breaking news
swamy swaroopananda
-
చాతుర్మాస్య దీక్ష చేపట్టనున్న స్వామి స్వరుపానంద
సాక్షి, విశాఖపట్నం : స్వామి స్వరుపానంద చాతుర్మాస్య దీక్ష కోసం పవిత్ర పుణ్యక్షేత్రం రిషికేష్‌కు వెళ్లనున్నారు. అక్కడ 2 నెలల 20 రోజులపాటు దీక్ష చేపట్టనున్నారు. ఈ సందర్బంగా ఆయన బుధవారం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. అనంతరం ఆయన స్వామి స్వరూపానంద మాట్లాడుతూ.. దీక్ష నిమిత్తం రిషికేశ్ బయల్దేరి వెళుతున్నట్లు చెప్పారు. కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రిలలో 15 రోజులపాటు తపస్సు చేస్తారు. అనంతరం రిషికేష్‌లో శారదా పీఠానికి చేరుకొని ఈ నెల 16 నుంచి సెప్టెంబర్ 14 వరకు చాతుర్మాస్య దీక్ష చేయనున్నారు. ఈ దీక్షకాలంలో భక్తులెవరు తన వద్దకు రావద్దని, సెప్టెంబర్ 20 తర్వాతే భక్తులకు అనుమతి ఇవ్వాలని తెలిపారు. అంతేకాక పుష్కరాల పేరుతో గత ప్రభుత్వం సీజీఎఫ్ ఫండ్‌ను దుర్వినియోగం చేసిందని ఆరోపించారు. దీనిపై అధికారులు వెంటనే విచారణ చేపట్టి భక్తులకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా ఉత్తర పీఠాధిపతి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి కేదార్, గంగోత్రి, యమునోత్రి లో 15 రోజుల పాటు తపస్సు అనంతరం రిషికేశ్ లోని శారదా పీఠానికి చేరుకుంటారు. -
రామాలయ నిర్మాణానికి 21న శ్రీకారం: స్వరూపానంద
అలహాబాద్: అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వచ్చే నెల 21న శ్రీకారం చుడతామని ఆధ్యాత్మిక నాయకుడు స్వామి స్వరూపానంద సరస్వతి బుధవారం చెప్పారు. బుల్లెట్లను ఎదుర్కోడానికైనా సరే తాము సిద్ధమేనన్నారు. మూడు రోజుల కుంభమేళా ముగింపు సందర్భంగా ఈ నిర్ణయాన్ని అలహాబాద్ (ప్రయాగ్ రాజ్)లో స్వరూపానంద ప్రకటించారు. అయోధ్యలో గతంలో సేకరించిన, వివాదరహిత భూమి ని తిరిగి వాస్తవ యజమానులకు అప్పగిం చేందుకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్ వేసిన మరుసటి రోజే ఈ ప్రకటన రావడం గమనార్హం. అలహాబాద్‌లో ధర్మ సభ అనంతరం ద్వారాకా పీఠానికి చెందిన శంకరాచార్య ఓ ప్రకటన విడుదల చేస్తూ హిందువులంతా ఒక్కొక్కరు నాలుగు ఇటుకలు పట్టుకుని ఫిబ్రవరి 21న అయోధ్యకు రావాలని పిలుపునిచ్చారు. సాధువులంతా వసంతపంచమి రోజైన ఫిబ్రవరి 10న అలహాబాద్ నుంచి అయోధ్యకు తమ యాత్రను ప్రారంభిస్తారన్నారు. ప్రభుత్వం, సుప్రీంకోర్టు అంటే తమకు గౌరవం ఉందనీ, అయితే ఇప్పుడు తాము రామాలయ నిర్మాణం ప్రారంభించకపోతే ఇంకెప్పటికీ కుదరకపోవచ్చని పేర్కొన్నారు. -
మతానికి, ధర్మానికి తేడా గుర్తించండి: స్వరూపానంద
మతానికి, ధర్మానికి మధ్య గల తేడాను గుర్తించాలని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ప్రజలకు చెప్పారు. 'మాండూక్య అద్వైత స్వరూపం వేదాంత గ్రంథరాజం' పుస్తకాన్ని ఆయన చందానగర్‌లోని వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆవిష్కరించారు. ధర్మం మతం కంటే పెద్దదని, ఈ పుస్తకం ఆ విషయాన్నే వివరిస్తుందని ఆయన తెలిపారు. ''మాండూక్య అద్వైతం ధర్మం గురించి మాత్రమే చెబుతుంది. ధర్మసూక్ష్మాలను ఈ పుస్తకం ద్వారా ప్రజలకు వివరించి, వాళ్లకు విశదపరిచేందుకు చేసిన ప్రయత్నం సఫలీకృతం అవుతుందనే భావిస్తున్నాను. దైవిక జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనుకునే వాళ్లకు ఇది ఉపయోగపడుతుంది'' అని స్వామి చెప్పారు. ఈ పుస్తకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం ఈ పుస్తకరాజాన్ని ఆవిష్కరించారు. స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి వివిధ సందర్భాల్లో తన శిష్యులకు చేసిన ప్రబోధాలతో ఈ మహాగ్రంథాన్ని రూపొందించారు. ఈ గ్రంథానికి తుదిరూపు ఇచ్చేందుకు రెండున్నరేళ్ల సమయం పట్టింది. ఈ గ్రంథాన్ని చాగంటి ప్రకాశరావు కూర్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న మతమార్పిడులపై ఈ సందర్భంగా స్వామి స్వరూపానంద ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ ధర్మాన్ని అనుసరించడం ద్వారా ఈ మతమార్పిడులను అత్యవసరంగా ఆపాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమానత్వం, సత్యం గురించి మాట్లాడే సనాతనధర్మాన్ని వ్యాప్తి చేయాలన్నదే తమ లక్ష్యమన్నారు. జగద్గురు శంకరాచార్య బోధించిన పది ఉపనిషత్తుల్లో అత్యంత ప్రముఖమైనది ఈ మాండూక్యోపనిషత్తు అని స్వరూపానంద తెలిపారు. ఉపనిషత్తులు, వేదాలు కేవలం కొంతమందికి మాత్రమే పరిమితమని కొందరు అనుకుంటారు గానీ అది తప్పని చెప్పారు. అన్ని మతాలు, అన్ని కులాలకు చెందినవారు తప్పనిసరిగా ఈ మహాగ్రంథాన్ని చదివి, అర్థం చేసుకోవాలని.. ఇది దైవిక ఆలోచనలకు మార్గం చూపుతుందని అన్నారు. ఎవరైనా ముక్తి కావాలనుకుంటే.. ఈ మహాగ్రంథాన్ని చదివితే సరిపోతుందన్నారు. సనాతన ధర్మాన్ని ఒక్కతాటి మీదకు తేవడంలో స్వామి స్వరూపానంద సేవలను తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ప్రస్తుతించారు. మాండూక్య అద్వైతోపనిషత్తు సారాన్ని పైకి తేవడంలో స్వామి చేసిన ప్రయత్నాలను పలువురు వేద పండితులు తన దృష్టికి తెచ్చారన్నారు. తాను టీటీడీ ఈవోగా ఉన్న సమయంలో స్వామి సూచనలను ఎలా అమలుచేసినదీ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గుర్తుచేసుకున్నారు. వేదాలు ధర్మసారాన్ని వివరిస్తాయి కాబట్టి వాటిని అనుసరించాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లం చెప్పారు. ఈ వేదికపై ఆంధ్రా వేదపండితుడు సుబ్రహ్మణ్య దీక్షితులు, కర్ణాటక వేదపండితుడు అశ్వత్థనారాయణ అవధాని, అఖిలభారత బ్రాహ్మణ సమాఖ్య అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్‌లను స్వామి సన్మానించారు.