breaking news
Thagubotu Ramesh
-
ఏకే రావ్... పీకే రావ్ నవ్విస్తారు!
‘‘పూర్తి స్థాయి కామెడీ సినిమా ఇది. ఇందులోని ప్రతి పాత్రా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించడం ఖాయం’’ అని దర్శకుడు కోటపాటి శ్రీను చెప్పారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘ఎ.కె.రావ్-పి.కె.రావ్’ చిత్రం ద్వారా హాస్యనటులు ధనరాజ్, తాగుబోతు రమేశ్ హీరోలుగా పరిచయమవుతున్నారు. సాయి వెంకటేశ్వర కంబైన్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో ధనరాజ్ మాట్లాడుతూ -‘‘దర్శకుడు కథ చెప్పినప్పుడు ఈ పాత్రలకు మేం న్యాయం చేయగలమా లేదా అని ఆలోచించుకుని ఈ సినిమా ఒప్పుకున్నాం. ఇందులో మాకు ఫైట్లు, డాన్సులు ఉన్నాయి. ఎక్కడా ఓవర్‌గా అనిపించదు’’ అని తెలిపారు. ఇందులో కామెడీ విలన్‌గా చేశానని ‘వెన్నెల’ కిశోర్ చెప్పారు. కుటుంబం మొత్తం ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందని తాగుబోతు రమేశ్ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రుతి రాజ్, శ్రీరామ్ చౌదరి, స్వర్ణ సుధాకర్, గుత్తి మల్లిఖార్జున్, శివకుమార్ మాట్లాడారు. -
నవ్వించే ‘ఏకే రావ్ పీకే రావ్’
హాస్యనటులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ ‘ఏకే రావ్ పీకే రావ్’ చిత్రంతో హీరోలుగా మారారు. సాయివెంకటేశ్వర కంబైన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి కోటపాటి శ్రీను దర్శకత్వం వహించారు. కేఎస్సార్ స్వరపరచిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. పాటల సీడీని నాని ఆవిష్కరించి, దామోదరప్రసాద్, నందినీరెడ్డికి ఇచ్చారు. ఈ చిత్రం ద్వారా ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ కెరీర్ మరింత పుంజుకోవాలని, తమ సంస్థ ద్వారా తాగుబోతు రమేష్‌కి బ్రేక్ రావడం ఆనందంగా ఉందని దామోదరప్రసాద్ అన్నారు. తను నటించిన అలా మొదలైంది, ఈగ, భీమిలి కబడ్డీ చిత్రాల్లో ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ చేశారనీ, ఈ ఇద్దరూ హీరోలుగా నటించిన ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నాని చెప్పారు. ధన్‌రాజ్, రమేష్ కష్టపడే తత్వం ఉన్నవారని, ఈ చిత్రం బాగా ఆడి నిర్మాతకు లాభాలు రావాలని శివాజి తెలిపారు. ఓ ఏరియాలో ఈ సినిమాని పంపిణీ చేస్తున్నానని సురేష్ కొండేటి అన్నారు. టైటిల్ రోల్స్‌ని భుజాన మోయగలమనే నమ్మకం కుదరడం, కథలో వినోదం ఉండటంతో ఈ సినిమా చేశామని ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ చెప్పారు. ఇంకా నందినీరెడ్డి, మారుతి, ప్రిన్స్, డీయస్ రావు, బెక్కెం వేణుగోపాల్ తదితరులు సినిమా విజయం సాధించాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు.