breaking news
	
		
	
  Texas man
- 
      
                   
                               
                   
            చెంపచెళ్లుమనిపించిన పోర్న్ స్టార్

 టెక్సాస్ :
 ప్రముఖ పోర్న్ స్టార్ మియా ఖలీఫాతో సెల్ఫీ దిగాలనుకున్న ఓ యువకుడి గూబ గుయ్మంది. టెక్సాస్‌లోని సాన్ ఆంటోనియోకు చెందిన ఓ 20 ఏళ్ల యువకుడు మియాఖలీఫా పర్మిషన్ లేకుండానే సెల్ఫీ తీశాడు. దీంతో చిర్రెత్తుకొచ్చి మియా ఆ యువకుడి చెంప చెళ్లు మనిపించింది. యువకుడు మియా ఖలీఫా కొట్టిన చెందెబ్బకు కుంగిపోకుండా ఆమె కొట్టిన చెంపదెబ్బ తనకు ఓ గాయాన్ని మిగిల్చింది అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. మియా వద్దంటున్నా తీసిన సెల్ఫీతో పాటూ చెంపపై లాగి కొట్టడంతో తగిలిన గాయానికి సంబంధించి ఫొటోలను తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. మియా ఖలీఫాతో ఫొటో తీసుకున్నా.. నా చెంపపై గట్టిగా ఓ పంచ్ కూడా ఇచ్చింది... ఓ గాయం కూడా మిగిలింది అంటూ ఓ కామెంట్ కూడా పెట్టాడు.
 
 ఈ ట్వీట్ తక్కువ సమయంలోనే వైరల్ అయ్యింది. దీనికి సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన లభించింది. ఎలాంటి చెంపదెబ్బలు తినకుండానే తమ అభిమాన పోర్న్ స్టార్‌తో సెల్ఫీలు తీసుకున్నామంటూ మియాఖలీఫాకు అండగా ఆమె అభిమానులు సెల్ఫీ ఫొటోలను పోస్ట్ చేశారు. అయితే ఈ తతంగంపై సోషల్ మీడియాలో భారీగా స్పందన రావడంతో మియా ఖలీఫా స్పందించింది.
 
 నేను నడుస్తూ ఉంటే నా మొహంవైపు కెమరాపెట్టి కుప్పి గంతులు వేయకుండా, సెల్ఫీ కావాలని నన్ను మర్యాదగా అడిగి సెల్ఫీలు తీసుకున్న మీ అందరికీ థాంక్స్ అంటూ తనకు అండగా నిలిచిన అభిమానులను ఉద్దేశించి ట్వీట్ చేసింది.
 - 
      
                   
                               
                   
            చికెన్ ముక్క కోసం చంపేశాడు

 లండన్ : చికెన్ ముక్క ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది. పార్టీలో చికెన్ ముక్క కోసం చెలరేగిన స్వల్ప వివాదంతో స్నేహితుడిని పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. హూస్టన్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం రినాల్డ్ కార్డోసో రివేరా (38) డార్విన్ పెరెజ్ గోంజాలెజ్ (34) ఇద్దరూ స్నేహితులు. పెరేజ్ నివాసంలో మరో అయిదుగురు స్నేహితులు కలిసి పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. చికెన్, మందుతో విందు జోరుగా నడుస్తోంది.
 
 ఈ క్రమంలో డార్విన్ చికెన్ ఆఖరి ముక్కను ఆరగిస్తున్నాడు. అయితే ఆ ముక్క తనకు కావాలంటూ రివేరా అనటంతో .... ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది. అసలే మద్యం సేవించి ఉన్నారేమో, విచక్షణ మరిచిపోయారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న క్రమంలో రివేరా, డార్విన్ పై కత్తి దూశాడు. ఆగ్రహం పట్టలేని రివేరా...స్నేహితుడిని పలుమార్లు కత్తితో పొడిచి అతి దారుణంగా చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినా , ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు. 


