thangavelu
-
సీపీఐ(ఎం) సీనియర్ నేత తంగవేలు మృతి
సాక్షి, చెన్నై : కార్మిక హక్కులకోసం పోరాడిన సీపీఐ(ఎం) సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కె తంగవేలు(69) కరోనా కారణంగా మరణించారు. గత14 రోజులుగా ఓప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. తంగవేలుకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మార్క్సిస్ట్ సిద్ధాంతకర్తగా సుమారు 25 సంవత్సరాలుగా సేవలందించిన ఆయన కార్మికహక్కుల కోసం అనేకప పోరాటాలు చేశారు. బనియన్ మిల్లు కార్మికుడిగా జీవితాన్ని ప్రారంభించిన తంగవేలు వివిధ కార్మిక సంఘాలలో పనిచేశారు. నిజయితీ గల నాయకుడిగా తంగవేలుకు పార్టీలోనూ ప్రజల్లోనూ మంచి పేరుంది. 2011-16 సంవత్సరంలో తిరుపూర్ సౌత్ అసెంబ్లీ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తంగవేలు మరణం పట్ల పలువురు నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనకు మూడు రోజులపాటు సంతాపదినాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) నిర్ణయించింది. గౌరవ చిహ్నంగా పార్టీ జెండాను మూడు రోజులపాటు అవతనం చేస్తామని నేతలు తెలిపారు. (రఘువంశ్ ప్రసాద్ సింగ్ మృతి పట్ల ప్రముఖుల సంతాపం) -
పారాలింపిక్స్ విజేతలకు వైఎస్ జగన్ కంగ్రాట్స్
హైదరాబాద్: రియో పారాలింపిక్స్ లో పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. దీపా మలిక్, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భటిలకు ఆయన అభినందనలు చెప్పారు. తృటిలో కాంస్య పతకం కోల్పోయినప్పటికీ పవర్ లిఫ్టర్ ఫర్మాన్ భాషా మంచి ప్రయత్నం చేశాడని ప్రశంసించారు. ‘దీపా మలిక్, మరియప్పన్ తంగవేలు, వరుణ్ సింగ్ భటిలకు అభినందనలు. ఫర్మాన్ మంచి ప్రయత్నం చేశాడు. పారాలింపిక్స్ లో మన అథ్లెట్లు చూపిన దృఢత్వం, అంకితభావం మనందరికీ గర్వకారణమ’ని వైఎస్ జగన్ మంగళవారం ట్వీట్ చేశారు. ఇప్పటివరకు రియో పారాలింపిక్స్‌లో భారత్‌కు మూడు పతకాలు లభించాయి. పురుషుల హైజంప్‌లో మరియప్పన్ తంగవేలు స్వర్ణం, వరుణ్ సింగ్ భటి కాంస్యం నెగ్గారు. మహిళల షాట్‌పుట్ (ఎఫ్-53) ఈవెంట్లో భారత క్రీడాకారిణి దీపా మలిక్ రజత పతకాన్ని సొంతం చేసుకుంది. పురుషుల 49 కిలోల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ఫర్మాన్ నాలుగో స్థానంలో నిలిచి కొద్దిలో పతకం కోల్పోయాడు. Congrats DipaMalik,Thangavelu,Bhati. Good attempt Farman. Proud of the grit & determination shown by all our athletes #ParalympicsRio2016 — YS Jagan Mohan Reddy (@ysjagan) 13 September 2016 -
పాదం లేకున్నా... పట్టుదల ఉంది
-
రియోలో తంగం
సాక్షి, చెన్నై: రియోలో తమిళ తంగం (బంగారం) మెరిశాడు. తమిళ ఖ్యాతిని ఎలుగెత్తి చాటే రీతిలో, భారత దేశ క్రీడాలోకానికి మరెంతో వన్నె చేకూర్చాడు. పారాలింపిక్లో హైజంప్ విభాగంలో మారియప్పన్ తంగవేల్ బంగారు పతకం కైవసం చేసుకున్న సమాచారంతో సేలం జిల్లా పెరియవడగం పట్టి గ్రామం ఆనంద సాగరంలో మునిగింది. తమిళ సత్తాను ప్రపంచ దేశాలకు చాటిన మారియప్పకు అమ్మ జయలలిత రూ. రెండు కోట్లు ప్రకటించారు. తరగతి స్థాయిలో క్రీడల్లో ప్రేక్షకుడిగా ఓ మూలన కూర్చుని, ఇప్పుడు రియో పతకంతో హీరోగా అవతరించిన ఈ తంగంకు అభినందనలు, ప్రశంసలు హోరెత్తుతున్నాయి. రియో వేదికగా గత నెల భారతవనితలు షట్లర్ పీవీ సింధు రాకెట్ వేగంతో వెండి, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కంచు మోత మోగించి కోట్లాది మంది భారతీయుల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్నారు. వీరిని అభినందనలతో ముంచెత్తే రీతిలో తమిళనాట అభిమానులు ఆనంద తాండ వం చేశారు. తాజాగా, తమ రాష్ట్రానికి చెందిన క్రీడాకారుడు ఏకంగా బంగారం తన్నుకు వస్తుండడంతో తమిళులకు గర్వకారణంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఆ క్రీడాకారుడెవరో కూడా తెలియని వాళ్లు, ఇప్పుడు మా బంగారమే అని గొప్పలు చెప్పుకునే పనిలో పడడం గమనార్హం. మా బంగారం : రియో వేదికగా ప్రస్తుతం పారాలింపిక్ పోటీలు జరుగుతున్నాయి. శనివారం జరిగిన హైజంప్‌లో తమిళనాడుకు చెందిన ఇరవై ఏళ్ల వయసు కల్గిన క్రీడాకారుడు మారియప్పన్ తంగవేల్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడన్న సమచారం తమిళనాట ప్రతి ఒక్కరిలో ఆనందాన్ని నింపింది. ప్రధానంగా మారియప్ప స్వగ్రామం సంబరాల్లో మునిగింది. చిన్న పాటి గ్రామంలో బాణా సంచాల మోత రాష్ట్రాన్ని తాకింది. రాష్ట్ర వ్యాప్తంగా మారియప్పన్‌ను అభినందించే వాళ్లే. చొక్క తంగం (స్వచ్ఛమైన బంగారం) అని మారియప్పన్‌ను ప్రశంసలతో ముంచెత్తే వాళ్లే అధికం. రాష్ర్ట గవర్నర్(ఇన్) సీహెచ్ విద్యాసాగర్‌రావు, రాష్ట్ర ముఖ్యమంత్రి జె జయలలిత, డీఎంకే అధినేత ఎం కరుణానిధి, ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్, డీఎండీకే అధినేత విజయకాంత్, ఎండీఎంకే నేత వైగో తదితర పార్టీల నాయకులు అభినందనలతో ముంచెత్తే పనిలో పడ్డారు. నిన్న మొన్నటి వరకు మారియప్పన్ అంటే, ఎవరో తెలియని వాళ్లకు ఇప్పడు ఆ బంగారం హీరో అయ్యాడు. ఏ నోట విన్నా, బంగారం మాటే. సోషల్ మీడియాల్లో, వాట్సాప్‌లలో మారియప్పన్ స్పెషల్ అట్రాక్షన్‌గా మారడం విశేషం. అమ్మ రూ. రెండు కోట్లు : మారియప్పన్‌కు బంగారం దక్కిందన్న సమాచారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత స్పందించారు. అభినందనలు తెలుపుతూ, రూ. రెండు కోట్లు ప్రకటించారు. తమిళనాడు ఖ్యాతిని ఎలుగెత్తి చాటిన మారియప్పన్, క్రీడాలపై ఉత్సాహాన్ని చూపుతున్న ఇక్కడి పిల్లలకు ఆదర్శంగా నిలిచే స్థాయి ఎదిగాడని అభినందించారు.ప్రేక్షకుడి నుంచి : సేలం నగరానికి యాభై కిమీ దూరంలో పెరియవడగం పట్టి గ్రామం ఉంది. ఇది ఓమలూరు డివిజన్ పరిధిలో కుగ్రామం. మారియప్పన్ తండ్రి తంగవేలు, తల్లి సరోజ. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. పెద్ద వాడైన మారియప్పన్ ఐదో ఏట స్కూల్‌కు వెళ్తూ, జరిగిన ప్రమాదంలో కుడి కాలు పాదం కోల్పోవాల్సి వచ్చింది. కూలి పనులకు వెళ్తే గానీ పూట గడవని ఆ కుటుంబాన్ని ఈ ప్రమాదం కృంగ దీసింది. బిడ్డను రక్షించుకునేందుకు అప్పట్లో ఆ కుటుంబం తీవ్రంగానే కష్ట పడింది. పాదం కోల్పోయినా బిడ్డ తమకు ప్రాణాలతో దక్కడం ఆనందమే. తాను దివ్యాంగుడు కావడంతో ఆటల్లో ఎవ్వరూ అక్కున చేర్చుకోక పోవడంతో తరగతి స్థాయిలో ఓ మూలన కూర్చుని ప్రేక్షకుడి పాత్ర పోషించే వాడు. ఆరో తరగతిలో మారియప్పన్ క్రీడాస్ఫూర్తిని పీఈ మాస్టర్ రాజేంద్రన్ గుర్తించారని చెప్పవచ్చు. హైజంప్‌లో విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటుంటే, ఓ మూలన కూర్చుని తదేకంగా వారి ఎత్తుగడలను వీక్షించడమే కాకుండా, ఎవ్వరూలేని సమయంలో తాను సైతం అంటూ హైజంప్ చేస్తుండడం రాజేంద్రన్ కంట పడింది. రియోకు : మారియప్పన్లో ఉన్న ఉత్సాహానికి ప్రోత్సాహం లభించినట్టు అయింది. తాను దివ్యాంగుడు అన్న విషయాన్ని మరచే స్థాయిలో అతడికి రాజేంద్రన్ శిక్షణ ఇచ్చినట్టుగా పెరియవడగం పట్టి వాసులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయులు, అతడి మిత్రులు ఇచ్చిన సహకారం ప్రోత్సాహం మండల స్థాయిలో పతకాలను, తదుపరి జిల్లా స్థాయిలో, తదనంతరం రాష్ట్ర స్థాయి నుంచి విదేశీ స్థాయి పోటీలకు చేర్చాయని చెబుతున్నారు. కడు పేదరికంలో పుట్టిన మారియప్పన్ అనేక సార్లు కూలి పనులకు సైతం వెళ్లినట్టు పేర్కొంటున్నారు. ఇప్పుడు అందరి సహకారంతో రియోలో అడు పెట్టి బంగారంతో తిరిగి వస్తున్న మారియప్పన్‌కు తమ గ్రామంలో ఘన స్వాగతం పలికేందుకు అక్కడి యువత సిద్ధం అవుతున్నది. తనయుడు బంగారం పట్టాడన్న సమాచారంతో తల్లి సరోజ ఉద్వేగానికి గురి అయ్యారు. తన బిడ్డ ఈ స్థాయికి చేరడంలో అందరి సహకారం ఉందని, అమ్మ రూ. రెండు కోట్లు ప్రకటించడం ఆనందంగా ఉందంటూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఇక, రియో నుంచి మారియప్పన్ మీడియాతో మాట్లాడుతూ అమ్మ జయలలిత క్రీడాకారులకు మంచి సహకారం అందించారని, అందిస్తూనే ఉన్నారని పేర్కొంటూ, అమ్మతో పాటు అందరికీ తన కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. -
తంగవేలు...నీకు జేజేలు
భారతదేశం ప్రతిరోజు ఆశగా నిద్ర లేచింది. కానీ స్వర్ణం కల సాకారం కాకుండానే ఒలింపిక్స్ ముగిశాయి. అయితే అదే వేదికలో ఒలింపిక్స్ ముగిసిన 20 రోజుల తర్వాత భారత్‌కు బంగారు కల నెరవేరింది. రియోలోనే జరుగుతున్న పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ తంగవేలు హైజంప్‌లో స్వర్ణం సాధించి మువ్వన్నెలు రెపరెపలాడించాడు. ఇదే ఈవెంట్లో వరుణ్ సింగ్ భటి కాంస్యం సాధించడంతో ఆనందం రెట్టింపయిది. దివ్యాంగుల కోసం నిర్వహించే పారాలింపిక్స్‌లో పతకాలు సాధించిన ఈ ఇద్దరికీ భారత్ జేజేలు పలుకుతోంది. పారాలింపిక్స్‌లో పతకం సాధిస్తానని నమ్ముతూ వచ్చాను. రియోకి రావడానికి ముందే 1.85మీ. ఎత్తును అధిగమించాను. నేను మాజీ ప్రపంచ నంబర్‌వన్‌ను. అందుకే అంత నమ్మకంతో ఉన్నాను. ఇక స్వర్ణం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఇది అత్యంత మధురమైన రోజు. నా కోచ్ సత్యనారాయణ, సాయ్ అధికారుల కృషిని మరువలేను. కేంద్రం ‘టాప్’ స్కీంలో నేనూ ఉన్నాను. శిక్షణ కోసం జర్మనీ పంపారు. -తంగవేలు రియో డి జనీరో: పారాలింపిక్స్‌లో రెండో రోజే భారత మువ్వన్నెల పతాకం రెపరెపలాడింది. దేశ అథ్లెట్ల సంచలన ప్రదర్శనతో ఒకే ఈవెంట్లో రెండు పతకాలు వచ్చారుు. శనివారం తెల్లవారుజామున జరిగిన పురుషుల హైజంప్ టి-42లో తమిళనాడుకు చెందిన మరియప్పన్ తంగవేలు కొత్త చరిత్ర సృష్టిస్తూ స్వర్ణం సాధించగా... ఇదే విభాగంలో వరుణ్ సింగ్ భటి కాంస్యం సాధించాడు. మరో అథ్లెట్ శరద్ కుమార్ ఆరో స్థానంలో నిలిచాడు. తంగవేలు 1.89మీ. ఎత్తుకు ఎగిరి అగ్రస్థానంలో నిలవగా... భటి 1.86మీ.తో మూడో స్థానంలో నిలి చాడు. అమెరికాకు చెందిన సామ్ గ్రెవే (1.86) రెండో స్థానంతో రజతం అందుకున్నాడు. ఇటీవల ట్యునీషియాలో జరిగిన ఐపీసీ గ్రాండ్‌ప్రి ఈవెంట్లో తంగవేలు 1.78మీ. జంప్‌తో స్వర్ణం అందుకున్నాడు. హోరాహోరీ పోరాటంలో... ఈసారి పారాలింపిక్స్ హైజంప్ పోటీ ఉత్కంఠభరితంగా సాగింది. మొత్తం 12 మంది అథ్లెట్లు పాల్గొన్న హైజంప్‌లో తొలి ఎనిమిది ప్రయత్నాల్లో 1.74మీ. అర్హత ప్రమాణాన్ని ఆరుగురు అథ్లెట్లు సాధించారు. పదో ప్రయత్నంలో తంగవేలు 1.77మీ. హైజంప్ చేసి సహచర అథ్లెట్ శరద్ కుమార్, మరో ఇద్దరితో కలిసి టాప్‌లో నిలిచాడు. కానీ చివరి దశల్లో పోటీ హోరాహోరీగా సాగింది. శరద్ నిరాశపరుస్తూ నిష్ర్కమిం చగా అటు తంగవేలు, వరుణ్ భటి 1.83మీ. ఎత్తుతో అందరికన్నా ముందు నిలిచారు. ఆ తర్వాత సామ్ గ్రెవే వీరిద్దరిని వెనక్కి నెట్టి 1.86మీ. జంప్‌తో టాప్‌లో నిలిచాడు. కానీ ఫైనల్ ప్రయత్నంలో తంగవేలు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ఏకంగా 1.89మీ. హైజంప్‌తో స్వర్ణం అందుకోగా గ్రెవే, వరుణ్ 1.86మీ.లతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచారు. గ్రెవే, వరుణ్ ఇద్దరూ సమాన ఎత్తు ఎగిరినా... గ్రెవే తన తొలి ప్రయత్నంలో 1.86మీ. ఎగిరాడు. దీంతో తనకు రజతం లభించింది. వరుణ్ తన మూడో ప్రయత్నంలో 1.86మీ. ఎగిరాడు.