విషజ్వరంతో మహిళ మృతి
బోయినపల్లి : మండలంలోని తడగొండ గ్రామానికి చెందిన సారబుడ్ల రజిత(30) అనే వివాహిత విషజ్వరంతో మృతి చెందింది. రజిత, రమేష్‌రెడ్డి కుటుంబం కొంతకాలంగా కరీంనగర్‌లోని సూర్యనగర్‌లో నివాసం ఉంటూ తెలంగాణ చౌక్ సమీపంలో జీఎస్ టిఫిన్ సెంటర్, రెడ్డి చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. రజితకు పది రోజుల క్రితం జ్వరం రాగా.. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్ తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న రజిత బుధవారం మృతి చెందింది.