breaking news
taruna Aswani
-
వారికి ఆమె.. అమ్మ
నా వల్ల ఏం అవుతుంది.. అనుకునే వ్యక్తులు మన చుట్టూ ఎంతమంది ఉంటారో.. నా వరకు నేను ఏదైనా చేయగలను అనుకునే వారు అంతమందే ఉంటారు.వీ రెండోకోవలోకి వచ్చేవారితో సమాజానికి ఎంతోకొంత మేలు జరుగుతుంది. ఇదిగో ఇటువంటి జాబితాలోకే తరుణా విధయ్ చేరతారు. ఓ వైపు ఉద్యోగం చేసుకుంటూ.. మరోవైపు అనాదలైన చిన్నారుల ఆకలితీరుస్తూ.. ఆమె ముందుకు సాగుతోంది. బ్యాంక్ ఉద్యోగిగా క్షణం తీరికలేకుండా.. పనిచేసే తరుణా.. ఘజియాబాద్ చిన్నారులకు అమ్మలా మారింది. నేను ఒకప్పుడు ఇటువంటి పరిస్థితుల్లోనే జీవించాను.. ఆ గతాన్ని ఎన్నడూ మరువను.. అని చెబుతోంది తరుణ. ఇంతకీ ఎవరీ తరుణ.. ఏమిటా కథా అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చదవండి. ఘజియాబాద్‌లోని ఒక కార్పొరేట్ బ్యాంక్‌లో మేనేజర్‌గా తరుణ (30) విధులు నిర్వహిస్తోంది. రోజూ ఆఫీస్ ఇందిరాపురం మీదుగా వెళ్లే సమయంలో అక్కడ వీధి బాలలను గమనించేంది. వీరికి ఏదైనా చేయాలని మనస్సులో పలుసార్లు అనుకున్నా కార్యలరూపం దాల్చలేదు. అయితే ఒక సందర్భంలో ఒక చిన్నారి ఆకలితో అలమటించడం చూసి చలించి పోయింది తరుణ. వెంటనే వారికోసం ఒక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు దిగింది. ఆమె ప్రయాణం ఎలా సాగిందో.. ఆమె మాటల్లోనే..! నేను ఇక్కడినుంచే వచ్చా! నా చిన్నతనంలో సాయం కోసం మా కుటుంబం ఎదురు చూసిన రోజులు నేను మర్చిపోలేను. ముఖ్యంగా నాచదువు సాగే రోజుల్లో ఇది మరీ ఎక్కువగా ఉండేది. చాలా మంది దాతల మూలంగా నేను చదువుకోగలిగాను.. ఆకలి తీర్చుకున్నాను.. నేడు ఈ స్థితిలోకి వచ్చాను.. నా మూలాలు నేను మరువను. అందుకే వీధి పిల్లల కోసం ముందుకు వచ్చాను. వాళ్లే ప్రపంచం నా ఉద్యోగం సాయంత్రం 5 గంటలకు అయిపోతుంది. అప్పటినుంచి సామయమంతా ఇందిరాపురం చిన్నారులతోనే గడిచిపోతుంది. వారితోనే ఆటలు, పాటలు, చదువు. డ్యాన్స ఇలా ఒకటేమిటి.. అంతా వారితోతోనే. రోజులో కనీసం నాలుగు గంటలు వాళ్లతోనే గడిపేస్తానని తరుణ చెబుతోంది. చిన్నారులకు ఆర్థిక సహాయం అందించడమే.. వారి కోసం స్నేహితుల నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తోంది. కాబోయే భర్తకు ముందుగానే..! తాను చేస్తున్న పనులు, ముఖ్యంగా చిన్నారుల గురించి కాబోయో భర్తకు ముందుగానే తరుణ వివరించింది. ఈ కార్యక్రమాలను తాను నిర్వహిస్తున్నానని.. భర్తకూడా ఇందులో పాలుపంచుకోవాలని ముందుగానే చెప్పేసింది. అందుకు అంగీకరిస్తేనే పెళ్లి.. లేందటే లేదని స్పస్టం చేసింది. ప్రస్తుతం తరుణతో పాటు.. ఆమె భర్త కూడా చిన్నారుల సేవలో ఉన్నారు. వీధి బాలురుగా ఉన్న వారికి తరుణ, ఆమె స్నేహితులు ఖాళీ సమయాల్లో చదువు చెప్పడం, వారికి ఆహారాన్ని అందించడం చేస్తున్నారు. -
ఆ బ్లాక్‌మెయిల్‌పై అశ్వినీ ఏం చేసిందంటే
కేవలం 12 గంటల సమయంలోనే 26 ఏళ్ల తరుణ అశ్వనీ జీవితం ఊహించని మలుపులు తిరిగింది. అనేక కుదుపులకు లోనుచేసింది. తరుణ బలహీనురాలైతే లొంగిపోయేదేమో! నిస్సహాయ స్థితిలో ఏదైనా అఘాయిత్యం చేసుకొనేదేమో.. కానీ తరుణ లొంగిపోలేదు. ఎదురుతిరిగింది. పోరాటానికి సిద్ధపడింది. ఇప్పుడు తరుణ సోషల్ మీడియాలో సునామీ సృష్టిస్తోంది. అసలు ఏం జరిగిందంటే.. గత శుక్రవారం రాత్రి 8.59 గంటలకు ముంబైకి చెందిన తరుణ అశ్వనీకి ఓ ఈమెయిల్ వచ్చింది. ‘నా దగ్గర నీ నగ్న ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. వీటిని బయటపెట్టకుండా ఉండాలంటే నువ్వు నన్ను తృప్తి పరచాలి. నేను చెప్పినట్టు నగ్నంగా ఫొటోలు, వీడియోలు పంపించాలి’ అని బ్లాక్మెయిల్ చేస్తూ అతను అశ్వినికి మెయిల్ పంపాడు. ఆ తర్వాత కాసేపటికే తనవి ఉత్త బెదిరింపులు కాదని హెచ్చరించడానికి ఆమె నగ్నఫొటోలను కూడా పంపి మరింత భయపెట్టాలని చూశాడు. ఆ వికృత వ్యక్తి బెదిరింపులకు ఆమె లొంగలేదు. అతనికి భయపడి బిక్కుబిక్కుమంటూ గడపలేదు. వెంటనే ఈ బెదిరింపులను బహిరంగపరచాలని ఆమె నిర్ణయించింది. అతని రెండు ఈయిళ్లను స్ర్కీన్‌షాట్స్ తీసి ఆమె తన ఫేస్బుక్ పేజీలో పెట్టింది. తన గూగుల్ అకౌంట్‌ను హ్యాక్ చేసి అందులో తన వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు దొంగలించి.. వాటితో బెదిరించాలని చూస్తున్నాడని, కానీ, అతని బెదిరింపులకు లొంగకుండా.. ఈ విషయాన్ని బయటపెట్టాలని నిర్ణయించినట్టు ఆమె తన పోస్టులో పెట్టారు. తాను ఇలా చేయడం వల్ల ఇలాంటి బెదిరింపుల బారిన పడిన మహిళల భయపడకుండా ధైర్యంగా ముందుకొచ్చేందుకు ప్రేరణగా ఉంటుందని భావిస్తున్నట్టు ఆమె చెప్పారు. సైబర్ నేరగాడి బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ఆమె పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. చాలామంది ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటుండగా.. కొంతమంది అలాంటి ఫొటోలను ఎందుకు నీ బాయ్‌ఫ్రెండ్‌కు పంపావని ప్రశ్నిస్తున్నారు. ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తరుణ ఈ విమర్శలను కొట్టిపారేసింది. ఆమె ప్రియుడు, పోలాండ్ జాతీయుడైన స్టాస్ ఈస్ట్కో కూడా ఈ విమర్శలను తప్పుబట్టారు. ’భారతీయ సంప్రదాయవాదులు తరుణను తప్పుబడుతున్నారు. తమ భాగస్వామికి అలాంటి ఫొటోలు తీసి పంపడాన్ని తప్పుబడుతున్నారు. కానీ పాశ్చాత్య దేశాల్లో ఇలాంటివి అసహజం ఏమీ కాదు. ఇద్దరు యుక్త వయస్కులు పరస్పర సమ్మతితో చేసుకొనే ఇలాంటివి వ్యక్తిగత ప్రైవసీలోభాగంగా చూడాలి’ అని ఆయన చెప్పారు. ఇక ముంబైకి చెందిన తరుణ గత ఐదు నెలలుగా అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉంటూ.. ఫిజికల్ థెరపీ నిపుణురాలిగా కొనసాగుతోంది. తనకు ఆన్లైన్ బెదిరింపులు రావడంపై అమెరికాలోని మేరీల్యాండ్ పోలీసులు, ఎఫ్‌బీఐ దృష్టికి తీసుకెళ్లినా.. వారు స్పందించలేదు. కాగా, బాధితురాలి ఫిర్యాదు మేరకు ముంబై సైబర్ సెల్ పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.