breaking news
tablet phone
-
జియో నుంచి స్మార్ట్‌టీవీలు, టాబ్లెట్స్..! లాంచ్ ఎప్పుడంటే..!
Jio Tablet & Jio TV Launch In 2022: పలు స్మార్ట్‌ఫోన్ కంపెనీలు భారత మార్కెట్లలో స్మార్ట్‌టీవీలను కూడా లాంచ్ చేస్తోన్న విషయం తెలిసిందే. రెడ్మీ, రియల్మీ, నోకియా, మోటరోలా వంటి ప్రత్యర్థులకు పోటీగా స్మార్ట్‌టీవీలను, టాబ్లెట్స్‌ను విడుదల చేసే పనిలో రిలయన్స్ జియో ఉన్నట్లు తెలుస్తోంది. తక్కువ ధరలకే..! టెలికాం రంగంలో రిలయన్స్ జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. టెలికాం రంగంలోనే కాకుండా భారతీయులకు మరింత దగ్గరయ్యేందుకుగాను జియోఫోన్, జియో ఫోన్ నెక్స్ట్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసింది. వీటితో పాటుగా స్మార్ట్‌టీవీలను, టాబ్లెట్స్‌ను జియో లాంచ్ చేయనుంది. సరసమైన ధరలతో తన ఉపకరణాల పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు జియో ప్రణాళికలను రచిస్తోంది. దేశవ్యాప్తంగా స్మార్ట్‌టీవీ, టాబ్లెట్ మార్కెట్లలో ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌ను లక్ష్యంగా చేసుకొని తక్కువ ధరలకే అమ్మకాలను జరిపే ఆలోచనలో జియో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర కంపెనీలతో పోలిస్తే..జియో స్మార్ట్‌టీవీలు తక్కువ ధరలకే వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణుల భావిస్తున్నారు. ఏజీఎం సమావేశంలో లాంచ్..! 91మొబైల్స్ నివేదిక ప్రకారం... స్మార్ట్‌టీవీ, టాబ్లెట్లను వచ్చే ఏడాదిలో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియో తన తదుపరి వార్షిక సాధారణ సమావేశంలో రాబోయే ఉత్పత్తులపై ప్రకటన చేసే అవకాశం ఉంది. ఏజీఎం సమావేశంలోనే పలు కొత్త ఉత్పత్తులను రిలయన్స్ జియో లాంచ్ చేస్తూ వస్తోంది. ప్రీలోడెడ్ యాప్స్..ప్రగతి ఓఏస్తో.. జియో స్మార్ట్‌టీవీలో ప్రీలోడెడ్ ఓటీటీ యాప్స్ వంటి స్మార్ట్ఫీచర్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా స్మార్ట్‌టీవీలు ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై ఏలాంటి స్పష్టత లేదు. మరోవైపు, జియో టాబ్లెట్‌లో ప్రగతిఓఎస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టాబ్లెట్‌లో ఎంట్రీ-లెవల్ క్వాలకమ్ ప్రాసెసర్‌ని ఉపయోగించనున్నారు. చదవండి: జియో యూజర్లకు భారీ షాక్..! భారీగా పెరిగిన టారిఫ్ ధరలు..! -
హైటెక్ అంగన్వాడీ కేంద్రాలు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాలు ఇకపై హైటెక్ రూపు సంతరించుకోనున్నాయి. అంగన్వాడీ కేంద్రాల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అన్ని కేంద్రాలకు ట్లాబ్లెట్ పీసీలను అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించనున్నారు. పోషకాహార సరఫరా, చిన్నారుల ఆరోగ్యం వంటి వివరాలు అంగన్వాడీ కార్యకర్తలు ట్యాబ్లెట్ ద్వారా అవసరమైన వెంటనే అప్లోడ్ చేస్తారని అధికారులు తెలిపారు. ఇంటిగ్రేటెడ్ చిల్డ్రన్ డెవలప్మెంట్ స్కీమ్ కింద ప్రభుత్వం దేశవ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా 1,045 లక్షల మందికి పోషకాహారం అందిస్తోంది. వీరిలో 849 లక్షల మంది ఆరేళ్లలోపు చిన్నారులు ఉన్నారు.