breaking news
Tagging
-
పశువులకూ ‘ఆధార్’
సాక్షి, చేజర్ల: పశువులకు ఆధార్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఫర్ యానిమల్ ప్రొడక్షన్ అండ్ హెల్త్ (ఇనాఫ్) ట్యాగింగ్ పేరిట ప్రతి పశువుకు ట్యాగింగ్ చేయాలనేది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. తొలి దశలో పాలు ఇచ్చే పశువులకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ తరువాత మిగిలిన వాటికి ట్యాగింగ్ చేస్తారు. సుమారు మూడు నెలల క్రిందట ఆత్మకూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం మొదలయినప్పటికీ ఇంతవరకు కేవలం 21 శాతం మాత్రమే పూర్తయింది. ఫిబ్రవరి నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ పశుగణన ప్రారంభం కావడంతో ఆధార్ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రధానంగా ట్యాగింగ్ పశువుల చెవులకు వేస్తారు. ఆ సమయంలో చెవికి రంధ్రం పెడతారు. అలా చేస్తే పశువుల విలువ పడిపోతుందనే భావన రైతుల్లో ఉంది. దీంతో చాలా మంది రైతులు ట్యాగింగ్‌కు అనాసక్తి చూపుతూ ముందుకు రావడం లేదు. ఈ ప్రక్రియ చేపట్టవద్దని పలు మండలాల్లో రైతులు పశువైద్యాధికారులను కోరుతున్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో 1.10లక్షలకు పైగానే ఆవులు, గేదెలు ఉన్నట్లు అధికార గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇందులో ప్రస్తుతం పాలిచ్చే పశువులకు మాత్రమే తొలివిడతగా ఆధార్ ప్రక్రియ పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు. పాలిచ్చే ఆవులు, గేదెలు నియోజకవర్గంలో 70 వేలకు పైగానే ఉన్నాయి. వీటిలో 20 శాతం మాత్రమే గోపాలమిత్రలు ట్యాగింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ప్రతి పశువుకు ట్యాగింగ్ అనేది అత్యంత ముఖ్యమైనదని పశువైద్యాధికారులు చెబుతున్నారు. భవిష్యత్తులో దీని ఆధారంగానే పశుపోషకులకు వివిధ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారని వెల్లడిస్తున్నారు. అలాగే ట్యాగ్‌లను ఆం«ధప్రదేశ్ పశు గణాభివృద్ధి సంస్థ వారు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమంపై ప్రచారం నోచుకోకపోవడంతో రైతులు ముందుకు రావడంలేదు. మండలం గేదెల సంఖ్య చేజర్ల 1,8000 అనంతసాగరం 1,7500 మర్రిపాడు 1,6000 ఏఎస్‌పేట 1,2000 సంగం 1,4000 ఆత్మకూరు 1,5000 -
చికాకు పోస్టులకు చెక్
‘ఫేస్బుక్’ అత్యధికులు కచ్చితంగా వినియోగిస్తున్న సామాజిక మాద్యమం. ఇందులో వందలాది మంది స్నేహితులు, వేలల్లో పోస్టులు. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే ఫేస్బుక్ అకౌంట్ టైమ్‌లైన్‌లో అనవసర పోస్టులు చికాకు కలిగిస్తుంటాయి. వీటికి చెక్ పెట్టాలంటే... –విశాఖపట్నం ⇒టైమ్‌లైన్ పోస్ట్, ట్యాగింగ్‌లను ఆపాలంటే ఫేస్బుక్ అకౌంట్లోని ‘సెట్టింగ్స్’ ఆప్షన్‌లోకి వెళ్లి అందులో అకౌంట్ సెట్టింగ్స్‌ని క్లిక్ చేయాలి. ⇒ ‘టైమ్ లైన్ అండ్ ట్యాగింగ్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ⇒ అక్కడ కొన్ని ఆప్షన్లతో పాటు వాటి పక్కన ’ఎడిట్’ ఆప్షన్ కూడా ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీ టైమ్‌లైన్‌లో ఎవరు పోస్టు పెట్టవచ్చు. మీ టైమ్‌లైన్‌ను ఎవరు చూడవచ్చు తదితర విషయాలను నియంత్రించవచ్చు. -
ఆరంభ శూరత్వంగా ‘ఆర్ఎఫ్ఐడీ’
జీజీహెచ్‌లో పని చేయని ‘ట్యాగింగ్’ వ్యవస్థ ‘ఆర్ఎఫ్ఐడీ’తో తల్లికి, పసి బిడ్డలకు రక్షణ కవచాలు జీజీహెచ్‌లో ఆర్ఎఫ్ఐడీ ట్యాగింగ్ సిస్టమ్ ఏర్పాటు ఆరంభ శూరత్వంగా మారింది. రాష్ట్ర మంత్రులు అట్టహాసంగా ప్రారంభించిన ఈ ప్రక్రియ ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. హైటెక్ ముఖ్యమంత్రిగా గొప్పలు చెప్పుకునే చంద్రబాబు టెక్నాలజీతో కూడిన కార్యక్రమాలు ఆగిపోతున్నా వాటిపై దృష్టి సారించడం లేదు. గుంటూరు మెడికల్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో తరచుగా పసికందులు అదృశ్యమైన ఘటనలు చోటు చేసుకుంటుండటంతో ఎట్టకేలకు స్పందించిన ప్రభుత్వం పిల్లల అపహరణను నియంత్రించేందుకు గుంటూరు జీజీహెచ్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్ఎఫ్ఐడీ) ట్యాగింగ్ సిస్టమ్‌ను మొదటిసారిగా 2016 జూలై 16న గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ప్రారంభించింది. ఆస్పత్రిలో నాలుగు చోట్ల ఏర్పాటు... పసికందులు పుట్టిన వెంటనే తల్లికి, బిడ్డకు (ఒకే నంబర్ ఉన్న) ఆర్ఎఫ్ఐడీ ట్యాగ్‌ను అమరుస్తారు. ఈ వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేస్తారు. తల్లీబిడ్డకు మధ్య 10 మీటర్ల దూరం దాటితే వెంటనే పెద్దగా శబ్ధం వస్తుంది. వేరేవారు పిల్లలను పట్టుకుంటే వెంటనే దొరికిపోతారు. ప్రధాన ద్వారాల వద్ద, వార్డుల్లో సైరన్ శబ్ధం వినిపించే సరికి సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమవుతారు. ఈ ట్యాగ్‌లను సెన్సార్లు మోనిటర్ చేస్తుంటాయి. ఆస్పత్రిలోని లేబర్ రూమ్, ఎస్ఎన్సీయూ, పిల్లల వైద్య విభాగం, గైనకాలజీ వైద్య విభాగ వార్డుల్లో ఈ సెన్సార్లు ఏర్పాటు చేశారు. గుజరాత్‌కు చెందిన ఓడోహబ్ డాట్ కామ్ సంస్థ ఈ నూతన సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. రూ.12 లక్షల ఖర్చుతో... జీజీహెచ్‌లో ఈ వ్యవస్థ ఏర్పాటుకు సుమారు రూ.12 లక్షల వరకు ఖర్చయ్యింది. ముందస్తు ఒప్పందంతోనే సెక్యూరిటీ కాంట్రాక్ట్ సంస్థౖయెన జేబీ సెక్యూరిటీ నిర్వాహకులు ఈ ఖర్చును భరించారు. ఆన్లైన్లో వివరాల నమోదుకు రిసెప్షనిస్ట్ కమ్ ఆపరేటర్‌ను కూడా నియమించారు. ట్యాగ్లు ఏర్పాటు చేసేందుకు జతకు రూ.50 ఖర్చవుతుందని, అహ్మదాబాద్ నుంచి ట్యాగ్‌లను తెప్పిస్తున్నామని ఆసుపత్రి అధికారులు తెలిపారు. ప్రారంభానికే పరిమితం.. అయితే, అట్టహాసంగా ప్రారంభమైన ఆర్ఎఫ్ఐడీ ట్యాగింగ్ విధానం ఆరంభ శూరత్వంగా మిగిలింది. ప్రారంభానికే పరిమితమై ఆచరణలోకి రాలేదు. అయితే, కాంట్రాక్టర్లు ట్యాగ్‌లను కొనుగోలు చేయకుండా తాత్సారం చేస్తున్నా జీజీహెచ్ అధికారులు పట్టించుకోవట్లేదు. పైగా ప్రతినెలా వారి పని తీరుకు 80 శాతానికిపైగా మార్కులు వేసి నిధులు వచ్చేందుకు దోహదం చేస్తున్నారు. సెక్యూరిటీ సిబ్బందికి నిర్వాహకులు జీతాలు ఇవ్వకపోయినా, ఆర్ఎఫ్ఐడీ టాగ్లు తెప్పించకపోయినా ఆసుపత్రి అధికారులు కాంట్రాక్టు సంస్థకు వత్తాసు పలుకుతుండటం విమర్శలకు తావిస్తోంది. సాంకేతిక సమస్యలు వచ్చాయి.. ఆర్ఎఫ్ఐడీ ట్యాగింగ్ సిస్టమ్‌లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. సాఫ్ట్వేర్ తప్పుగా వస్తుండటంతో ట్యాగ్లు ఏర్పాటు చేసినా సక్రమంగా పని చేయడం లేదు. కొత్త సాఫ్ట్వేర్ ఏర్పాటు చేయాలని సెక్యూరిటీ కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. – డాక్టర్ అనంత శ్రీనివాసులు, జీజీహెచ్ ఆర్ఎంవో