breaking news
Tamil Actor Simbu
-
కోవై పోలీసులకు శింబు లొంగుబాటు
చెన్నై: ఎట్టకేలకు నటుడు శింబు సోమవారం కోవై పోలీసులకు లొంగిపోయాడు. బీప్ సాంగ్ వ్యవహారం ఇటీవల కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ బీప్ సాంగ్‌కు కారకులంటూ నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుద్‌లపై ఫిర్యాదులు రావడంతో కేసులు నమోదు చేశారు. మహిళా సంఘాల ఆందోళలు, కేసుల నమోదు, కోర్టుల్లో పిటిషన్లు అంటూ పెద్ద సంచలనానికే దారితీయడంతో కొన్ని రోజుల పాటు శింబు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. సరిగ్గా ఆ సమయంలో కెనడాలో ఉన్న సంగీత దర్శకుడు అనిరుద్ ఇటీవల రహస్యంగా కోవై పోలీసుల ఎదుట హాజరై బీప్ సాంగ్‌కు తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వివరణ ఇచ్చుకున్నాడు. శింబు మాత్రం చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. అయితే శింబు కోవై పోలీసుల ఎదుట హాజరు కావలసిందేనంటూ ఆదేశిస్తూ కాస్త సమయమిచ్చి అవకాశాన్ని కల్పించింది.ఈ నేపథ్యంలో శింబు సోమవారం కోవై పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయారు. శింబు ఉదయం 7.30 గంటల ప్రాంతంలో విమానంలో చెన్నై నుంచి కోవైకి చేరుకున్నారు. ఆయనతో పాటు తన తండ్రి టీ.రాజేందర్, న్యాయవాది శింబుతో పాటు ఉన్నారు. కోవైలోని ఒక హోటల్లో దిగిన శింబు బృందం ఉదయం 10 గంటలకు స్థానిక గాంధీపురం, కాట్టూర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ అసిస్టెంట్ కమిషనర్ రమేశ్కృష్ణన్, సబ్ ఇన్స్పెక్టర్ సెల్వరాజ్, ఎస్ఐ ప్రేమలు వేసిన ప్రశ్నలకు శింబును వివరణ ఇచ్చాడు. ఆ తరువాత 10.20 గంటలకు శింబు బృందం పోలీస్‌స్టేషన్ నుంచి బయటకు వచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయమై ప్రస్తుతం తానేమీ చెప్పలేనని శింబు పేర్కొన్నాడు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చానని ఆపై భగవంతుడే చూసుకుంటాడని వ్యాఖ్యానించాడు. కాగా శింబు పోలీస్‌స్టేషన్‌కు వస్తున్న సమాచారం తెలియడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున్న అక్కడికి తరలి వచ్చారు. శింబును చూడటానికి పోలీస్‌స్టేషన్ లోనికి చొరబడ ప్రయత్నించగా గట్టి బందోబస్తును ఏర్పాటు చేసిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. శింబు లొంగుబాటు సమయంలోనూ అక్కడ కొంత కలకలం చెలరేగినట్లు తెలుస్తోంది. -
హన్సికతోనూ తెంచుకున్నాడు!
చెన్నై: హన్సికతో ప్రేమాయణానికి తమిళ నటుడు శింబు ముగింపు పలికాడు. తమ మధ్య కొనసాగిన ప్రేమ వ్యవహానికి కటీఫ్ చెప్పాడు. ఈ మేరకు స్వయంగా ప్రకటన చేశారు. హన్సికతో ప్రేమబంధాన్ని తెంచుకున్నట్టు ట్విటర్లో పేర్కొన్నాడు. "ఈ బంధానికి ఇక్కడితో ముగింపు పలుకుతున్నా. ఎంతో ఆలోచించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నా. నేనిప్పుడు ఒంటరి పక్షిని. హన్సికతో కొనసాగించిన బంధం గురించి చెప్పడానికేమీ లేదు. అదంతా జరిగిపోయిన గతం. అయితే దీని గురించి నేను బాధ పడడం లేదు. ఈ ప్రకటన చేయడానికి దారితీసిన పరిస్థితుల గురించి చెప్పలేను. నా సన్నిహితులు, సహచరులు, నా అభిమానులకు నా గురించి తెలిపేందుకు ఈ ప్రకటన చేస్తున్నా. ఇక నుంచి కెరీర్‌పై దృష్టి పెడతా. నేనిప్పుడు సంతోషంగా ఉన్నానని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఉపశమనం లభించినట్టుగా ఉంది'' అని ట్విటర్లో శింబు పోస్ట్ చేశాడు. రియల్ లైఫ్‌నూ ప్రేమికుడిగా శింబు సుపరిచితుడు. గతంలో నయన తారతోనూ అతడు విఫల ప్రేమాయణం సాగించాడు.