భయం... భయం!
ప్రమాదం ఏ రూపంలో వచ్చినా భయంగానే ఉంటుంది. అదే ఓ దెయ్యం రూపంలో వస్తే...సరిగ్గా ఇదే తరహా కథాంశంతో వస్తున్న చిత్రం ‘ప్రమాదం’. సంబిత్, మౌసమి, స్నేహ, ఎల్లి ముఖ్యతారలుగా అర్రా మూవీస్ పతాకంపై ప్రదీప్ దాస్, తపస్ జెనా దర్శకత్వంలో తమిళంలో ప్రదీప్ కుమార్ అర్రా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రేయాస్ మీడియా ఈ నెల 26న తెలుగులో విడుదల చేయనుంది. ‘‘ఏడుగురు వ్యక్తుల చుట్టూ తిరిగే ఈ కథ అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో పాటలు, కామెడీ ఉండవు. కేవలం హారర్ మాత్రమే ఉంటుంది’’ అని శ్రేయాస్ శ్రీనివాస్ చెప్పారు.