చికెన్ ముక్క కోసం చంపేశాడు
చికెన్ ముక్క ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.
	లండన్ : చికెన్ ముక్క ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ దారుణం చోటు చేసుకుంది.  పార్టీలో చికెన్ ముక్క కోసం చెలరేగిన స్వల్ప వివాదంతో స్నేహితుడిని  పొడిచి చంపిన ఘటన కలకలం రేపింది. హూస్టన్ పోలీసులు అందించిన వివరాల ప్రకారం  రినాల్డ్ కార్డోసో రివేరా (38)  డార్విన్  పెరెజ్ గోంజాలెజ్ (34) ఇద్దరూ స్నేహితులు.  పెరేజ్ నివాసంలో మరో అయిదుగురు స్నేహితులు కలిసి  పార్టీ ఏర్పాటు చేసుకున్నారు. చికెన్, మందుతో విందు జోరుగా నడుస్తోంది.
	
	ఈ  క్రమంలో  డార్విన్  చికెన్ ఆఖరి ముక్కను ఆరగిస్తున్నాడు. అయితే ఆ ముక్క తనకు కావాలంటూ రివేరా అనటంతో ....  ఇద్దరి మధ్యా  మాటా మాటా పెరిగి తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.   అసలే మద్యం సేవించి ఉన్నారేమో, విచక్షణ మరిచిపోయారు.  ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న క్రమంలో రివేరా, డార్విన్  పై కత్తి దూశాడు. ఆగ్రహం పట్టలేని రివేరా...స్నేహితుడిని పలుమార్లు కత్తితో పొడిచి  అతి దారుణంగా చంపేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయినా , ఆ తరువాత పోలీసులకు లొంగిపోయాడు.

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
