breaking news
Talaneelalu
-
యాదాద్రి తలనీలాల టికెట్ ధర రూ.50
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తలనీలాల టికెట్ ధరను రూ.50కి పెంచినట్టు ఆలయ ఈవో ఎన్.గీతారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో టికెట్ ధర రూ.20 ఉండగా రూ.50కి పెంచుతున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు వెల్లడించారు. పెంచిన ధర శనివారం నుంచి అమల్లోకి రానున్నట్లు ఈవో పేర్కొన్నారు. పెంచిన రూ.50 టికెట్ ధరలో 60 శాతం నాయీ బ్రాహ్మణులకు, 40 శాతం సొమ్ము దేవస్థానానికి చెందనుందని వివరించారు. -
కాణిపాకం ఆలయంలో తలనీలాల చోరీ
కాణిపాకం: ఇప్పటివరకు విలువైన వస్తువులను దొంగలు చోరీ చేయడాన్ని చూసాం. కానీ... వినడానికి కొంచెం వింతగానే ఉన్నా తలనీలాలను సైతం దొంగలు వదలడం లేదు. చిత్తూరు జిల్లాలో సుప్రసిద్ధ కాణిపాక వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో తలనీలాల చోరీ జరిగింది. మహిళా భక్తులు స్వామి వారికి సమర్పించిన తలనీలాలను హుండీలో ఉంచగా చోరులు తస్కరించుకు పోయారు. మహిళా భక్తుల తలనీలాలను కల్యాణకట్ట వద్ద ఉన్న ఓ ప్రత్యేక హుండీలో వేస్తుంటారు. శుక్రవారం రాత్రి హుండీలో తలనీలాలను కొక్కెం సాయంతో ఆగంతకులు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. దీనిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. చోరీకి గురైన తలనీలాల విలువ రూ.5 లక్షలు ఉంటుందని ఆలయ అధికారులు అంటున్నారు.