breaking news
Teachers MLC voters
-
ఎమ్మెల్సీ ఓటర్‌గా నమోదుకు మరో అవకాశం
బద్వేలు/కడప కోటిరెడ్డి సర్కిల్: వచ్చే ఏడాది జరగనున్న పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఈ నెల 23న విడుదల చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పశ్చిమ రాయలసీమ (కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ ఉమ్మడి జిల్లాలు)కు సంబంధించి గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో ఓటర్ నమోదుకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ప్రతి ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం జాబితాను ఎన్నికల సంఘం రద్దు చేస్తుంది. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి. ►పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరుగా అర్హులై ఉండి గతంలో దరఖాస్తు చేసుకోని వారికి ఎన్నికల సంఘం మరో అవకాశం కల్పించింది. ఎన్నికల కమిషన్ జారీ చేసిన షెడ్యూల్ మేరకు అర్హులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రస్తుతం దరఖాస్తు చేసుకున్న వారితో ఈ నెల 23న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురించారు. జాబితాను పరిశీలించి ఓటర్‌గా నమోదు కాకుంటే మరో పర్యాయం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అదే రోజు నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. అభ్యంతరాలతో పాటు కొత్త ఓటరు నమోదుకు దరఖాస్తులను స్వీకరిస్తారు. దరఖాస్తులను ఆర్డీఓ, తహశీల్దార్ కార్యాలయాల్లో కానీ, కలెక్టరేట్లో ఉన్న సహాయ ఎన్నికల అధికారికి అందజేయాలి. దీనిపై సందేహాలకు 1950 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి తీర్చుకోవచ్చు. నమోదు కోసం... గ్రాడ్యుయేట్: వయస్సు 18 ఏళ్లు నిండి ఉండాలి. 2019 అక్టోబర్ 31 నాటికి గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. ఏదైనా డిగ్రీ, ఎంబీబీఎస్, బీటెక్, బీఈ వంటి డిగ్రీలు చదివిన వారు అర్హులే. ఇంటర్ తదుపరి మూడు సంవత్సరాల డిప్లొమో చదివిన వారు గ్రాడ్యుయేట్ ఓటుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైñన్లో ఫారం–18 ఎన్నికల కమిషన్ సూచనల ప్రకారం చేసుకోవచ్చు ఫొటో, ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఓటర్‌కార్డు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో ఫారం–18 పూర్తి చేసి, ఫొటో అతికించిన దరఖాస్తుతో డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్(గెజిటెడ్ అటేస్టేషన్ చేయాలి), ఆధార్‌కార్డు, ఓటర్‌కార్డు జెరాక్స్ కాపీలను అందజేయాలి. ఉపాధ్యాయులు: ఫారం–19 పూర్తి చేసి ఇవ్వాలి. దరఖాస్తుతో పాటు సర్వీస్ సర్టిఫికెట్ తప్పనిసరిగా అందజేయాలి. నవంబర్ 2016 నుంచి అక్టోబర్ 2022 లోపు ఆరేళ్లలో కనీసం మూడేళ్లు సర్వీస్ పూర్తి చేయాలి. ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు పాఠశాల హెచ్ఎం, ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులకు ఎంఈఓ, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పని చేసే అధ్యాపకులకు ప్రిన్సిపల్ సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ప్రయివేట్ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుల దరఖాస్తులను జిల్లా విద్యాశాఖాధికారి ధ్రువీకరించాలి. ప్రయివేట్‌జూనియర్ కళాశాలలో పని చేస్తున్న వారికి ఇంటర్ బోర్డుకు సంబంధించి ఆర్ఐఓ, ఆర్జేడీ ధ్రువీకరించాలి. ప్రయివేట్ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు ఉన్నత విద్యాశాఖకు చెందిన ఆర్జేడీ ధ్రువీకరించాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి శ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటుహక్కుకు సంబంధించి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారు ఈనెల 23 నుంచి డిసెంబరు 9వ తేదీలోగా తమ దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – శివరామిరెడ్డి, తహసీల్దార్, కడప -
ఇక్కడ కాదు.. అక్కడ
భీమవరం అర్బన్ :ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితాలపై అభ్యంతరాలను స్వీకరించే విషయంలో గందరగోళం నెలకొంది. ఫారం-19 ఇస్తే తీసుకుంటామని, ఫారం-7 తీసుకునే అర్హత తమకు లేదని భీమవరం మునిసిపల్ కమిషనర్ బీఆర్ సత్యనారాయణ, తహసిల్దార్ గంధం చెన్నుశేషు చెప్పడం, తనకు సంబంధం లేదని కమిషనర్ పేర్కొన డం గందరగోళానికి దారి తీశాయి. దీనిని నిరసిస్తూ యూటీఎఫ్ నాయకులు మంగళవారం రాత్రి మునిసిపల్ కమిషనర్ చాంబర్ ఎదుట ధర్నాకు దిగారు. ఈ విషయమై యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి.గోపిమూర్తి మాట్లాడుతూ భీమవరం పరిధిలో మొత్తం 700 ఉపాధ్యాయ ఓట్లు ఉన్నట్టు పేర్కొంటూ జాబితా విడుదల చేశారని చెప్పారు. అందులో 167 ఓట్లు బోగస్ అని తేలిందన్నారు. వాటిపై అభ్యంతరాలు తెలియజేస్తూ 167 బోగస్ ఓట్లకు సంబంధించి ఫారం నంబర్-7ను తహసిల్దార్‌కు ఇచ్చామన్నారు. తనకు ఫారం-7 తీసుకునే అధికారం లేదని, మునిసిపల్ కమిషనర్ వద్దకు వెళ్లాలని తహసిల్దార్ చెప్పారన్నారు. కమిషనర్‌ను కలసి అభ్యంతరాల జాబితా ఇచ్చామన్నారు. దీనిపై ఆయన స్పందిస్తూ తనకు ఫారం-19 మాత్రమే తీసుకునేందుకు అర్హత ఉం దని, ఫారం నంబర్-7 తీసుకునే అర్హత లేదని చెప్పారన్నారు. అభ్యంతరాల స్వీకరణకు మంగళవారం ఆఖరు తేదీ అని, అధికారులు ఎవరికి వారు ఈవిధంగా తప్పించుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు కార్పొరేట్ విద్యాసంస్థలకు కొమ్ము కాసేందుకే బోగస్ ఓట్లపై అభ్యంతరాలను స్వీకరించడం లేదని గోపిమూర్తి ఆరోపించారు. అభ్యంతరాలను స్వీకరించాలని ధర్నా చేస్తుంటే మునిసిపల్ కమిషనర్ బాధ్యతారాహిత్యంగా వెళ్లిపోయారని అన్నారు. ఇందుకు నిరసనగా రాష్ట్రస్థాయిలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సాయంత్రం 4 గంటలకు మొదలైన ధర్నా రాత్రయినా కొనసాగటంతో సీఐ జి.కెనడీ రాత్రి 9 గంటల సమయంలో అక్కడకు చేరుకున్నారు. మునిసిపల్ చైర్మన్ కొటికలపూడి గోవిందరావుతో కలసి యూటీఎఫ్ నాయకులతో చర్చలు జరిపారు. రాత్రి సమయంలో ఇక్కడ ఆందోళన చేయ డం వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. దీనిపై యూటీఎఫ్ నాయకులు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో దొంగ ఓట్లను భారీగా చేర్చారని, దీనిపై గడువులోపు తాము అభ్యంతరాలను తెలి పేందుకు వస్తే అధికారులు తమకు సంబంధం లేదంటున్నారని విరుచుకుపడ్డారు. మునిసిపల్ చైర్మన్, సీఐ బదులిస్తూ బుధవారం ఉదయం ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని, ఇందుకు తాము కూడా సహకరిస్తామని హామీ ఇచ్చారు. శాంతిం చిన యూటీఎఫ్ నాయకులు ధర్నాను తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ప్రకటించారు. సమస్యను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామన్నారు. కార్యక్రమంలో కాంట్రాక్ట్ లెక్చరర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.జోసఫ్గాంధీ, యూటీఎఫ్ జిల్లా శాఖ కార్యదర్శి పి.సీతారామరాజు, జిల్లా ఆడిట్ కన్వీనర్ పి.శ్రీనివాసరాజు, యూటీఎఫ్ రూరల్ ప్రధాన కార్యదర్శి సీహెచ్ పట్టాభిరామయ్య, నాయకులు ఎంఐ విజయకుమార్, పాలకోడేరు మండల శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీఎస్ విజయరామరాజు, జి.సుధాకర్, కాళ్ల మండల శాఖ ప్రధాన కార్యదర్శి కేఎస్ఆర్సీహెచ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.