breaking news
T. S. Thakur
-
కేంద్రం, న్యాయవ్యవస్థ మధ్య వివాదం తీవ్రం
న్యూఢిల్లీ: జడ్జిల నియామకం విషయంలో కేంద్రం, న్యాయ వ్యవస్థ మధ్య వివాదం తీవ్రతరమైంది. జడ్జీల నియామకాల్లో జరుగుతున్న జాప్యంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 500 హైకోర్టు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యలపై అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ ధీటుగా స్పందించారు. అందరితో పాటూ న్యాయవ్యవస్థకూ లక్షణ రేఖ ఉంటుందన్నారు. ఆ లక్ష్మణరేఖను న్యాయవ్యవస్థ గుర్తించాలని సూచించారు. ఆత్మపరిశీలనకు సిద్ధం కాలాలని ముకుల్ రోహత్గీ తెలిపారు. -
జడ్జీలను నియమించకపోవడం.. హక్కుల ఉల్లంఘనే
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ న్యాయం అందుబాటులో ఉండడం ప్రజల ప్రాథమిక హక్కు న్యాయ నియామకాల కమిషన్ వివాదంతో జడ్జీల భర్తీ ఆగింది న్యాయమూర్తుల నియామకాలను సత్వరం చేపట్టాలి అసంఘటిత రంగ కార్మికులకు, పేదలకు న్యాయం అందాలి లోక్‌అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని సూచన న్యాయసేవా సాధికార సంస్థల 14వ జాతీయ సదస్సు హాజరైన కేంద్ర మంత్రి సదానంద గౌడ, సీఎం కేసీఆర్, జస్టిస్ దవే, జస్టిస్ రమణ, జస్టిస్ బొసాలే న్యాయం అందుబాటులో ఉండడం ప్రజల ప్రాథమిక హక్కు అని, జడ్జీల పోస్టుల భర్తీలో ఆలస్యం కారణంగా ప్రజల ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ పేర్కొన్నారు. న్యాయమూర్తుల నియామకాల్లో జాప్యంతో న్యాయవ్యవస్థలపై కేసుల భారం పెరుగుతోందని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో ఏర్పాటు చేసిన న్యాయసేవా సాధికార సంస్థల 14వ జాతీయ సదస్సుకు జస్టిస్ ఠాకూర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. జాతీయ న్యాయ నియామకాల కమిషన్ ఏర్పాటు వివాదంతో ఏడాది పాటు న్యాయ నియామకాలు నిలిచిపోయాయని ఆయన పేర్కొన్నారు. దాంతో దేశవ్యాప్తంగా 450 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ ఏడాది చివరి నాటికి మరో 50 ఖాళీలు ఏర్పడుతాయని చెప్పారు. 90 మంది శాశ్వత న్యాయమూర్తులు, 40 మంది కొత్త జడ్జీల నియామకాలకు మార్గం సుగమమైందని... వారి నియామకాల ప్రక్రియను త్వరగా పూర్తిచేసేందుకు న్యాయశాఖ మంత్రి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. మరో 130 నియామకాల కోసం అర్హులైన న్యాయవాదుల పేర్లు సిఫార్సు చేశామన్నారు. సగటు పౌరుడికి న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని మరింతగా పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఉచిత న్యాయ సహాయం అందాలి..: దేశంలోని 46 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికుల్లో 14 కోట్ల మంది మహిళలు ఉన్నారని.. అలాగే 40 కోట్ల మంది పేదలు ఉన్నారని జస్టిస్ ఠాకూర్ పేర్కొన్నారు. వారందరికీ ఉచితంగా న్యాయ సహాయాన్ని అందించాల్సిన బాధ్యత న్యాయసేవా సాధికార సంస్థలపై ఉందని స్పష్టం చేశారు. వారి సంక్షేమం కోసం పనిచేసే యూనియన్లు లేవన్నారు. డ్రైవర్లు, ఇళ్లలో పనిచేసేవారు, దాబాలు, హోటళ్లలో పనిచేసే వెయిటర్లు ఇలా కోట్లాది మంది కార్మికులు శ్రమదోపిడీకి గురికాకుండా చూడాల్సిన బాధ్యత న్యాయవాదులదేనని చెప్పారు. న్యాయసేవా సాధికార సంస్థ ఏర్పాటు చేసే న్యాయవాదులు అనుభవం లేని వారనే అపోహ ఉందని... సమర్థులైన న్యాయవాదులను నియమించి ఆ అపోహను పోగొట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. లోక్ అదాలత్‌లు పేదల కోసం మాత్రమే కాదని, ధనవంతులకు కూడా అవి ఉపయుక్తంగా ఉంటాయని స్పష్టం చేశారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 1947లో జనాభా 30 కోట్లు ఉంటే ప్రస్తుతం 130 కోట్లు ఉందని, అప్పుడు పేదల సంఖ్య 10 కోట్లు ఉంటే ఇప్పుడు 40 కోట్లకు పెరిగిందన్నారు. భారం తగ్గించాం: జస్టిస్ అనిల్ రమేశ్ దవే లోక్‌అదాలత్‌ల ద్వారా దేశవ్యాప్తంగా 62 లక్షల పెండింగ్ కేసులను, 1.61 కోట్ల ప్రీలిటిగేషన్ (పోలీసు విచారణ దశలో ఉన్న) కేసులను పరిష్కరించి కోర్టులపై భారాన్ని తగ్గించామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనిల్ రమేష్ దవే చెప్పారు. లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవడం ద్వారా ఇరువర్గాలు సంతోషంగా ఉంటాయన్నారు. మనుషుల అక్రమ రవాణా, అసంఘటిత రంగ కార్మికులకు, వేధింపులకు గురవుతున్న బాలబాలికలకు న్యాయసహాయం, పేదరిక నిర్మూలన చర్యలు, గిరిజనుల హక్కులు, పరిరక్షణ, మత్తు పదార్థాల బారిన పడిన బాధితులకు న్యాయ సహాయం అందించడంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. అట్టడుగువర్గాలకు న్యాయ సహాయం అందాలి: జస్టిస్ ఎన్వీ రమణ అట్టడుగువర్గాలకు ఇప్పటికీ న్యాయ సహాయం అందని పరిస్థితి ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ (ఎన్వీ రమణ) అన్నారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతను ఆదుకునేందుకు న్యాయసేవా సాధికార సంస్థలు కృషి చేయాలని కోరారు. రంగారెడ్డి జిల్లా తాండూరులో ఇటీవల వారెంట్ రీకాల్ కోసం న్యాయవాదికి ఫీజు చెల్లించేందుకు డబ్బు లేక ఒక వ్యక్తి తన తల్లి, సోదరిని హత్య చేసి, తానూ తనువు చాలించిన ఘటనను ప్రస్తావించారు. ప్రజలకు న్యాయ సహాయం అందుతున్న తీరుపై బెంగళూరుకు చెందిన దక్షా సంస్థ జరిపిన సర్వేలో అనేక చేదు నిజాలు వెల్లడయ్యాయని చెప్పారు. దాదాపు 31.3 శాతం మంది నిందితులకు న్యాయ సహాయం ఎలా పొందాలో కూడా తెలియదని... 40.2 శాతం మంది నిందితుల వార్షికాదాయం రూ.లక్షలోపు మాత్రమేనని పేర్కొన్నారు. అలాగే 90 శాతం మంది నిందితులు మొదటిసారి నేరాలకు పాల్పడినవారేనని తేలిందన్నారు. బాల నేరస్తులకు న్యాయ సహాయం అందడం లేదని, వారికి సత్వర న్యాయం అందించేందుకు ప్రయత్నించాలని సూచించారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి కలిగిన వ్యక్తి అని, రాష్ట్ర అభివృద్ధికి నిబద్ధతతో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ఆయన తెలుగు భాషా ప్రేమికుడని, సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షిస్తున్నారని కొనియాడారు. మధ్యవర్తిత్వంతో పరిష్కారం: జస్టిస్ బొసాలె మధ్యవర్తిత్వం ద్వారా 26 శాతం కేసులను పరిష్కరించామని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలె తెలిపారు. 10 నెలల కాలంలో 5,335 కేసులను మధ్యవర్తిత్వ కేంద్రాలకు సిఫార్సు చేస్తే అందులో 1,009 కేసులు పరిష్కారమయ్యాయని చెప్పారు. మధ్యవర్తులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించామని, 1,103 ప్యానల్ మధ్యవర్తులు, 296 మంది శిక్షణ పొందిన మధ్యవర్తులు అందుబాటులో ఉన్నారని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 13,715 లోక్‌అదాలత్‌లను నిర్వహించి 3.64 లక్షల కేసులను పరిష్కరించామని, బాధితులకు రూ.728 కోట్లు పరిహారంగా అందించామని వెల్లడించారు. 5 వేల అవగాహనా క్యాంపులు నిర్వహించి 4,340 మందికి ఉచిత న్యాయ సహాయం అందించామని తెలిపారు. మరింతగా కృషి జరగాలి: సదానందగౌడ లోక్ అదాలత్‌ల ద్వారా 5.5 లక్షల బ్యాంకింగ్ కేసులు పరిష్కారమయ్యాయని కేంద్ర న్యాయ మంత్రి సదానందగౌడ చెప్పారు. ఈసారి బడ్జెట్లో జాతీయ న్యాయసేవా సాధికార సంస్థకు రూ.140 కోట్లు కేటాయించామని తెలిపారు. లోక్‌అదాలత్‌ల లక్ష్యాన్ని సాధించేందుకు మరింతగా కృషి జరగాలన్నారు. పూచీకత్తు సమర్పించలేక అనేక మంది విచారణ ఖైదీలు జైళ్లలో మగ్గిపోతున్నారని.. జైళ్లలో ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లీనిక్స్ వారికి ఉపయుక్తంగా ఉంటాయని చెప్పారు. అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలి: సీఎం కేసీఆర్ ప్రత్యామ్నాయ విధానాల ద్వారా (ఏడీఆర్) వ్యక్తులతో ఉన్న వివాదాలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. పేద, అట్టడుగు వర్గాల ప్రజలకు అందరితో సమానంగా న్యాయం అందించాలని రాజ్యాంగం నిర్దేశించిందన్నారు. పేదరికం, వెనుకబాటుతనం కారణంగా ఎవరూ న్యాయ తిరస్కరణకు గురికాకూడదని పేర్కొన్నారు. ఖర్చు లేకుండా, సమయం వృథా కాకుండా లోక్‌అదాలత్‌లో న్యాయం పొందవచ్చన్నారు. పూర్వం గ్రామ పెద్దలు వివాదాలను పరిష్కరించిన తరహాలోనే నిరుపేదలకు న్యాయం అందించే లక్ష్యంతో లోక్‌అదాలత్‌లు పనిచేస్తున్నాయని, దీన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ చంద్రయ్య, జస్టిస్ రమేశ్‌రంగనాథన్, ఉమ్మడి రాష్ట్రాల లోకాయుక్త జస్టిస్ బి.సుభాషణ్‌రెడ్డి, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, బిహార్ మాజీ సీజే జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి, నల్సా సభ్య కార్యదర్శి అలోక్ అగర్వాల్‌తోపాటు హైకోర్టు న్యాయమూర్తులు, అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల న్యాయసేవా సాధికార సంస్థల సభ్య కార్యదర్శులు పాల్గొన్నారు. న్యాయసేవా సంస్థ వెబ్సైట్ ఆవిష్కరణ తెలంగాణ న్యాయసేవా సాధికార సంస్థ వెబ్‌సైట్‌ను, అంధులకు ఉపయుక్తంగా ఉండేలా వికలాంగుల హక్కులపై బ్రెయిలీ లిపి (తెలుగు)లో రూపొందించిన 13 చట్టాలను సదస్సు సందర్భంగా ఆవిష్కరించారు. న్యాయసేవా సాధికార సంస్థ యాప్‌ను సదానందగౌడ ఆవిష్కరించారు. ప్రత్యామ్నాయ విధానంగా ద్వారా వివాదాలను పరిష్కరించుకోవడం కోసం రూపొందించిన హ్యాండ్‌బుక్.. ఏపీ, తెలంగాణలో న్యాయసేవా సాధికార సంస్థలు సాధించిన విజయాలపై రూపొందించిన పుస్తకాలను జస్టిస్ దవే ఆవిష్కరించారు. సింగరేణి స్వాధీనం చేసుకున్న భూమికి సంబంధించి రూ.74 కోట్ల పరిహారాన్ని బాధితులకు అందించారు. యాసిడ్‌దాడిలో గాయపడిన వ్యక్తికి రూ.3 లక్షల పరిహారాన్ని జస్టిస్ రమణ అందించారు. -
రాయ్ వినతి మళ్లీ తిరస్కరణ
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతా రాయ్‌కు సుప్రీం కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. మూడు నెలలుగా జైల్లో ఉన్న రాయ్... తనను గృహ నిర్బంధంలో ఉంచాలంటూ చేసిన విజ్ఞప్తిని కోర్టు బుధవారం తిరస్కరించింది. అయితే, ఆయన బెయిల్ కోసం గ్రూప్ ఆస్తుల అమ్మకం ద్వారా రూ.5 వేల కోట్లు సమీకరించేందుకు, అంతే మొత్తంలో బ్యాంకు గ్యారంటీ సాధించేందుకు అనుమతించింది. భారతీయ నగరాల్లో 9 స్థిరాస్తుల అమ్మకానికి అనుమతిస్తున్నట్లు జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఎ.కె.సిక్రిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే ఈ ఆస్తుల కొనుగోలుదారులకు సహారా గ్రూప్‌తో ఎలాంటి సంబంధాలు ఉండరాదనీ, సర్కిల్ రేటు కంటే తక్కువ ధరకు విక్రయించరాదనీ స్పష్టంచేసింది. కాగా అంతక్రితం బెయిల్‌కోసం రూ.10,000 కోట్లు సమర్పించే విషయంలో గ్రూప్ తాజా ప్రతిపాదనను తిరస్కరించింది. త్రిసభ్య ధర్మాసనానికి నివేదన: ప్రస్తుత ధర్మాసనం కేసును విస్తృతస్థాయి త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ బెంచ్‌ని ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా ఏర్పాటు చేస్తారు. కోర్టుకు ఈ విషయంలో సలహాలను, అభిప్రాయాలను అందించడానికి సీనియర్ న్యాయవాది ఎఫ్ఎస్ నారిమన్‌ను నియమిస్తున్నట్లు కూడా ధర్మాసనం పేర్కొంది. ఒక వాయిదాకు రూ.1.10 లక్షల ఫీజును ఆయనకు సెబీ చెల్లిస్తుంది. ఆ డబ్బును సెబీ తిరిగి సహారా గ్రూప్ అకౌంట్ నుంచి వసూలు చేసుకోవచ్చు. పెరోల్ తరహా సడలింపు పరిశీలన!: కాగా 92 సంవత్సరాల తన తల్లిని కలుసుకునేందుకు రాయ్‌ని అనుమతించాలని, పెరోల్ తరహాలో 5 రోజులు జైలు నుంచి పంపడానికి అనుమతినివ్వాలని సీనియర్ అడ్వకేట్ ఎస్ గణేష్ మౌఖికంగా చేసిన విజ్ఞప్తిని పరిశీలించడానికి బెంచ్ అంగీకరించింది. అయితే ఈ అంశాన్ని ఒక అప్లికేషన్ రూపంలో ఫైల్ చేయాలని నిర్దేశించింది. -
ఆమోదయోగ్య ప్రతిపాదనతో రండి
న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతారాయ్, గ్రూప్ కంపెనీల డెరైక్టర్లు ఇరువురు బెయిల్‌కు రూ.10,000 కోట్ల చెల్లింపులపై తగిన ఆమోదయోగ్య ప్రతిపాదనతో రావాలని సుప్రీంకోర్టు కొత్త బెంచ్ సోమవారం సూచించింది. కేసులో నెలకొన్న ప్రతిష్టంభన వల్ల ఎవ్వరికీ ప్రయోజనం ఉండబోదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లక్నోలో రాయ్‌ని గృహ నిర్బంధం కింద ఉంచాలన్న విజ్ఞప్తిని మాత్రం జస్టిస్ టి.ఎస్.ఠాకూర్, జస్టిస్ ఎ.కె.సిక్రిలతో కూడిన బెంచ్ తోసిపుచ్చింది. న్యాయమూర్తులు జె.ఎస్. కేహార్, కె.ఎస్. రాధాకృష్ణన్‌లతో కూడిన ధర్మాసనం 2012 నుంచి సహారా కేసును విచారించింది. అయితే, ఈ నెల 14న రాధాకృష్ణన్ రిటైర్ కావడం, కేహార్ స్వచ్ఛందంగా తప్పుకోవడంతో కొత్త బెంచ్‌ను ఏర్పాటు చేశారు. లండన్, న్యూయార్క్‌లో ఉన్న హోటెల్స్సహా తన ఆస్తుల అమ్మకానికి సహారా సిద్ధమని సహారా సుప్రీంకోర్టుకు తెలపడం మరో ముఖ్య విషయం. కొత్త బెంచ్ వద్ద ప్రాథమిక స్థాయిలో జరిగిన విచారణ ప్రతిష్టంభనను తొలగించే దిశలో కొంత సానుకూలంగా ఉన్నట్లు పేర్కొన్న బెంచ్, తాజా ప్రతిపాదనతో ముందుకు రావాలని సూచించింది. వచ్చే వారం కేసు తదుపరి విచారణ జరగనుంది. 75 రోజల నుంచి తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న రాయ్‌ని విడుదల చేయాల్సి ఉందని అంతకుముందు సీనియర్ అడ్వకేట్ రాజీవ్ ధావన్ వాదించారు. లక్నోలో ఆయనను హౌస్ అరెస్ట్ కింద ఉంచాలని సైతం విజ్ఞప్తి చేశారు. అయితే ఈ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది.