breaking news
tejeswar
-
‘హనీమూన్ మర్డర్’లా పోలీసులకు చిక్కొద్దని..
గద్వాల క్రైం: ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును జోగుళాంబ గద్వాల జిల్లా పోలీసులు ఛేదించారు. మేఘాల య హనీమూన్ మర్డర్ తరహాలో హత్య చేయించి.. అక్కడిలా తాము పోలీసులకు దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని.. అనంతరం లడాఖ్ లేదా అండమాన్‌కు వెళదామని ప్రియుడు, ప్రేయసి ప్లాన్ వేశారు. ఇందుకోసం ముందుగానే రూ.20 లక్షల రుణం కూడా తీసుకున్నారు. కానీ పోలీసులు సీసీ ఫుటేజీ, సెల్ సిగ్నల్స్ ఆధారంగా కేసును ఛేదించారు. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన తేజేశ్వర్ హత్య కేసు వివరాలను ఎస్పీ శ్రీనివాసరావు గురువారం వెల్లడించారు. తేజేశ్వర్‌తో ఐశ్వర్య పరిచయం ఇలా..గద్వాలలోని గంటవీధికి చెందిన తేజేశ్వర్(32) ప్రైవేటు సర్వేయర్. సుజాత కర్నూలులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఈమె పుట్టినిల్లు గద్వాలలోని జమిచేడ్. ఈమె కూతురే ఐశ్వర్య అలియాస్ సహస్త్ర. తల్లీకూతురు తరచూ గద్వా లలోని బంధువుల ఇంటి వచ్చేవారు. ఈ క్రమంలోనే తేజేశ్వ ర్తో ఐశ్వర్యకు పరిచయం ఏర్పడింది. ఇద్దరి కులాలు ఒక్కటే కావడంతో పెద్దలు పెళ్లి చేయాలనుకున్నారు. ఇదిలా ఉండగా, సుజాతకు బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఉంది. ఈ క్రమంలో తిరుమలరావు ఐశ్వర్యతోనూ కొంతకాలంగా వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విష యాన్ని దాచి ఎలాగైనా తన కూతురికి పెళ్లి చేయాలని సుజాత అనుకుంది. తేజేశ్వర్‌తో ఐశ్వర్య నిశ్చితార్థం చేయించింది. ఇది ఇష్టంలేని ఐశ్వర్య తిరుమలరావుతో కలిసి ఇంటి నుంచి వెళ్లిపో యింది. దీంతో పెద్దల సమక్షంలో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకు న్నారు. కొన్ని రోజుల తర్వాత తేజేశ్వర్, ఐశ్వర్య ఫోన్ లో మాట్లాడుకొని పెద్దల సమక్షంలో మే 18న బీచుప ల్లి ఆలయంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం కూడా ఐశ్వర్య తిరుమలరావుతో తరచూ ఫోన్లో మాట్లాడేది. ఈ విషయాన్ని గ్రహించిన తేజేశ్వర్ భార్యను మందలించాడు. దీంతో తమ బంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో ఐశ్వర్య, తిరుమలరావు కలిసి తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు పథకం వేశారు.నమ్మించి.. హత్య చేశారిలా..: తేజేశ్వర్‌ను హత్య చేసేందుకు కర్నూలు జిల్లా కృష్ణానగర్‌కు చెందిన సుపారీగ్యాంగ్ కుమ్మరి నాగేష్, చాకలి పరుశరాముడు, చాకలి రాజుతో రూ.6 లక్షలకు ఒప్పందం చేసుకున్నా రు. దీంతో ఆ గ్యాంగ్ ఫోన్ ద్వారా తేజేశ్వర్‌తో పరిచయం పెంచుకుంది. మీ జిల్లాలో తక్కువ ధరలకు భూములు ఉంటే చూపించండి అందుకు తగిన పారితోషికం ఇస్తామని నమ్మించారు. సర్వేయర్ కావడంతో తేజేశ్వర్ వారితో పలుమార్లు వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన భూములు కొనుగోలు చేస్తామని సుపారీ గ్యాంగ్ ఏపీ 39 యూకే 3157నంబర్ గల కారులో గద్వాలకు వచ్చారు. కారులో తేజేశ్వర్ ఎక్కించుకొని పలు ప్రాంతాలు తిరిగి వస్తుండగా, పథకంలో భాగంగా గద్వాల మండలం వీరాపురం శివారులో పరుశరాముడు మొదట కొడవలితో తేజేశ్వర్‌పై దాడి చేశాడు. ఆ వెంటనే చాకలి రాజు, కుమ్మరి నగేష్ కొడవలి, కత్తితో విచాక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో తేజేశ్వర్ కారులోనే మృతి చెందాడు. ఈ విషయాన్ని నగేష్ వాట్సప్ కాల్ ద్వారా తిరుమలరావుకు చెప్పగా, మృతదేహాన్ని పంచలింగాల దగ్గరలో ఉన్న ఒక వెంచర్ వద్దకు తీసుకు రావాల్సిందిగా ఆదేశించాడు. బీచుపల్లి బ్రిడ్జి మీదుగా వస్తున్న క్రమంలో తేజేశ్వర్ ఫోన్, ల్యాప్‌టాప్ బ్యాగ్ ను కృష్ణానదిలో పడేశారు. అక్కడకు వచ్చాక తిరుమ లరావు తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి నిర్ధారించుకు న్నాడు. అనంతరం వారికి రూ.లక్ష అందజేశాడు. అనంతరం సుపారీ గ్యాంగ్ నంద్యాల సమీపంలోని పాణ్యం మండలంలోని గాలేరు నగరి కెనాల్ సమీపంలోని జమ్ములో తేజేశ్వర్ మృతదేహాన్ని పడేడి కర్నూలుకు వచ్చారు. తిరుమలరావు తండ్రి తిరుపతయ్య ద్వారా 19, 20 తేదీల్లో 2.50 లక్షల నగదు తీసుకున్నారు జీపీఎస్ ట్రాకర్ అమర్చి.. నిఘా పెట్టితేజేశ్వర్ను హత్య చేసేందుకు సుపారీ గ్యాంగ్ పలుమార్లు యత్నించింది. ఈ క్రమంలోనే తిరుమలరావు జీపీఎస్ ట్రాకర్‌ను కొనుగోలు చేసి ఓ ఇన్ఫార్మర్ సహాయంతో తేజేశ్వర్ బైక్‌కు అమర్చారు. అప్పటి నుంచి తేజేశ్వర్ విషయాలను నిత్యం తిరుమలరావు ఐశ్వర్యతో తెలుసుకుంటూ ఓ పథకం వేసుకున్నారు. తేజేశ్వర్‌ను హత్య చేసిన తర్వాత లడాఖ్ లేదా అండమాన్‌కు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.నిందితులను పట్టుకున్నారిలా..నన్నూర్ టోల్‌ప్లాజా వద్ద కారు వెళుతున్న సీసీ ఫుటేజీ, గద్వాలలో కారులో తేజేశ్వర్‌ను తీసుకెళ్లిన ఫుటేజీ, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితులను గుర్తించారు. గురువారం పుల్లూర్ చెక్‌పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో తిరుమలరావు, నగేష్, పరుశరాముడు, చాకలి రాజు కారులో హైదరాబాద్‌కు పారిపోతుండగా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. గద్వాలలో ఉంటున్న ఐశ్వర్య, మోహన్, కర్నూలు ఉంటున్న తిరుపతయ్య, సుజాతలను అదుపులోకి తీసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. వారి నుంచి హత్యకు వినియోగించిన కారు, రెండు కొడవళ్లు, 10 సెల్ఫోన్లు, రూ.1.20 లక్షలు, కత్తి, జీపీఎస్ ట్రాకర్ స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. కేసులో ఏ1 తిరుమలరావు, ఏ2 ఐశ్వర్య అలియాస్ సహస్ర, ఏ3 కుమ్మరి నగేష్, ఏ4 చాకలి పరుశరాముడు, ఏ5 చాకలి రాజు, ఏ6 మోహన్, ఏ7 తిరుపతయ్య , ఏ8 సుజాత ఉన్నారు. హత్య కేసు విచారణలో పాల్గొన్న డీఎస్పీ మొగిలయ్య, గద్వాల సీఐ శ్రీను, ఎస్ఐలు కల్యాణ్‌కుమార్, శ్రీకాంత్, శ్రీహరి, మల్లేష్, నందికర్, శ్రీనువాసులు, అబ్దుల్షుకుర్, సిబ్బంది చంద్రయ్య, కిరణ్‌కుమార్, రాజుయాదవ్, వీరేష్, రామకృష్ణను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు. -
తేజేశ్వర్ కేసు.. కీలక విషయాలు వెల్లడించిన ఎస్పీ
జోగులాంబ గద్వాల: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గద్వాల సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసును గద్వాల పోలీసులు చేదించారు. భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, ప్రియుడు తిరుమల రావుతో పాటు మొత్తం 8 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. హత్య సమయంలో నిందితులు ఉపయోగించిన వస్తువులు, నగదు, కారును స్వాధీనం చేసుకున్నారు. తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి వివరాలను గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ఏ 1గా తిరుమల రావు, ఏ 2గా ఐశ్వర్య, ఏ8 సుజాతలను చేర్చారు. కాగా, పోలీసుల విచారణలో.. విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. తేజేశ్వర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్‌ను నమ్మించింది.దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్‌రావు కోసం భర్త తేజేశ్వర్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్‌ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివారు పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్‌టాప్‌ను కృష్ణానదిలో పడేశారు.ఈ ఘటన తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాఖ్ పారిపోవాలని తిరుమలరావు స్కెచ్ వేశారు. ఘటనకు ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. ఆపై హత్య జరిగిన మరుసటి రోజు ఘటనా స్థలానికి వెళ్లి.. తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి వచ్చాడు. సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలు ఇచ్చాడు. అయితే తిరుమలరావుకు ఎనిమిదేళ్ల కిందటే వివాహం అయ్యింది. ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో ఐశ్వర్యతో అయినా పిల్లల్ని కనాలని తిరుమలరావు భావించారు. ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసినప్పటికీ.. బంధువుల నుంచి చెడు పేరు వస్తుందన్న భయంతో ఆ ఆలోచనను అమలు చేయకుండా వదిలేశాడు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. -
తేజేశ్వర్ కేసు.. ఎట్టకేలకు తిరుమలరావు అరెస్ట్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు తిరుమలరావును ఎట్టకేలకు గద్వాల పోలీసులు అరెస్ట్ చేశారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్యతో ఎప్పటి నుంచో వివాహేతర బంధంలో ఉన్న తిరుమలరావు.. ప్లాన్ ప్రకారమే తేజేశ్వర్‌ను హత్య చేయించినట్లు అభియోగాలు ఉన్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే.. సర్వేయర్ హత్య కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో తేజేశ్వర్ భార్య ఐశ్వర్య(సహస్ర), ఆమె తల్లి సుజాతతో పాటు హత్య చేసిన సుపారీ గ్యాంగ్ సభ్యులు ముగ్గురు, వీళ్లకు సహకరించిన మరో ముగ్గురు నిందితులు ఉన్నారు. అయితే కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న బ్యాంక్ ఉద్యోగి అయిన తిరుమలరావు మాత్రం పరారీలో ఉన్నాడు. దీంతో.. అతన్ని గాలించేందుకు నాలుగు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోనే అతన్ని గద్వాల్ పోలీసులు అదుపులోకి తీసుట్లు సమాచారం. ప్రస్తుతం అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. సుపారీ గ్యాంగ్‌తో పోలీసులు ఈ ఉదయం సీన్ రీ కన్స్ట్రక్షన్ చేనసిట్లు తెలుస్తోంది.ఏం జరిగిందంటే..జోగులాంబ గద్వాలకు చెందిన లైసెన్స్ సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్ రావుతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమనే అభియోగాలు ఉన్నాయి. పోలీసుల విచారణలో.. విస్తూపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.తేజేశ్వర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్‌ను నమ్మించింది.దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్‌రావు కోసం భర్త తేజేశ్వర్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్‌ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని కర్నూలు శివారు పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్‌టాప్‌ను కృష్ణానదిలో పడేశారు.ఈ ఘటన తర్వాత ఐశ్వర్యతో కలిసి లడాఖ్ పారిపోవాలని తిరుమలరావు స్కెచ్ వేశారు. ఘటనకు ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. ఆపై హత్య జరిగిన మరుసటి రోజు ఘటనా స్థలానికి వెళ్లి.. తేజేశ్వర్ మృతదేహాన్ని చూసి వచ్చాడు. సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలు ఇచ్చాడు. అయితే తిరుమలరావుకు ఎనిమిదేళ్ల కిందటే వివాహం అయ్యింది. ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో ఐశ్వర్యతో అయినా పిల్లల్ని కనాలని తిరుమలరావు భావించారు. ఈ క్రమంలో భార్యను అడ్డు తొలగించుకోవాలని ఆలోచన చేసినప్పటికీ.. బంధువుల నుంచి చెడు పేరు వస్తుందన్న భయంతో ఆ ఆలోచనను అమలు చేయకుండా వదిలేశాడు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. తిరుమలరావును క్షణ్ణంగా విచారిస్తే.. ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. -
ఐశ్వర్యతోనే పిల్లల్ని కనాలని..
సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్ బయటపడింది. దర్యాప్తు లోతుల్లోకి వెళ్లిన పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే విషయం ఒకటి తెలిసింది. ఐశ్వర్య(సహస్ర) కోసం ఆమె భర్తను మాత్రమే కాదు.. తన భార్యనూ అడ్డు తొలగించుకోవాలని బ్యాంకు ఉద్యోగి తిరుమల్ రావు ప్లాన్ వేసినట్లు వెల్లడైంది.తిరుమల్ రావుకు ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. అయితే ఆ జంటకు పిల్లలు లేరు. దీంతో భార్యను అడ్డు తొలగించుకుని.. ఐశ్వర్యతోనే పిల్లలను కనాలని భావించాడు. ఈ క్రమంలో ఐశ్వర్య భర్త తేజేశ్వర్‌తో పాటు తన భార్యను చంపాలని ప్లాన్ వేసుకున్నాడు. ఆపై ఐశ్వర్యతో కలిసి లడాఖ్‌కు ట్రిప్ ప్లాన్ వేశాడు. అయితే భార్యను చంపితే బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందన్న భయంతో ఆ ప్లాన్‌ను విరమించుకున్నాడు. కేవలం తేజేశ్వర్‌ను మాత్రమే చంపాలని ఆ ఇద్దరూ డిసైడ్ అయ్యారు.ఇందుకోసం .. తేజేశ్వర్ హత్య జరిగిన ముందు రోజు బ్యాంకు నుంచి రూ.20 లక్షలు డ్రా చేశాడు. అయితే అప్పటికే భర్త తేజేశ్వర్‌ను చంపేందుకు ఐశ్వర్య ఐదుసార్లు ప్రయత్నించింది. జూన్ 17వ తేదీన ఆరోసారి చేసిన ప్రయత్నంలో తేజేశ్వర్ బలయ్యాడు. సుపారీ గ్యాంగ్‌కు సమాచారం అందించేందుకు తేజేశ్వర్ బైక్‌కు జీపీఎస్ ట్రాకర్ అమర్చింది ఐశ్వర్య. దాని ఆధారంగా అతనికి లొకేషన్ వివరాలను ఆ ముఠాకు అందించింది. ఆపై సర్వే పేరిట తేజేశ్వర్‌ను వెంట తీసుకెళ్లిన రాజు, పరమేశ్వర్, పరుశరామ్.. కత్తితో పొడిచి చంపారు.కర్నూలు శివారులో పడేసిన మృతదేహాన్ని ఆ మరుసటిరోజు తిరుమల్ వెళ్లి చూసొచ్చాడు. అటుపైనే సుపారీ గ్యాంగ్‌కు రూ. 2 లక్షలు అందించాడు. ఇక ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. తిరుమల్ కోసం నాలుగు బృందాలు రంగంలోకి దిగాయి. ప్రస్తుతం అతను లడఖ్‌లోని ఉండి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.కేసు నేపథ్యం ఇదే.. జోగులాంబ గద్వాలకు చెందిన లైసెన్స్ సర్వేయర్ గంటా తేజేశ్వర్ హత్య కేసు తెలంగాణలో తీవ్ర సంచలనం రేపింది. భార్య ఐశ్వర్య తన ప్రియుడు తిరుమల్ రావుతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమనే అభియోగాలు ఉన్నాయి. తేజేశ్వర్‌కు ఈ ఏడాది ఫిబ్రవరిలో కర్నూలు కల్లూరుకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం నిశ్చయమైంది. అయితే ఐశ్వర్య కనిపించకుండా పోవడం.. ఆమె తిరుమలరావు అనే బ్యాంకు ఉద్యోగితో వెళ్లిపోయిందన్న ప్రచారంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు ఆ వివాహాన్ని రద్దు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే తిరిగి వచ్చిన ఐశ్వర్య.. కట్నం ఇవ్వలేకపోయామన్న కారణంతోనే తాను బంధువుల ఇంటికి వెళ్లిపోయానని తేజేశ్వర్‌ను నమ్మించింది. దీంతో పెద్దలు ఒప్పుకోకపోయినా.. మే 18వ తేదీన ఐశ్వర్యను తేజేశ్వర్ వివాహం చేసుకున్నాడు. తిరుమల్‌రావు కోసం భర్త తేజేశ్వర్‌కు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే పెళ్లైన 29 రోజుల్లో.. 15 రోజులు ఐశ్వర్య కర్నూలులోనే గడిపింది. చివరకు.. తిరుమల్ రావు, సుపారీ గ్యాంగ్ సహకారంతో జూన్ 17వ తేదీన భర్త తేజేశ్వర్‌ను హత్య చేయించింది. ఆపై ఆ ముఠా తేజేశ్వర్ మృతదేహాన్ని పాణ్యం అటవీ ప్రాంతంలో వదిలేసి పారిపోయారు. ఆయుధాలు, ఫోన్, ల్యాప్‌టాప్‌ను కృష్ణానదిలో పడేశారు. ఈ కేసులో ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత, తిరుమలరావు, సుపారీ గ్యాంగ్ సభ్యులను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఐశ్వర్య తల్లి సుజాత తిరుమల్‌రావు పని చేసే బ్యాంకులోనే చిరుద్యోగి కాగా.. ఆమెతోనూ అతనికి శారీరక సంబంధం ఉన్నట్లు తేలింది. -
చిత్ర తేజం..దృశ్యకావ్యం
- సైకిల్‌పై 6వేల కి.మీ యాత్ర – 16 రాష్ట్రాల్లో పర్యటన – కెమెరాతో వేలాదిగా ప్రకృతి చిత్రాలు – కర్నూలు యువకుని ప్రతిభ కర్నూలు(హాస్పిటల్): ప్రకృతిలో ఎన్నెన్నో వింతలు..వాటిని రెండు కళ్లతో చూడటం అందరికీ సాధ్యం కాదు. అందుకే కెమెరా కళ్లను కూడా మనిషి జతచేసుకున్నాడు. ఆ ‘కళ్ల’తో ఈ ప్రకృతిని మరింత అందంగా చూపించాలనే ప్రయత్నం నిత్యం చేస్తూనే ఉన్నాడు. ఆ కెమెరా కళ్ల ద్వారా వచ్చిన దృశ్యాలు నిత్యం మనకు మేగజైన్లు, పత్రికల్లో, టీవీ చానళ్లు, సినిమాలలో అద్భుతంగా కనిపిస్తుంటాయి. కర్నూలుకు చెందిన కుర్రాడు తేజేశ్వర్ ఇదే పని చేస్తున్నాడు. కెమెరా భుజాన వేసుకుని దేశంలోని 16 రాష్ట్రాల్లో సైకిల్‌పై సాహస యాత్ర చేశాడు. సుమారు 6వేల కిలోమీటర్లు ప్రయాణించి అద్భుత చిత్రాలు బంధించాడు. కర్నూలు నగరంలోని నెహ్రూనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు శ్రీనివాసులు, పార్వతికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడైన మద్దికెర తేజేశ్వర్ బీటెక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌ను హైదరాబాద్‌లోని జేబీఐఈటీ కాలేజిలో చదివాడు. తనకు చిన్నతనం నుంచి ఫొటోగ్రఫీ, ప్రయాణం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే చదువు మధ్యలో మూడు నెలల పాటు ముంబయిలోని ఫ్యాషన్ ప్రో సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్ ఫొటోగ్రఫి, సెల్ఫ్ న్యూడ్ ఫొటోగ్రఫి, స్ట్రీట్ ఫొటోగ్రఫి, నేచర్ ఫొటోగ్రఫిలో తర్ఫీదు పొందాడు. ఆ సమయంలో అక్కడి అధ్యాపకురాలు ప్రాచీ చపేకర్ సూచనలు ఆయనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. శిక్షణ తర్వాత కొన్నాళ్ల పాటు మోడరన్ ఇండియా మేగజైన్లో ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశాడు. ప్రకృతి అందాల ఫోటోల కోసం సైకిల్ యాత్ర ఈ ప్రకృతి, అందమైన ప్రపంచాన్ని తన కెమెరాలో బంధించాలని తేజేశ్వర్ కలలు కనేవాడు. ఆ కలలకు రూపాన్ని కల్పించేందుకు గత సంవత్సరం ఆగష్టు 6వ తేదిన ముంబయి నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించాడు. అక్కడ నుంచి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణా, పూణే, కర్నాటక, గోవా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేశాడు. తనకు చిన్నతనం నుంచి ఇష్టమైన ప్రయాణం, ఫొటోగ్రఫి అనే ఇష్టాలను ఆయన ఈ విధంగా తీర్చుకున్నాడు. యాత్రలో కనిపించిన ప్రతి అందమైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఇప్పటి వరకు 6వేలకు పైగా కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాడు. నేచర్ ఫోటోగ్రఫి కోసం, సోషల్ డాక్యుమెంటరీ కోసం ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపాడు. ‘జాంటీ’ తోడుగా కష్టం ఇష్టంగా...! –తేజేశ్వర్, నేచర్ ఫొటోగ్రాఫర్ సైకిల్ యాత్ర చేస్తున్న సమయంలో ఒకానొక సమయంలో తీవ్ర అలసట, అయిష్టం ఏర్పడేది. కొన్నిసార్లు ముందుకు సాగబుద్ధి అయ్యేది కాదు. నా కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలంటే తోడు అవసరమని భావించాను. ఈ మేరకు జైపూర్‌లో రూ.8వేలు వెచ్చించి జర్మన్ షెప్పర్డ్ అనే జాతి కుక్కపిల్లను కొనుగోలు చేశాను. దానిని వెంట బెట్టుకుని యాత్ర ప్రారంభించాను. ఆ మరునాడు జైపూర్ రోడ్డుపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటిరోడ్స్ కనిపించాడు. ఆయన స్నేహితురాలు సమంత నాలాగే ఒక మంచి ఉద్దేశంతో 8వేల కిలోమీటర్ల పరుగు చేస్తోంది. వారిద్దరూ జైపూర్ రోడ్డుపై నన్ను చూసి ఆపారు. నా గురించి, నేను చేస్తున్న పని గురించి తెలుసుకున్నారు. నా వద్ద ఉన్న కుక్కపిల్లను చూసి ముచ్చటపడ్డారు. దీనికి ఏం పేరు పెట్టావని అడిగారు. ఇంకా పేరు పెట్టలేదన్నాను. వెంటనే సమంత దీనికి ‘జాంటిరోడ్స్’ అని పేరు పెట్టాలని సూచించారు. వారి సూచన మేరకు కుక్కపిల్లకు ఆ పేరే పెట్టాను. అప్పటి నుంచి ఆ కుక్కపిల్ల నన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతోంది.