synthetic drugs
-
రూ.1,800 కోట్ల డ్రగ్స్ పట్టివేత
అహ్మదాబాద్: గుజరాత్ తీరంలో మాదకద్రవ్యాలను అక్రమంగా తీసుకువచ్చే పాకిస్తాన్ స్మగ్లర్ల ఆటకట్టింది. గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ బృందం(ఏటీఎస్), తీర రక్షక దళం(ఐసీజీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో రూ.1,800 కోట్ల విలువైన 300 కిలోల మెథాంఫెటమైన్ అనే సింథటిక్ డ్రగ్ పట్టుబడింది. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి దాటాక అరేబియా సముద్రంలో ఘటన చోటుచేసుకుంది. ఫిదా అనే పేరున్న మాఫియా ముఠా చేపల పడవలో భారత జలాల్లోకి ప్రవేశించనుందంటూ ఏటీఎస్ అందించిన నిఘా సమాచారం మేరకు ఐసీజీ గస్తీని ముమ్మరం చేసింది. అంతర్జాతీయ సముద్ర జలాలకు అత్యంత సమీపంలో అర్ధరాత్రి సమయంలో ఐసీజీ గస్తీ ఓడను దూరం నుంచే గమనించిన స్మగ్లర్లు తమ బోటులో ఉన్న డ్రగ్స్ డ్రమ్ములను సముద్రంలో విసిరేశారు. వేగంగా అంతర్జాతీయ సముద్ర జలాల సరిహద్దుల వైపు వెళ్లిపోయారు. ఇదంతా వెంటవెంటనే జరిగిపోయింది. వారిని పట్టుకునేందుకు ఐసీజీ చేసిన ప్రయత్నం ఫలించలేదు. కటిక చీకటిలోనే వారు విసిరేసిన డ్రగ్ పార్శిళ్లను ఐసీజీ, ఏటీఎస్ సిబ్బంది గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న 311 ప్యాకెట్లలో 311 కిలోల మెథాంఫెటమైన్‌ను పోర్బందర్ తీరానికి తరలించి, దర్యాప్తు చేపట్టామని ఐసీజీ తెలిపింది. ఈ ప్యాకెట్లను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో సీల్ వేసి ఉంచారని, సముద్ర జలాల్లో వేసినా అందులోని సరుకు పాడవదని ఏటీఎస్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ సునీల్ జోషి చెప్పారు. ఈ డ్రగ్స్ గమ్యస్థానం తమిళనాడని ఆయన వివరించారు. పాక్‌లోని పస్ని పోర్టు నుంచి బయలుదేరిన మాఫియా సభ్యులు సముద్ర జలాల్లోనే డ్రగ్స్‌ను మరో బోటులోకి మార్చి, ఆపైన తమిళనాడుకు చేరవేయాల్సి ఉందని ఆయన వెల్లడించారు. ఇటీవలి కాలంలో ఇటువంటి 13 ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసి, అక్రమార్కుల ఆటకట్టించామని వివరించారు. కాగా, ఐస్, క్రిస్టల్ మెథ్ అని కూడా పిలిచే మెథాంఫెటమైన్ చాలా శక్తివంతమైన డ్రగ్. పొట్టలో రూ.7.85 కోట్ల కొకైన్ ముంబై: ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఉగాండా దేశస్తుడి పొట్టలో రూ.7.85 కోట్ల విలువుండే 785 గ్రాముల కొకైన్‌ను గుర్తించారు. ఈ నెల 9వ తేదీన రాత్రి ఓ విమానంలో వచ్చిన అతడిని అధికారులు అడ్డుకున్నారు. విచారణ సమయంలో అతడు ఆందోళనతో కనిపించడంతో కనిపించాడు. దీంతో, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేయించగా పొట్టలో టాబ్లెట్లు ఉన్నట్లు తేలింది. -
ఉడ్తా కేరళ!
అందమైన అడవులు, కొండలు, లోయలతో దేవుడు తీరిగ్గా తీర్చిదిద్దినట్టుగా ఉండే కేరళ మాదకద్రవ్యాల మత్తులో కూరుకుపోతోంది. రాష్ట్రాన్ని డ్రగ్స్ భూతం కబళిస్తోంది. చివరికి స్కూలు విద్యార్థులు కూడా డ్రగ్స్‌కు బానిసలవుతున్న పరిస్థితి! మాదకద్రవ్యాల వాడకంలో పంజాబ్‌ను కూడా దాటేసి దేశంలో తొలి స్థానంలో నిలిచింది. కేరళలోని కడక్కవూర్‌లో ఓ మహిళ డ్రగ్స్ మత్తులో టీనేజీ వయసున్న కన్న కొడుకుపైనే లైంగిక దాడులకు పాల్పడింది. దాంతో సహించలేక మరో కొడుకు ఆమెను చంపేశాడు! సంచలనం రేపిన ఈ ఘటన రాష్ట్రంలో సింథటిక్ డ్రగ్స్ విజృంభణకు ఉదాహరణ మాత్రమే.కేరళలో ఏ మూలన చూసినా డ్రగ్స్ ఘాటు గుప్పున కొడుతోందని నార్కోటిక్ గణాంకాలు చెబుతున్నాయి. 2024లో రాష్ట్రవ్యాప్తంగా నార్కోటిక్ డ్రగ్స్, సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం,1985 కింద ఏకంగా 24,517 కేసులు నమోదయ్యాయి. డ్రగ్స్ అతి వాడకానికి మారుపేరుగా మారిన పంజాబ్‌లో నమోదైంది 9,734 కేసులే! ‘‘సింథటిక్ డ్రగ్స్ రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా కఠిన చట్టాలు చేయాల్సిన సమయమొచి్చంది. స్కూళ్ల ప్రాంగణాల్లోనూ డ్రగ్స్ బయటపడుతున్నాయి’’ అని కేరళ హైకోర్టు జస్టిస్ వీజీ అరుణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పరిస్థితికి అద్దం పడుతున్నాయి.330 శాతం అధికం 2021 నుంచి చూస్తే మూడేళ్లలో కేరళలో డ్రగ్స్ కేసులు 330 శాతం పెరిగాయి. నమోదవని ఘటనలు మరెన్నో రెట్లు ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రంలో తరచూ భారీ పరిమాణంలో మత్తుపదార్థాలను పోలీసులు స్వా«దీనం చేసుకుంటున్నారు. గతంలో స్థానికంగా దొరికే గంజాయి సేవించేవారు. ఇప్పుడు సింథటిక్ డ్రగ్స్ వైపు మళ్లుతున్నారని స్వయంగా హైకోర్టు న్యాయమూర్తే వాపోయారు. దీనిపై అసెంబ్లీలో రెండుసార్లు చర్చించడమే గాక సమస్య పార్లమెంటులోనూ ప్రస్తావనకు వచ్చింది. ఎన్నెన్ని విషాదాలో...! డ్రగ్స్‌కు బానిసలైన వారి కుటుంబాల్లో ఆనందం ఆవిరవుతోంది. యువత, ముఖ్యంగా మైనర్లు మత్తులో తూగుతున్నారు..→ కాలికట్ జిల్లాలో మత్తుకు బానిసైన పాతికేళ్ల ఆశిఖ్ తన తల్లినే నరికి చంపాడు. పైగా ‘నాకు జన్మనిచి్చనందుకు శిక్షించా’ అంటూ డ్రగ్స్ మత్తు లో చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్‌గా మా రింది.→ త్రిసూర్‌లో మరో పాతికేళ్ల వ్యక్తి తల్లి నాలుక కోసేశాడు. జనవరి 1న త్రిసూర్‌లోనే 14, 16 ఏళ్ల టీనేజర్లు బహిరంగంగా డ్రగ్స్ తీసుకుంటూ హల్చల్ చేశారు. వారించిన 30 ఏళ్ల వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేశారు.→ తమ అబ్బాయి డ్రగ్స్ వ్యసనాన్ని వదిలించలేకపోతున్నామంటూ పథినంతిట్ట జిల్లాలో ఒక వృద్ధ జంట ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కంటతడి పెట్టించింది.→ డ్రగ్స్ మానేయమన్న అక్క ముఖాన్ని బ్లేడుతో చెక్కేశాడో తమ్ముడు. మరో ప్రబుద్ధుడు మందలించిన తండ్రిపైనే దాడికి దిగాడు. ఇంకొకడు డ్రగ్స్ కొనేందుకు డబ్బివ్వలేదని తల్లినే చితకబాదాడు.→ డ్రగ్స్ తీసుకుంటూ టీచర్లకు పట్టుబడి, విషయం ఇంట్లో చెప్పొద్దని వాళ్లనే బెదిరిస్తున్న విద్యార్థులకు కొదవే లేదు. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీలో లావాదేవీలు డ్రగ్స్‌ను ముఠాలు పోలీసులకు చిక్కకుండా అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నాయి. డార్క్‌వెబ్, క్రిప్టోకరెన్సీ, వాట్సాప్ గ్రూప్‌ల్లో లావాదేవీలు సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేరళలో డ్రగ్ సరఫరా చేసే హాట్స్పాట్లు ఏకంగా 1,300కు పైగా ఉన్నట్లు చెబుతున్నారు. కొకైన్, హషి‹Ù, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వాడకం ఎక్కువగానే ఉన్నా మిథేలిన్ డైఆక్సీ మిథాఫెటమైన్ (ఎండీఎంఏ) వీటన్నింటినీ మించిపోయింది. దీని వాడకం ఏడాదిలోనే ఏకంగా 65 శాతం పెరిగింది. ఎండీఎంఏ, మెథ్ వేరియంట్ డ్రగ్స్ బెంగళూరు, చెన్నై నుంచి కేరళలోకి వస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. 590 కిలోమీటర్ల సముద్రతీరం కూడా డ్రగ్స్ సరఫరాకు రాచమార్గంగా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, థాయిలాండ్ దేశాల నుంచి డార్క్‌వెబ్ ద్వారా క్రిప్టో కరెన్సీని విక్రయించి బదులుగా కొరియర్ల ద్వారా డ్రగ్స్ తెప్పిస్తున్నారు.నాలుగేళ్లలో 93,599 అరెస్టులు! కేరళలో 2023లో ఏకంగా 30,697, 2024లో 24,517 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి. గత నాలుగేళ్లలో 87,101 కేసులు నమోదయ్యాయి. వీటిలో 93,599 మందిని అరెస్టు చేశారు. అంతకుముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవగా 41,378 మందిని అరెస్టు చేసినట్టు సీఎం విజయన్ అసెంబ్లీలో చెప్పారు. గత జనవరిలో 2,000 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయి.క్యాండీలు, ఐస్క్రీంల రూపంలో... సింథటిక్ డ్రగ్స్ వాడేవారిలో సమాజంలోని అన్నివర్గాల వారూ ఉన్నారు. విద్యార్థుల నుంచి వైద్యుల దాకా వాటికి బానిసలవుతున్నారు. ఎవరూ గుర్తు పట్టకుండా చాక్లెట్ల నుంచి ఐస్క్రీంల దాకా నానారకాలుగా వీటిని విక్రయిస్తున్నారు. పైగా వీటికి విద్యాసంస్థలే అడ్డాలుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దాంతో తల్లిదండ్రులు భయంతో వణికిపోతున్నారు. తమ పిల్లలు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారేమో తేల్చుకోవడానికి టెస్ట్ కిట్లు కొనుగోలు చేస్తున్నారు. దాంతో వాటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి.సూపర్‌బైక్‌లపై డెలివరీ... స్మార్ట్ ఫోన్లో, వాట్సాప్ గ్రూప్‌లోనూ మెసేజ్ చేస్తే పావుగంటలోపే సూపర్ బైక్‌లపై వచ్చి మరీ డ్రగ్స్ డెలివరీ చేసే స్థాయికి కేరళ ఎదిగిందని అసెంబ్లీలో విపక్ష నేత ఇటీవలే ఎద్దేవా చేశారు. పెడ్లర్లు డ్రగ్స్ సరఫరాకు తప్పుడు/నకిలీ నంబర్ ప్లేట్లున్న సూపర్‌బైక్‌లను వాడుతున్నారు. పోలీసులకు చిక్కకుండా వాటిపై మెరుపు వేగంతో దూసుకెళ్తున్నారు. తోటి పెడ్లర్ల పోటీని తట్టుకునేందుకు, వేగంగా సరకు డెలివరీకి రాత్రిళ్లు ఈ బైక్‌లను వాడుతున్నట్టు ఎక్సయిజ్, పోలీసు విభాగాలు చెబుతున్నాయి. డ్రగ్స్ ముఠాలు 18–24 ఏళ్ల వారినే డెలీవరీకి ఎంచుకుంటున్నారు. ఒక ప్యాకెట్‌కు రూ.1,000, రోజంతా డెలీవరీ చేస్తే రూ.4,000 ఇస్తున్నారు. ఫ్యామిలీ అని భ్రమింపజేసేలా బైక్ వెనక మహిళను కూర్చోబెట్టుకుంటున్నారు. టీనేజర్లనే డ్రగ్స్ పెడ్లర్లుగా ఈ ముఠాలు వాడుకుంటున్నాయి. పోకిరీలతో పరిచయాలు కాకుండా తల్లిదండ్రులే తమ పిల్లలపై కన్నేసి ఉంచాలి– రిటైర్డ్ ఎస్పీ కేజీ సిమాన్ కేరళలో పదేళ్ల విద్యార్థులు కూడా గ్యాంగ్ ఫైట్లకు దిగుతున్నారు. కనీసం 10 నుంచి 15 క్రిమినల్ కేసులున్న విద్యార్థి నాయకులను ఆదర్శంగా తీసుకుంటున్నారు– కేరళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‘‘అత్యధిక అక్షరాస్యతా రేటు, ఉన్నత విద్యార్హతలున్నా ఉపాధి లేక కేరళలో యువత నైరాశ్యంతో డ్రగ్స్ బారిన పడుతోంది’’ – ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆసియా–పసిఫిక్ రీజియన్ మాజీ సలహాదారు జి.ప్రమోద్‌కుమార్– సాక్షి, నేషనల్ డెస్క్ -
డెడ్ డ్రాప్ పంథాలో సింథటిక్ డ్రగ్స్ దందా!
సాక్షి, సిటీబ్యూరో: సోషల్‌మీడియా ద్వారా సంప్రదింపులు... యూపీఐ యాప్స్ ద్వారా నగదు చెల్లింపులు.. డెడ్ డ్రాప్ విధానంలో సరుకు డెలివరీ... బెంగళూరు కేంద్రంగా ఈ పంథాలో వ్యవస్థీకృతంగా సాగుతున్న డ్రగ్స్ దందాకు హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులు చెక్ చెప్పారు. రెండు ముఠాలకు చెందిన ఐదుగురిని పట్టుకున్నామని, నలుగురిని అరెస్టు చేసి, మరొకరిని అతడి దేశానికి డిపోర్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని కొత్వాల్ సీవీ ఆనంద్ తెలిపారు. టాస్‌్కఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుదీంద్రతో కలిసి శుక్రవారం బంజారాహిల్స్‌లోని టీజీ సీసీసీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. బెంగళూరు నుంచి నగరంలో ‘వ్యాపారం’... నైజీరియాకు చెందిన యాకూబ్ అలియాస్ కుర్బా కొన్నేళ్ల క్రితం స్టడీ వీసాపై నగరానికి వచ్చాడు. సైనిక్‌పురి, టోలిచౌకీ ప్రాంతాల్లో ఉంటూ డ్రగ్స్ దందా చేస్తూ పోలీసులకు మూడుసార్లు చిక్కాడు. ఇతడిపై కుషాయిగూడ, ఫలక్‌నుమ, రాజేంద్రనగర్ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. ఇక్కడ పోలీసు నిఘా తప్పించుకోవడానికి తన మకాం బెంగళూరుకు మార్చాడు. అక్కడి నుంచే డ్రగ్స్ దందా చేస్తున్నాడు. 2016లో స్టూడెంట్ వీసాపై సూడాన్ నుంచి వచి్చన అబ్దుల్ రెహా్మన్ ఉస్మాన్ ఇంగ్లిష్ కోర్సు చేసి తిరిగి వెళ్లాడు. 2018లో నాలుగేళ్ల వీసాపై వచ్చి ఉత్తరప్రదేశ్‌లో బీసీఏ కోర్సులో చేరి... కరోనా సమయంలో స్వదేశానికి వెళ్లాడు. రెండేళ్ల తర్వాత మళ్లీ వచి్చన అతను కోర్సు పూర్తి చేసి సిటీకి వచ్చాడు. టోలిచౌకి ఉంటూ జల్సాల కోసం తేలిగ్గా డబ్బు సంపాదించే మార్గాలు అన్వేషించాడు. ఆ ఐదుగురికీ డెలివరీ బాయ్‌గా... ఇతడికి బెంగళూరులో స్థిరపడిన యాకూబ్‌తో పాటు నైజీరియా, టాంజానియా నుంచి వచ్చి అక్కడ ఉంటున్న రోమియో, గడాఫీ, జాన్‌పాల్, కేరళ వాసి జాకబ్‌లతో ఆన్లైన్లో పరిచయమైంది. వీరు ఐదుగురూ హైదరాబాద్‌లో ఉన్న డ్రగ్ వినియోగదారులతో సోషల్‌మీడియా యాప్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతారు. బేరం కుదిరిన తర్వాత ఆ మొత్తాన్ని కస్టమర్ యూపీఐ ద్వారా చెల్లిస్తారు. ఇందుకు అవసరమైన బ్యాంకు ఖాతాలు కూడా డమ్మీ వ్యక్తులవే అయి ఉంటున్నాయి. ఆపై వారు ఇక్కడకు రావడం ద్వారా లేదా ఉస్మాన్‌ను బెంగళూరు పిలిపించడం ద్వారా సరుకు నగరానికి చేరుతుంది. ప్రధానంగా రోడ్డు మార్గంలోనే మాదకద్రవ్యాలను నగరానికి తీసుకు వస్తున్నారు. కస్టమర్, డెలివరీ బాయ్ నగరంలోనే ఉన్నప్పటికీ వీరి మధ్య ఎలాంటి సంబంధం ఉండదు. సీఓడీ విధానంలోనూ మరో ముఠా..బెంగళూరు కేంద్రంగానే పని చేస్తున్న మరో ముఠా డెడ్ డ్రాప్‌తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) విధానంలో డ్రగ్స్ సరఫరా చేస్తోంది. బంజారాహిల్స్‌కు చెందిన మహ్మద్ ఇమ్రాన్ ఫ్లవర్ డెకరేషన్ చేస్తూ డ్రగ్స్‌కు బానిసయ్యాడు. కుటుంబీకులు ఓ రీహాబ్ సెంటర్లో చేర్చినా ఫలితం దక్కలేదు. ప్రైవేట్ కారు డ్రైవర్‌గా పని చేస్తూ డ్రగ్స్ దందాలోకి దిగిన అతను ఈ ఏడాది ఫిబ్రవరిలో నాంపల్లి పోలీసులకు చిక్కాడు. జైలు నుంచి వచి్చన తర్వాత టోలిచౌకీలో కుటుంబానికి దూరంగా నివసిస్తున్నాడు. బెంగళూరుకు చెందిన చుక్వా ఒబైయ్ డెడ్ డ్రాప్ ద్వారా కేరళ నుంచి వచ్చి బెంగళూరులో ఉంటున్న నందకుమార్‌ను డ్రగ్స్ అందిస్తాడు. ఇవి ఇతడి నుంచి చందానగర్‌కు చెందిన నవీన్‌కు చేరుతున్నాయి. అతడి నుంచి లేదా ఒక్కోసారి నేరుగా బెంగళూరు వెళ్లడం ద్వారా ఇమ్రాన్ ఈ సరుకు తీసుకువస్తున్నాడు. ఆపై డెడ్ డ్రాప్ లేదా సీఓడీ విధానంలో కస్టమర్లకు అందిస్తున్నాడు. నలుగురి అరెస్టు.. ఈ రెండు గ్యాంగ్‌లపై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్స్పెక్టర్లు కె.శ్రీనివాస్, జీఎస్ డానియేల్, ఎస్సై సి.వెంకట రాములు తమ బృందాలతో రంగంలోకి దిగారు. దాదాపు నెల రోజులు నిఘా ఉంచి ఉస్మాన్, యాకూబ్, నందకుమార్, మహ్మద్ ఇమ్రాన్, నవీన్‌లను పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షల విలువైన ఎండీఎంఏ, ఎల్ఎస్డీ బోల్డ్స్తో పాటు సెల్ఫోన్లు స్వా«దీనం చేసుకున్నారు. మిగిలిన నలుగురినీ అరెస్టు చేసిన పోలీసులు యాకూబ్‌ను అతడి దేశానికి డిపోర్టేషన్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వీరి నుంచి స్వా«దీనం చేసుకున్న సెల్ఫోన్ల ద్వారా ఈ నెట్‌వర్క్‌లోని ప్రధాన సూత్రధారులు, తెలుగు రాష్ట్రాల్లోని వినియోగదారుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కస్టమర్ల పాత్రను బట్టి రీహాబ్కు తరలించడం లేదా అరెస్టు చేయడంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఫొటో, లోకేషన్ షేర్ చేయడం ద్వారా... ఈ డ్రగ్‌ను డెలివరీ బాయ్ ఉస్మాన్ డెడ్ డ్రాప్ విధానంలో కస్టమర్‌కు చేరుస్తాడు. బహిరంగ ప్రదేశంలో ఎవరికీ అనుమానం రాని ప్రాంతంలో డ్రగ్ ప్యాకెట్‌ను ఉంచుతాడు. ఎండ, వానల వల్ల ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్యాక్ చేస్తాడు. దీని ఫొటో, లోకేషన్‌ను వాట్సాప్ ద్వారా బెంగళూరులోని సప్లయర్‌కు పంపిస్తాడు. అతడు ఇదే సమాచారం కస్టమర్‌కు షేర్ చేస్తాడు. వీటి ఆధారంగా ఆ ప్రాంతానికి వెళ్లే కస్టమర్ ఆ సరుకు తీసుకుంటాడు. దీనినే డెడ్ డ్రాప్ విధానం అని పిలుస్తుంటారు. డెడ్ డ్రాప్ చేయడానికి డెలివరీ బాయ్ ఎక్కువగా ట్రాన్స్ఫార్మర్లు, పాన్ డబ్బాలు, మెట్రో పిల్లర్లు తదితరాలను ఎంచుకుంటున్నారు. పెడ్లర్స్, సప్లయర్స్ ఇలా తాము సంపాదించిన మొత్తంలో 30 నుంచి 40 శాతం డెలివరీ బాయ్‌కు చెల్లిస్తారు. -
విశాఖ నుంచి కేరళకు గంజాయి
తిరువనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణం నుంచి కేరళకు తీసుకువచ్చిన 155 కిలోల గంజాయిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. విశాఖ నుంచి తీసుకువచి్చన గంజాయిని తిరువనంతపురంలోని పల్లితురలోని ఓ గోదాములోకి మార్చుతుండగా అధికారులు నలుగురిని అరెస్ట్ చేశారు. గంజాయితోపాటు 61 గ్రాముల ఎండీఎంఏ అనే సింథటిక్ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తిరువనంతపురం నుంచి విశాఖకు వెళ్లిన నలుగురిలో ఇద్దరు విమానంలో తిరిగి రాగా మిగిలిన ఇద్దరు వాహనంలో డ్రగ్స్‌ను తీసుకువచ్చారని అధికారులు తెలిపారు. -
ఇంట్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ
బనశంకరి: బెంగళూరులో ఇంట్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన నైజీరియన్‌ని సీసీబీ పోలీసులు అరెస్టు చేసి రూ.2 కోట్ల విలువచేసే 4 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్ (సింథటిక్ డ్రగ్స్), డ్రగ్స్ తయారీకి వాడే రసాయనాలను సీజ్ చేశారు. నిందితుడు డేవిడ్ జోమలవే అని పోలీసులు తెలిపారు. 2018లో డేవిడ్ భారత్‌కు చేరుకుని సోదరునితో కలిసి డ్రగ్స్ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బెంగళూరులోని ఎల్రక్టానిక్ సిటీ వద్ద గల చాముండీలేఔట్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఒక ఫ్యాక్ట రీలో పనిచేస్తున్నట్లు ఇంటి యజమానికి చెప్పేవా డు. ఆ తరువాత డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ముడి రసాయనాలు, అలాగే ఉపకరణాలను ఆన్లైన్లో కొనుగోలు చేసి ఇంట్లోనే ఉత్పత్తిని ప్రారంభించాడు. ఎండీఎంఏ (ఎక్స్టసీ) డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు పంపుతూ భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీస్‌కమిషనర్ కమల్‌పంత్ తెలిపారు. బూట్ల కింద దాచి స్మగ్లింగ్ బూట్ల కింది భాగంలో ఎండీఎంఏ క్రిస్టల్స్‌ను దాచిపెట్టి కొరియర్ ద్వారా న్యూజిల్యాండ్, ఆ్రస్టేలియాలతో పాటు వివిద దేశాలకు సరఫరా చేసేవాడు. కస్టమర్లు ఇచి్చన డబ్బును ఢిల్లీలో ఉన్న తన సోదరుని బ్యాంక్ అకౌంట్లో జమచేయించుకునే వాడని పోలీసులు తెలిపారు. ఇతడు నైజీరియన్ కాగా, ఉగాండా, మొజాంబిక్ దేశాల పాస్‌పోర్టును కలిగి ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఆ బొమ్మల్లో భయంకరమైన డ్రగ్
అవి చూడ్డానికి బొమ్మలు, డిజైన్లతో ఉన్న చిన్న సైజు పేపర్లు.. కానీ ఆ బొమ్మల్లో భయంకరమైన సింథటిక్ డ్రగ్ ఎల్ఎస్డీ దాగుంది. వీటిని నయాసాల్ వేడుకల్లో విక్రయించేందుకు పొరుగు రాష్ట్రాల ముఠాలు, స్థానిక డ్రగ్ పెడ్లర్లు సిటీపై కన్నేశారు. తమ రెగ్యులర్ క్లయింట్స్‌తో సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు జరపడంతో పాటు డ్రగ్ అందుబాటుపై సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో వీటి విక్రయం పెరిగే అవకాశం ఉందనే సమాచారంతో నగర పోలీసు విభాగం నిఘా ముమ్మరం చేసింది. సాక్షి, సిటీబ్యూరో: అక్కడ న్యూ ఇయర్ పార్టీ జోరుగా సాగుతోంది... పాల్గొన్న యువత చిట్‌చాట్ చేస్తూ వివిధ రకాలైన డిజైన్లు, బొమ్మలతో ఉన్న చిన్న సైజు పేపర్లను చేత్తోకున్నారు. అప్పడప్పుడు ఆ కాగితాలను చిన్న ముక్కగా చేసి యాదృచ్ఛికంగా అన్నట్లు నాలికపై పెట్టుకుని చప్పరిస్తున్నారు... ఈ ఉదంతాన్ని ఎవరు చూసినా అనుమానించాల్సిన అవసరం లేదనే భావిస్తారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే... ఆ బొమ్మల్లో భయంకరమైన సింథటిక్ డ్రగ్ ఎల్ఎస్డీ దాగుంటుందని. ఈ మాదకద్రవ్యం కలిగి ఉన్న ఆరోపణలపై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం ఇరువురిని అరెస్టు చేశారు. ‘డిసెంబర్ 31’ సమీపిస్తుండటంతో పొరుగు రాష్ట్రాలకు చెందిన ముఠాలు, స్థానిక డ్రగ్ పెడ్లర్లు ఈ సింథటిక్ డ్రగ్‌ను విక్రయించే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ‘బోల్ట్స్’ తయారీ ఈజీ కావడంతో.. గత కొన్నేళ్లుగా నగర పోలీసులు అనేక డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నాయి. వీరి నుంచి బ్రౌన్‌షుగర్, కొకైన్, ఎక్ట్ససీ, ఖత్ వంటి మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి డ్రగ్స్‌ను నగరానికి తరలించడం, విక్రయించడంలో కీలకపాత్ర పోషిస్తున్న (పెడ్లర్స్) సౌతాఫ్రికా జాతీయులతో పాటు కొన్ని పబ్స్‌లో పని చేసే స్థానికుల పైనా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. దీంతో విక్రేతలు, వినియోగదారుల కన్ను బోల్ట్స్గా పిలిచే ఎల్ఎస్డీ స్టాంపులపై పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లినర్జిక్ యాసిడ్ డై థైలామెడ్ (ఎల్ఎస్డీ) మాదకద్రవ్యం వాస్తవానికి ఘనరూపంలో కనిపించే ద్రావణం. కొన్ని ప్రత్యేక పద్దతుల్లో దీనిని బ్లాటింగ్ పేపర్‌పై పూతలా ఏర్పాటు చేస్తారు. ఇలా పూత ఏర్పాటుకు ముందు ఆ కాగితంపై ఓ డిజైన్ రూపొందిస్తారు. కంప్యూటర్ సహాయంతో అలాంటి డిజైన్ ఉన్న కాగితాలను ఒకే సైజులో పెద్ద సంఖ్యలో తయారు చేస్తారు. ఈ కాగితాలపై ఎల్ఎస్డీ పూసే విధానం పూత రేకుల తయారీని పోలి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ కాగితాన్ని పరీక్షగా పరిశీలిస్తే మాత్రమే దానిపై ఎల్ఎస్డీ పూత ఉందనే విషయాన్ని గుర్తించగలం. సయమం, డిమాండ్‌ను బట్టి ఒక్కో గ్రాము ఎల్ఎస్డీ రూ.1500 నుంచి రూ.2500 వరకు పలుకుతోందని సమాచారం. ప్రధానంగా అక్కడే తయారీ... ఎల్ఎస్డీ మాదకద్రవ్యం ఎక్కువగా నెదర్లాండ్స్‌లో తయారవుతోంది. భారత్‌కు సంబంధించి గోవాతో పాటు ఉత్తరాదిలో ఉన్న కొన్ని నగరాల్లో దీని ‘యూనిట్లు’ ఉన్నాయని అధికారులు అనుమానిస్తున్నారు. గురువారం చిక్కిన ‘డ్రగ్స్ ద్వయం’ ఎల్ఎస్డీని గోవాతో పాటు కోడైకెనాల్‌లో ఖరీదు చేసినట్లు వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. వీటిని పోస్ట్, కొరియర్, ప్రైవేట్ ట్రావెల్స్, వ్యక్తుల ద్వారా నగరానికి పంపుతున్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారిస్తున్నారు. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో వ్యాపారమే లాభసాటిగా ఉండటంతో ఆయా ముఠాలు ఇక్కడే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తున్నాయని సమాచారం. ఈ డ్రగ్‌ను తీసుకోవడం కూడా చాలా తేలికకావడం పెడ్లర్స్‌కు కలిసి వస్తున్న అంశం. పెడ్లర్స్ బ్లాటింగ్ కాగితాలపై ఎల్ఎస్డీని తీసుకువచ్చి ఒక్కో కాగితం లేదా గ్రాము చొప్పున విక్రయిస్తున్నారని తెలిసింది. ఈ విక్రయాలపై పోలీసులకు పెద్దగా సమాచారం, అనుమానం లేకపోవడంతో ఉత్తరాదికి చెందిన అనేక మంది పథకం ప్రకారం బెంగళూరు మీదుగా నగరానికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సిటీలోని పెడ్లర్స్ వీటిని పబ్స్‌తో పాటు అనేక ప్రాంతా ల్లో విక్రయిస్తున్నారు. బ్లాటింగ్ పేపర్లో నుం చి ఓ ముక్కను చింపుకుని నేరుగా నాలికపై పెట్టుకుంటూ వాడుతున్నారని తెలుస్తోంది. ‘సోషల్’ సంప్రదింపులు, సమాచారం... నగరంలోని కొందరు పెడ్లర్స్ తమ రెగ్యులర్ క్లైంట్స్తో సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు జరపడంతో పాటు డ్రగ్ అందుబాటుపై సమాచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. తమ ‘వినియోగదారుల’తో ఆయా సోషల్ మీడియాల్లో ప్రత్యేక గ్రూప్‌లు ఏర్పాటు చేస్తూ సంప్రదింపులు జరుపుతున్న విక్రేతలు శని, ఆదివారాల్లో కొన్ని పబ్బులు, హోటళ్ళ కేంద్రంగా భారీ విక్రయాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. పెడ్లర్లు పదుల సంఖ్యలో ఈ పేపర్లు పట్టుకు వచ్చినా, కొరియర్, పోస్టు ద్వారా పంపినా ఎవరికీ అనుమానం రాదు. ఆయా పార్శిళ్ళను స్కానింగ్ చేసినప్పటికీ డ్రగ్ పూతను కనిపెట్టడం సాధ్యం కాకపోవడం వీరికి కలిసి వస్తోంది. న్యూ ఇయర్ పార్టీల నేపథ్యంలో సిటీలో ఎల్ఎస్డీ విక్రయం పెరిగే అవకాశం ఉందనే సమాచారంతో నగర పోలీసు విభాగం నిఘా ముమ్మరం చేసింది. -
డయాబెటీస్ మధువేదం
ఎవరు చెప్పారు? డయాబెటీస్ షుగరు వ్యాధి ఇక జీవితాంతం సమస్య అని. ఇప్పుడు స్టార్ ఆయుర్వేద మీ కొరకు తీసుకొని వచ్చింది ప్రపంచ ప్రామాణికమైన అత్యున్నత సౌకర్యాలు కలిగిన వైద్య చికిత్సా విధానం. దీనితో మీ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ రోజు భారతదేశంలో ప్రతి 100 మందిలో 14 మంది డయాబెటీస్ బారిన పడుతున్నారు. ఈ వ్యాధి లక్షణాలు 1. విపరీతమైన దాహం 2. అధిక మూత్రవిసర్జన 3. ఆకలి ఎక్కువగా ఉండటం, ఎంత ఆహారం తీసుకున్నా శక్తి లేకపోవడం, బలహీనంగా ఉండటం 4. బరువు తగ్గడం, నీరసం, నిస్సత్తువ 5. చూపు మందగించుట, మబ్బుగా, మసకగా కనిపించడం 6. ఎక్కువ అలసట, కాళ్లు లాగడం 7. ఏదైనా దెబ్బలు (గాయాలు) తగిలితే త్వరగా తగ్గకపోవడం 8. కొన్ని సంవత్సరాల తర్వాత శరీరంలో పెద్ద రక్తనాళాలు దెబ్బతినటం వల్ల గుండె, మెదడు, కాళ్లు, చేతులలోని రక్త నాళాలు దెబ్బతినడం 9. చిన్న రక్తనాళాలు దెబ్బ తిన్నందువల్ల కంటిలోని రెటీనా దెబ్బతినటం 10. నరాల బలహీనత, కళ్లు మంటలు 11. మానసిక, సెక్స్ సమస్యలు నిత్యం వాడే షుగరు వ్యాధి నిరోధక పాశ్చాత్య రసాయనాలు చర్మ ం మీద మచ్చలు, తలనొప్పి, జీర్ణ సంబంధిత మరియు అవాంచిత ప్రక్రియలు కలగడం. ఆయుర్వేదం ఎంత ప్రాభవమైనదో, అంత శాశ్వతమైనది. ఇప్పుడు స్టార్ ఆయుర్వేద సరికొత్త ఫార్ములాతో మీ ముందుకు వచ్చింది. ప్రకృతిలో ఉన్న వనమూలికల నుంచి 36 సంవత్సరాల అనుభవంతో లక్షలమంది పేషెంట్లకు ఉపశమనం కలిగించిన మందులు ఇప్పుడు మీ అందుబాటులోకి వచ్చాయి. మీరు ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నారు. ఇది అనువంశికమా లేదా మానసిక ఒత్తిడి వల్ల వచ్చిందా? రోగలక్షణాలకు మీ వ్యాధి తీవ్రతకు మా నిపుణులైన డాక్టర్లు అమూలాగ్రం పరిశీలించి, మందులు ఇస్తారు. ఈ మందులు మొదలు పెట్టాక వాటిని మెల్లమెల్లగా పాశ్చాత్య రసాయనిక మందులు తగ్గించబడతాయి. ఈ అత్యాధునిక ఫార్ములాతో కూడిన మందుల వల్ల మీకు సరికొత్త జీవితం ఖాయం. డయాబెటీస్‌ను వ్యాధిగా భావించకండి. ఎందుకు అంటే అది కేవలం మీరు చేయవలసిన జీవిత విధానాల మార్పులను సూచిస్తుంది. మీ జీవితంలో మార్పును తీసుకువచ్చి దానిని కంట్రోలులో ఉంచడమే కాదు. ప్రీ-డయాబెటిక్ ట్రీట్మెంట్ (Pre-Diabetes Treatment) తో పూర్తిగా తగ్గించవచ్చు. ఉదాహరణకు అత్యాధునిక స్టార్ ఆయుర్వేద మందులతోపాటు, పీచు పదార్థాలు అధికంగా తీసుకొనుట, ఉప్పు, చక్కెర సంబంధిత పదార్థాలు తగ్గించటం, మితమైన పౌష్టిక ఆహారం, వ్యాయామం చేయటం ద్వారా డయాబెటీస్‌ను శాశ్వతంగా పరిష్కరించవచ్చు. సంప్రదాయ, అత్యాధునిక టెక్నాలజీ, అత్యాధునిక మందులు 36 సంవత్సరాల అనుభవం కలిగిన ఆయుర్వేద డాక్టర్లు ఇప్పుడు స్టార్ ఆయుర్వేదలో మీకు అందుబాటులో ఉన్నారు. డయాబెటిస్‌ను మీరు సరైన శ్రద్ధతో కంట్రోలులో ఉంచుకోకపోతే మెల్లిమెల్లిగా అది మీ శరీరాన్ని కబళిస్తుంది. అందుకే ఇప్పటికైనా త్వరపడండి. డయాబెటీస్ గురించి బాధపడకండి. 5000 సంవత్సరాల ఆయుర్వేద వైద్యవిధానం ఇప్పుడు స్టార్ ఆయుర్వేదలో అత్యాధునిక టెక్నాలజీ రూపంలో మీ సేవకై వచ్చింది మా స్టార్ ఆయుర్వేద. డాక్టర్ దీప్తి ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ, వైజాగ్ ph: 99599 114 66 / 99089 111 99 www.starayurveda.com