breaking news
test-fire
-
టోర్పెడో పరీక్ష సక్సెస్
న్యూఢిల్లీ: దేశీయంగా తయారుచేసిన స్కార్పీన్ తరగతి జలాంతర్గామి నుంచి టోర్పెడోను శుక్రవారం విజయవంతంగా ప్రయోగించారు. ఈ జలాంతర్గామిని నేవీకి అప్పగించడానికి ముందు చేపట్టిన చివరి పరీక్ష ఇదేనని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. తొలి స్కార్పీన్ జలాంతర్గామి అయిన ‘కల్వరి’ నుంచి ఈ ప్రయోగం జరిగింది. కానీ పరీక్షించిన టోర్పెడో వివరాలు బహిర్గతం కాలేదు. తాజా పరీక్ష విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ హర్షం వ్యక్తం చేశారు. ఇందులో పాల్గొన్న శాస్త్రవ్తేతలు, ఇంజినీర్లను అభినందించారు. -
ఆధునిక బ్రహ్మాస్ క్షిపణి పరీక్ష విజయవంతం
బలాసోర్: భారత్ రక్షణ రంగంలో మరో ముందడుగు వేసింది. 290 కిలో మీటర్ల పరిధి గల ఆధునిక బ్రహ్మాస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి దాదాపు 500 సెకన్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. మంగళవారం ఒడిశా సముద్రతీర ప్రాంతం చాందీపూర్ క్షిపణి పరీక్షా కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించినట్టు బ్రహ్మాస్ చీఫ్ శివథాను పెళ్లై చెప్పారు. పర్వతాలలో, భవంతులలో దాక్కున్న శత్రువుల స్థావరాలను వంద శాతం కచ్చితత్వంతో ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ క్షిపణి ప్రత్యేకత. 300 కిలోల పేలుడు పదార్థాన్ని మోసుకుపోగల సామర్థ్యం ఉంది. బ్రహ్మాస్, డీఆర్డీఓ వాస్త్రవేత్తలు ఈ ప్రయోగంలో పాల్గొన్నారు.