breaking news
texas cities
-
చేపల వర్షం గురించి విన్నారా!... నిజంగా ఆకాశం నుంచి చేపలు ఊడి పడ్డాయట!
Fish Fall From Sky During Rain: మనం ఇంతవరకు వాతావరణ మార్పులు, కాలుష్యం కారణంగా రకరకాల వర్షాలు పడటం చూశాం. పైగా నిప్పుల వర్షం, యాసిడ్ వర్షం వంటి రకరకాల వర్షాలు గురించి కూడా విన్నాం . అయితే ఇప్పుడు యూఎస్‌లో చేపల వర్షం పడింది. ఆకాశం నుంచి చేపలు ఊడి పడ్డాయట. (చదవండి: రావణుడి వేషధారణలో పాల ప్యాకెట్ పట్టుకొని..) అసలు విషయంలోకెళ్లితే...అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలోని టెక్సర్కానా నగరంలో చేపల వర్షం కురిసింది. నిజానికి వరదలు వచ్చినప్పుడు చేపలు, పాములు, పీతలు వంటి రకరకాల జంతువులు కొట్టుకురావడం సహజం. కానీ టెక్సాస్‌లో తుపాను కారణంగా కురిసిన వానకు ఆకాశం నుచి చేపలు పడ్డా వింత సంఘటన చోటుచేసుకుంది. ఒక వేళ వర్షం కారణంగా భూమి నాని ఉపరితలం పైన చిన్న చేపలు, పీతలు వంటివి రావడం వంటివి జరుగుతుంది. కానీ వాటిన్నిటికి భిన్నంగా చేపలు ఆకాశం నుంచి ఊడిపడటమే వింతగా ఉంది. ఈ మేరకు చేపల వర్షం కురిసిందంటూ టెక్సాస్ నగరం ఫేస్బుక్లో ఒక ఫోటో కూడా పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు ఒకరేమో "స్వర్గం నుంచి ఉడిపడ్డ చేప" అని మరోకరేమో "డబ్లు వర్షం కూడా పడితే బాగుండును" అంటూ రకరకాలుగా కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు. (చదవండి: రోగిని బ్లాక్ మెయిల్ చేసి రూ 20 లక్షలు దోచుకునేందుకు యత్నంచిన నర్సు) -
అమెరికాలోనూ భారీగా..
అందరూ ఇళ్ల నుంచి చాపలు తెచ్చుకున్నారు. చకచకా వాటిని క్రమపద్ధతిలో పరిచేసుకున్నారు. వాటిమీద పడుకుని రకరకాల భంగిమలలో యోగాసనాలు వేయడం మొదలుపెట్టారు. ఇదంతా ఢిల్లీలోనో, ముంబైలోనో అనుకుంటున్నారా.. అమెరికాలో. మంగళవారం అంతర్జాతయ యోగా దినోత్సవం సందర్భంగా ఇప్పటినుంచే అమెరికాలో ప్రాక్టీసు మొదలుపెడుతున్నారు. హ్యూస్టన్‌లోని పలు పాఠశాలలు, పతంజలి యోగపీఠం, ప్రళయ యోగా స్టూడియోల సహకారంతో భారతీయ కాన్సులేట్ జనరల్ ఈ కార్యక్రమాన్ని డిస్కవరీ గ్రీన్ ప్రాంతంలో నిర్వహిస్తోంది. హ్యూస్టన్‌లో భిన్నవర్గాలకు చెందిన వారిని పెద్ద సంఖ్యలో ఇక్కడకు తీసుకొస్తున్నామని, అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని మంచి పద్ధతిలో చేస్తున్నామని భారత కాన్సల్ జనరల్ అనుపమ్ రే తెలిపారు. హ్యూస్టన్ వాసులంతా పెద్దసంఖ్యలో తరలి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, యోగాతో శాంతి సామరస్యాల సందేశాన్ని అందరికీ పంచాలని ఆయన కోరారు. టెక్సాస్ రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.