంగా చలానా రాశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ ఎమ్మెల్యే చంద్రకాంత మేఘవాల్, భర్త నరేంద్ర మేఘవాల్ తో కలిసి అక్కడికి వెళ్లారు. ఇద్దరు కలిసి డ్యూటీలో ఉన్న పోలీసులపై విరుచుకుపడ్డారు. మర్యాదగా తమ పార్టీ వ్యక్తిని వదిలిపెట్టాలని, చలానా ఎందుకు రాశారని.. డబ్బు చెల్లించే ప్రసక్తే లేదంటూ గొడవకు దిగి ఎమ్మెల్యే భర్త ఓ పోలీసుపై చేయి చేసుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఏ ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. డీఎస్పీ కునారమ్ జాత్ సీనియర్ పోలీసులతో జరిగిన వివాదంపై చర్చించనట్లు సమాచారం. ఎంపీ ఓ.ఎమ్.బిర్లా, ఇతర బీజేపీ నేతలు గొడవ సద్దుమణిగేలా చేయాలని, కేసు లాంటివి లేకుండా రాజీ కుదర్చాలని యత్నిస్తున్నారు. మరోవైపు పోలీసులు మాత్రం ఈ విషయంపై సీరియస్ గా ఉన్నారు. డ్యూటీలో ఉన్న వ్యక్తిపై దాడి చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ నేతల ఒత్తిడితో ఎమ్మెల్యే భర్త నరేంద్ర మేఘవాల్ ను అరెస్ట్ చేయలేదని తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.