breaking news
thashildar office
-
సర్పంచ్, ఉపసర్పంచ్‌ల నిర్బంధం
నందిపేట్(ఆర్మూర్): నందిపేట మండలం లక్కంపల్లి గ్రామ శివారులోని సెజ్ భూములను అమ్మకాలు జరుపుతున్నారని ఆరోపిస్తూ సోమవారం గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులను గ్రామస్తులు నిర్బంధించారు. వివరాలిలా ఉన్నాయి. వ్యవసాయ ఆధారిత కేంద్రం (సెజ్) లో రెండు కులసంఘాలకు స్థలాలు ఇచ్చేందుకు గాను భూములను పరిశీలించేందుకు సోమవారం తహసీల్దార్ అనిల్‌కుమార్‌తో పాటు సర్పంచ్ మూడ సుమలత వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి వెళ్లి ఆందోళన చేశారు. గ్రామస్తులకు, పాలకవర్గ సిబ్బందికి తెలియకుండా సర్పంచ్ భర్త మూడ మహేందర్ భూములను అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారని ఆందోళన చేశారు. అంతేగాకుండా పాలకవర్గానికి, గ్రామస్తులకు తెలియకుండా గ్రామపంచాయతీ తీర్మానం కాపీని ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రాంతం వారికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతో తమ విలువైన భూములను సెజ్‌కు అప్పగించామని ఇప్పుడు తమకు తెలియకుండా భూములను అక్రమంగా అమ్మేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని మాట్లాడేందుకు గాను గ్రామపంచాయతీ కార్యాలయానికి చేరుకున్న గ్రామ సర్పంచ్ మూడ సుమలత, ఉప సర్పంచ్ మాయాపురం శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి రమేష్, కారోబార్ కిషన్‌లను గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం గదిలో నిర్బంధించి తాళం వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు లక్కంపల్లి గ్రామానికి చేరుకుని గ్రామస్తులు, యువకులతో మాట్లాడి వారిని శాంతిప జేసే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికురులు సమస్యను తేల్చేంత వరకు వీరిని వదిలి పెట్టేది లేదని పోలీసులతో గ్రామస్తులు, యువకులు వాగ్వివాదం చేశారు. ఆందోళన చేసిన వారిని పోలీసు స్టేషన్‌కు తరలించారు. -
తహసీల్దార్ కార్యాలయంలో ఒకేఒక్కడు
సిబ్బంది లేక ఇబ్బంది అవస్థలు పడుతున్న ప్రజలు గండేడ్ : మండల తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది లేక ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ శ్రీనివాస్‌రావు కార్యాలయ బాధ్యతలు నిర్వహిస్తూ అదనపు బాధ్యతలు కూడా నిర్వహించకతప్పడం లేదు. తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహల్దార్, ఆర్ఐ, సీనియర్ అసిస్టెంట్, ఏఎస్ఓ, సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ల అవసరం ఉంటుంది. కానీ మూడు నెలల క్రితం డిప్యూటీ తహసీల్దార్ భరత్‌గౌడ్ కార్యాలయ పనుల విషయంలో సస్పెండ్ కాగా రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుగుణమ్మ మెడికల్ లివ్ తీసుకున్నారు. సీనియర్ అసిస్టెంట్ నరేంద్‌రెడ్డి ప్రమోషన్‌పై శిక్షణకు వెళ్లగా, ఏఎస్ఓ పోస్టు ఖాళీ ఉంది. సర్వేయర్, జూనియర్ అసిస్టెంట్, రికార్డు అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో రెవెన్యూ కార్యాలయంలో ఎలాంటి పనులు చేయాలన్నా అధికారులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.