teak wood
-
వైఎస్సార్సీపీ నేతలపై కక్ష
రేణిగుంట/కొలిమిగుండ్ల: వైఎస్సార్సీపీ నేతలపై కక్ష గట్టి నష్టం చేకూర్చిన ఘటనలు తిరుపతి, నంద్యాల జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం ఇనగలూరులో వైఎస్సార్సీపీ నేత, సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డి తన పొలం (లీజు)లో ఉన్న 100 టన్నుల టేకు కొయ్యలను కట్ చేయించి గ్రామ శివారులో ఉన్న తన స్థలంలో నిల్వ చేశారు. ఇది తెలుసుకున్న కొందరు గురువారం అర్ధరాత్రి వాటికి నిప్పు పెట్టారు. టేకు కలప ఉంచిన ప్రాంతంలో మంటలు ఎగుస్తుండటంతో స్థానికులు గుర్తించి నాగరాజురెడ్డికి సమాచారం ఇచ్చారు.మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. అవి పూర్తిగా కాలిపోవడంతో రూ.10 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు తనను భయభ్రాంతులకు గురిచేసేందుకు తగులబెట్టారని ఆయన మండిపడ్డారు. ఇందుకు కారకులైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో నంద్యాల జిల్లా హనుమంతుగుండంలో వైఎస్సార్సీపీ నేత పాణ్యం ఖాన్బాదర్కు చెందిన పొలానికి కొందరు వ్యక్తులు శుక్రవారం నిప్పు పెట్టారు.గ్రామ సమీపంలోని ఆంజనేయస్వామి గుండం వద్ద ఉన్న ఎకరం పొలంలో పశువుల మేత కోసం గడ్డి సాగు చేశాడు. కొందరు ఉద్దేశ పూర్వకంగా పెట్రోల్ పోసి నిప్పు పెట్టడంతో పశుగ్రాసం పూర్తిగా కాలిపోయింది. బోరులో నుంచి తీసి పక్కన పెట్టిన 40 పైపులు దగ్ధమయ్యాయి. నీళ్లు పారించేందుకు ఏర్పాటు చేసిన పది లింక్ పైపులు, స్టార్టర్ బాక్స్, విద్యుత్ తీగ కాలిపోయింది. రూ.3 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఖాన్బాదర్, రమీజాబి దంపతులు కన్నీటిపర్యంతమయ్యారు. పక్కనే ఉన్న గడ్డివామికి కూడా నిప్పంటించి వెళ్లారు. అయితే అదే సమయంలో పొలంలోకి వచ్చిన రమీజాబి గమనించి మంటలను ఆర్పేసింది. బాధితుడు వైఎస్సార్సీపీ తరఫున 2024 ఎన్నికల్లో ఏజెంట్‌గా కూర్చున్నాడు. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత డిసెంబర్లో టీడీపీ నాయకులు పట్టుబట్టి ఇతన్ని వీఓఏగా తొలగించారు. భార్య రమీజాబి చాలా ఏళ్లుగా ఉపాధి హామీ పథకంలో మేటీగా పని చేస్తోంది. ఆమెను మేటీగా తొలగించాలని టీడీపీ నేతలు కొద్ది రోజులుగా ఒత్తిడి చేస్తున్నారు. ఎలాగైనా తమను ఇబ్బంది పెట్టాలనే దురుద్దేశంతో టీడీపీ నాయకులే ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని ఖాన్బాదర్ దంపతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కొలిమిగుండ్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.పాలన మరచి పగబట్టారు : ఎంపీ గురుమూర్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పాలనను మరచి కేవలం వైఎస్సార్సీపీ నాయకులు, సానుభూతిపరులే లక్ష్యంగా విధ్వంసం సృష్టిస్తోందని తిరుపతి ఎంపీ గురుమూర్తి మండిపడ్డారు. ఇనగలూరు సర్పంచ్ చెలికం నాగరాజురెడ్డికి చెందిన టేకు కొయ్యలకు నిప్పంటించిన ప్రాంతాన్ని శుక్రవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. బాధితుడు నాగరాజు రెడ్డికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మరచి, రెడ్ బుక్ రాజ్యాంగ పాలనను అమలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధితునికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ప్రాణహిత నదిలో కలప అక్రమ రవాణా
-
రూ.1.50 లక్షల విలువైన కలప పట్టివేత
ములుగు : అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.1.50 లక్షల విలువైన టేకు కలపను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై మల్లేశ్‌యాదవ్ ఉదయం డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా జంగాలపల్లి వైపు నుంచి వస్తున్న బొలోరో వాహనం ఆనుమానాస్పదంగా కనిపించింది. వాహనాన్ని ఆపి పరిశీలించగా అందులో 19 టేకు దుంగలు ఉన్నాయి. దీంతో వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. అందులో ఉన్న నర్సంపేటకు చెందిన దారుగుల సూర్యనారాయణ, గాదె రాజేశ్, మండలంలోని మదనపల్లికి చెందిన జాటోతు ధరమ్సింగ్లపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎస్సై తెలిపారు. పెట్రోలింగ్‌లో కానిస్టేబుళ్లు సునిల్, శ్రీనివాస్, వాసు పాల్గొన్నారు. -
కలప దందా.. కాసుల వరద..!
ఇక్కడ దుంగకు రూ.వెయ్యి.. అక్కడ ఫీట్‌కు రూ.1,200 ఈ అక్రమ బిజినెస్‌తో స్మగ్లర్లకు పైసలే పైసలు ‘మామూలు’గా తీసుకుంటున్న అధికారులు జన్నారం : అడవిలో ఉంటున్న కొందరు గిరిజనులను మచ్చిక చేసుకుని.. ఆ ప్రాంతం అటవీ సిబ్బందికి ఎంతో కొంత ముట్టజెప్పుతూ ఇక్కడి నుంచి తీసుకుపోయే కలప దుంగలకు మూడంతలు సంపాదిస్తున్నారు స్మగ్లర్లు. ఇలా తమ బిజినెస్‌ను గుట్టు చప్పుడు కాకుండా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. డివిజన్లోని జన్నారం, తాళ్లపేట్ అటవీ రేంజ్‌లలో ఈ బిజినెస్ ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ద్వారా బయట పడిన విషయాలు ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఉన్నతాధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నా కిందిస్థాయి అధికారుల సహకారం స్మగ్లర్లకు వరంగా మారింది. స్మగ్లింగ్ జరుగుతోందిలా... జన్నారం, తాళ్లపేట్, ఇంధన్పల్లి రేంజ్‌ల పరిధిలోని పలు అటవీ ప్రాంతాల నుంచి కొందరు గిరిజనులు దుంగలు కొట్టి, వాటిని జన్నారం మండలానికి చెందిన కొందరు జట్టుగా ఏర్పాటు చేసుకున్నారు. వారు గిరిజనుల వద్ద నుంచి రూ.1000 కి ఒక టేకు దుంగ(సైజు 10–6, సుమారుగా 3 ఫీట్లు) కొనుగోలు చేసి, గుట్టుచప్పుడు కాకుండా గోదావరి వరకు ఎడ్లబండి లేదా, సైకిళ్లపై తరలిస్తారు. అక్కడ మరో వ్యక్తి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉంటారు. అక్కడి నుంచి కలపను ఆ వ్యక్తి ఫీటుకు రూ.1,200 నుంచి రూ.1,800 చొప్పున కొనుగోలు చేస్తారు. అంటే రూ.వెయ్యితో కొనుగోలు చేసిన దుంగకు రూ.3 వేల నుంచి రూ.5,400 వరకు వస్తున్నాయి. ఇలాంటి వ్యాపారం ఏదీ ఉండదని, స్మగ్లర్లు ఈ రూటును ఎంచుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో సంబంధిత ప్రాంత బీట్ అధికారికి నెలకు కొంత చొప్పున మాట్లాడుకుని నెలనెలా చెల్లిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అయితే ఇటీవల ఓ అధికారి నిర్మించుకున్న ఇంటికి కూడా కలప ఇక్కడి నుంచే స్మగ్లర్లు తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ జోక్యం కలప పట్టుకున్న రెండో రోజు నుంచి రాజకీయ జోక్యం కల్పించుకుంటున్నట్లు కూడా తెలుస్తోంది. రాజకీయ నాయకులు ఆయన మా పార్టీకి చెందినవాడు. స్మగ్లర్ కాదు.. కేసులు లేకుండా చేయాలని అటవి అధికారులకు ఒత్తిడి తెస్తున్నట్లు ఓ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. పట్టుకున్న వారిని వదిలేస్తే ఇక పట్టుకోవడం ఎందుకని కూడా అటవీ శాఖ అధికారులంటున్నారు. రాజకీయ నాయకులు జోక్యం చేసుకోకుండా సహకరించాలని కోరుతున్నారు. కేసులు నమోదు చేస్తాం స్మగ్లింగ్‌కు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తాం. ఇటీవల కలప పట్టుకున్న ఘటనలో ఆరుగురిపై కేసు నమోదు చేశాం. మాకు పోలీసుల సహకారం ఉన్నందున స్మగ్లర్లు తప్పించుకునే అవకాశం లేదు. ఎంతటివారైన చర్యలు తప్పవు. పెట్రోలింగ్ ద్వారా రాత్రి అడవిలో తిరుగుతున్నాం. – షౌకత్‌హుస్సేన్, రేంజ్ అధికారి -
టేకు కలప పట్టివేత
నల్లబెల్లి : బోలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను సోమవారం తెల్లవారుజామున నల్లబెల్లి పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై మేరుగు రాజమౌళి కథనం ప్రకారం.. నల్లబెల్లి పోలీసులు సోమవారం తెల్లవారుజామున పెట్రోలింగ్ చేస్తుండగా లెంకాలపల్లి వైపు నుంచి ఓ బోలెరో వాహనం వేగంగా వస్తుండగా ఆపే ప్రయత్నం చేశారు. డ్రైవర్ ఆపకుండా వెళ్లడంతో వెంబడించి అడ్డుకున్నారు. తనిఖీ చేయ గా ఆ వాహనంలో 80 ఫీట్లుగల 22 టేకు దుంగలను ఉంచి పైనుంచి పరదా కప్పి ఉంచారు. డ్రైవర్ బొడరెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించగా నర్సంపేటకు చెందిన మేకల రాంబా బు చత్తీస్‌గఢ్ నుంచి కలపను నర్సంపేటకు కల ప తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. టేకు దుంగల విలువ మార్కేట్లో రూ.2.40 లక్షలు ఉంటుంద ని తెలిపారు. దాడిలో హెడ్‌కానిస్టేబుల్ యాక య్య, కానిస్టేబుళ్లు దేవ్‌సింగ్, సాధన్, రమేష్, సుకేందర్, పాషా, హెచ్‌జీ రాజు పాల్గొన్నారు.