breaking news
temporary shed
-
రేకుల పైకప్పు గదిలో... నిద్రించిన ప్రధాని మోదీ
డెహ్రాడూన్: సముద్ర మట్టానికి 11,300 అడుగుల ఎత్తున రేకుల పైకప్పుతో నిర్మించిన తాత్కాలిక గదిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాత్రి పూట నిద్రించారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) కార్మికుల కోసం వండిన కిచిడీని ఆరగించారు. శనివారం ఉత్తరాఖండ్ పర్యటనలో ఈ విశేషాలు చోటుచేసుకున్నాయి. మనా పట్టణ సమీపంలో బీఆర్ఓ డిటాచ్మెంట్ సెంటర్‌ను మోదీ సందర్శించిన సంగతి తెలిసిందే. ఓ కార్మికుడు సిద్ధం చేసిన కిచిడీ, మాండ్వీ కీ రోటీ, స్థానిక పచ్చడి, జాగోర్ కీ ఖీర్‌ను ఆహారంగా తీసుకున్నారని అధికారులు చెప్పారు. అంతేకాకుండా రేకుల పైకప్పుతో అప్పటికప్పుడు నిర్మించిన తాత్కాలిక నిర్మాణంలో సేదతీరారని వెల్లడించారు. ఈ గదిలో చిన్నపాటి ఎలక్ట్రిక్ హీటర్ మాత్రం ఉంది. రోడ్ల నిర్మాణంలో పాలుపంచుకుంటున్న కూలీలతో మోదీ సంభాషించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ బీఆర్ఓ సిబ్బంది కష్టపడి పనిచేస్తున్నారని ప్రశంసించారు. శ్రమయేవ సర్వం సాధ్యం (శ్రమతో ఏదైనా సాధ్యమే) అని విజిటర్స్ బుక్‌లో రాశారు. -
చంద్రబాబు తలచుకుంటే..
ఎయిర్‌పోర్టు పరిసరాల్లో తాత్కాలిక షెడ్డు నిర్మాణం కలెక్టర్ ఎన్.యువరాజ్ స్థలపరిశీలన విశాఖపట్నం: రాజు తలచుకుంటే.. కాదు కాదు సీఎం తలచుకుంటే ఏదైనా జరుగుతుంది. పగటి పూట వెన్నెల విరులు కురుస్తాయి. రాత్రి సూర్యుడు వెలుగులు చిందిస్తాడు. ఏంటో ఈ విడ్డూరం అనుకోవద్దు. ఎందుకంటే అలాంటి చిత్రాలే ఇప్పుడు జరుగుతున్నాయి. విషయమేమిటంటే సీఎం చంద్రబాబు రాజధాని అమరావతిలో కంటే విశాఖ నగరంలో పర్యటించిందే ఎక్కువ. సగటున వారానికోసారి నగరంలో అడుగుపెడుతున్నారు. ఆయనతో పాటు మంత్రులూ వస్తున్నారు. పైగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లాల్సి వచ్చినపుడు కూడా విశాఖ విమానాశ్రయంలో దిగి వెళుతున్నారు. ఎలా చూసినా సీఎం, మంత్రుల తాకిడి విశాఖకు విపరీతంగా పెరిగింది. వారు వచ్చి నపుడల్లా నగరంలోకి వచ్చి అతిథి గృహంలో విశ్రాంతి తీసుకోవడం, కార్యకర్తలను కలుసుకోవడం వంటి పనులకు సమయం సరిపోవడం లేదంట. దీంతో బాగా ఆలోచించిన పాలకులు ఎయిర్‌పోర్టు వద్దే అలాంటి ఏర్పాట్లు ఉంటే బాగుంటుందని భావించారు. అధికారం వారిది కాబట్టి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేసేశారు. వారి ఆదేశాల మేరకు ఎయిర్‌పోర్టులో సీఎం కోసం తాత్కాలిక షెడ్ నిర్మాణానికి కలెక్టర్ ఎన్.యువరాజ్ గురువారం స్థల పరిశీలన జరిపారు. నిజానికి ఈ స్థలం నేవీ ఆధీనంలో ఉంది. వారి నుంచి అనుమతి తీసుకోవాలి. అధికారులు తలుచుకుంటే ఇదేమంత పెద్ద కష్టం కాదులే. అయితే అధికారపార్టీ కార్యకలాపాలకు ఎయిర్‌పోర్టును వేదిక చేసుకోవడమే విడ్డూరంగా ఉంది మరి. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో త్వరలో నిర్మించనున్న ఈ షెడ్డును అంచెలంచెలుగా విస్తరించి టీడీపీ మినీ కార్యాలయంగా మార్చనున్నట్టు సమాచారం. కార్యకర్తల సమావేశాలు, పార్టీ సమీక్షలంటూ ఎయిర్‌పోర్టులో గందరగోళం సృష్టిస్తే దేశ, విదేశీ విమాన ప్రయాణికులకు ఇబ్బందిగా పరిణమించే అవకాశం ఉంది.