breaking news
Talwars
-
తల్వార్లతో నృత్యాలు: 9 మంది రిమాండ్
నాంపల్లి: మల్లేపల్లి డివిజన్ మాన్గార్ బస్తీలో జరిగిన పుట్టిన రోజు వేడుకల్లో తల్వార్లతో నృత్యం చేసిన తొమ్మిది మందిని అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించామని బీబ్నగర్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్ తెలిపారు. ఇన్స్పెక్టర్ కథనం ప్రకారం.. మాన్గార్ బస్తీలో సాయిరామ్ యాదవ్ అలియాస్ రాజు యాదవ్, అర్జున్‌లు బుధవారం రాత్రి తమ పుట్టిన రోజు వేడుకలను సుమారు 40 మంది అనుచరులతో కలిసి రోడ్డుపై జరుపుకున్నారు. వీరంతా తాగి నృత్యం చేయగా, వీరిలో 9 మంది యువకులు తల్వార్లతో నృత్యం చేస్తూ స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తల్వార్లు పట్టుకుని నృత్యాలు చేసిన వారిని అరెస్టు చేశారు. వీరిపై ఆయుధాల చట్టం యాక్టు కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. చదవండి: టీఆర్ఎస్ ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు -
జిల్లాలో పెరుగుతున్న తల్వార్ల సంస్కృతి
మంచిర్యాలక్రైం: జిల్లాలో రోజురోజుకూ తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోతోంది. జన్మదిన వేడుకలు జరుపుకునేందుకు అర్ధరాత్రి నగరం నడిబొడ్డున కేక్ కట్ చేయడం హంగామా సృష్టించడం జిల్లాలో పరిపాటిగా మారింది. జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో మంగళవారం అర్ధరాత్రి అధికార పార్టీకి చెంది న యవజన విభాగం పట్టణ అధ్యక్షుడు గడప రాకేష్ (జిమ్ రాకేష్) జన్మదిన వేడుకల పేరిట హంగామా సృష్టించారు. వేడుకల్లో ఆయన అనుచరులు తల్వార్ తిప్పుతున్న వీడియో వాట్సాప్‌లో వైరల్ కావడం గమనార్హం. సుమారు 20 రోజుల క్రితం జిల్లాలోని ఓ ఎమ్మెల్యే అనుచరుడు బెల్లంపల్లిలో అర్ధరాత్రి నడిరోడ్డుపై తల్వార్‌తో కేక్ కట్ చేసిన వీడియో, ఫొటోలు వాట్సాప్‌లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. జిల్లాలో అధికార పార్టీ నాయకులకు రాజకీయ నాయకుల అండదండలు, అధికారబలం, పోలీసుల అండదండలు మెండుగా ఉన్నట్లు సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తల్వార్లతో కేక్ కట్ చేసిన తాలూకూ ఫొటోలు వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ కావడంతో జన్మదిన వేడుకల్లో తల్వార్లతో కేక్ కట్ చేయడమేంటని జిల్లా ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇలాంటి వారితోనే యువతలో విషసంస్కృతి సంతరించుకుంటుందని, ఇలాంటి ఘటనలపై పోలీస్ యంత్రాంగం దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గడప రాకేష్ అనుచర వర్గంపై కేసు జన్మదిన వేడుకల్లో తల్వార్ తిప్పిన వీడియో వాట్సాప్‌లో వైరల్ కావడంతో రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ స్పందించి, మంచిర్యాల పోలీస్ స్టేషన్ సందర్శించారు. జన్మదిన వేడుకలపై ఆరాతీశారు. రాకేష్‌తో పాటు ఆయనకు సంబంధించిన అనుచర వర్గాన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వార్నింగ్‌తో పాటు 9మందిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక సీఐ ముత్తి లింగయ్య తెలిపారు. చట్టవ్యతిరేక పనులు సహించం చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. మంచిర్యాలలో గడప రాకేష్ అనే వ్యక్తి నిబంధనలకు వ్యతిరేకంగా బర్త్‌డే పార్టీ అర్ధరాత్రి బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించడం, పైగా ఆయన అనుచర వర్గం తల్వార్‌తో హంగామా సృష్టించడం నేరంగా పరిగణించి కేసు నమోదు చేశాం. – సత్యనారాయణ, సీపీ -
బెయిల్ కోసం ఆరుషి తల్లిదండ్రుల పిటిషన్
అలహాబాద్: ఆరుషి-హేమరాజ్ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఆమె తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపూర్ తల్వార్లు బెయిల్ కోసం అలహాబాద్ హైకోర్టును ఆశ్ర యించారు. విచారణను చేపట్టిన జస్టిస్ రాకేష్ తివారీ, అనిల్ కుమార్ అగర్వాల్ డివిజన్ బెంచ్ తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. నోయిడాకు చెందిన దంతవైద్యులైన దంపతులకు హత్య కేసులో సీబీఐ కోర్టు 2013 నవంబర్ 26న జీవిత ఖైదు విధించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు ఇద్దరు. ైతమ అప్పీలు పెండింగ్‌లో ఉన్నందున బెయిల్‌పై విడుదల చేయాలంటూ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు.