breaking news
svc
-
గేమ్ ఛేంజర్‌తో భారీ నష్టాలు.. 'చరణ్' కనీసం ఫోన్ కూడా చేయలేదు: నిర్మాత
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంలో నటించాలని చాలామంది నటీనటులకు కోరిక ఉంటుంది. ఆ సంస్థకు అంత గుర్తింపు రావడంలో నిర్మాత దిల్ రాజు పాత్ర చాలా కీలకం. అయితే, తెరవెనుక ఆయన సోదరుడు శిరీష్ రెడ్డి శ్రమ వెలకట్టలేనిదని ఇండస్ట్రీలో చాలామంది చెబుతుంటారు. అయితే, వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అనేక విజయవంతమైన సినిమాలను నిర్మించిన వారిద్దరూ ఈ ఏడాదిలో రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్లో గేమ్ ఛేంజర్‌ను భారీ బడ్జెట్‌తో (రూ.450 కోట్లు) తెరకెక్కించారు. అయితే, ఈ మూవీ డిజాస్టర్ వల్ల ఎదురైన ఇబ్బందుల గురించి తాజాగా శిరీష్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు. గేమ్ ఛేంజర్ వల్ల వచ్చిన నష్టాలతో తమ బతుకు అయిపోయిందని అనుకున్నామని చెప్పారు. కానీ, 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో అంతా మారిపోయిందని ఆయన అన్నారు.గేమ్ ఛేంజర్ గురించి నిర్మాత శిరీష్ రెడ్డి ఇలా చెప్పారు.' గేమ్ ఛేంజర్ సినిమాతో మా బతుకు అయిపోయిందని అనుకున్నాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మళ్లీ నిలబడుతామని నమ్మకం వచ్చింది. ఇదంతా కూడా కేవలం 4రోజుల్లోనే జీవితం మారిపోయింది. ఆ సినిమా లేకుంటే మా పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోలేం. అప్పుడు అందరూ మా పని అయిపోయిందని హేళన చేసేవారు. గేమ్ ఛేంజర్ ప్లాప్ అయింది. హీరో వచ్చి మాకు ఏమైన సాయం చేశాడా..? దర్శకుడు వచ్చి ఏమైనా సాయం చేశాడా..? అంత నష్టం వచ్చినా కూడా వారు కనీసం ఒక్క ఫోన్ కాల్ చేసి ఎలా ఉన్నారు..? పరిస్థితి ఏంటి అని కూడా ఎవరూ అడగలేదు. చివరకు చరణ్ కూడా అడగలేదు. అలా అని నేను వారిని తప్పుపట్టడం లేదు. మాకు ఇష్టం ఉండి సినిమా తీశాం. డబ్బు పోగొట్టుకున్నాం. రెమ్యునరేషన్లో కొంత ఇవ్వాలని మేము ఎవరినీ అడగలేదు.. అంత స్థాయికి మా సంస్థ ఇంకా దిగజారిపోలేదు. అయితే, మమ్మల్ని నమ్మిన డిస్ట్రిబ్యూటర్స్ను మేము కాపాడుకున్నాం. అయితే, గేమ్ ఛేంజర్ పోయిందని రామ్ చరణ్‌తో ఎలాంటి విభేదాలు రాలేదు. మరో కథ వస్తే ఆయన వద్దకు వెళ్తాం. ఆయన సినిమా చేయవచ్చు లేదా చేయకపోవచ్చు. నిర్ణయం ఆయనదే కదా.. మేము ఎవరినీ బ్లేమ్ చేయడం లేదు. ఇష్టం ఉండి సినిమా తీశాం, పోగొట్టుకున్నాం. ఈ వ్యాపారంలో ఎవరినీ నిందించలేము. గేమ్ ఛేంజర్ వల్ల వచ్చిన నష్టం చెప్పుకుంటే బాగాదో. కానీ, చాలా మొత్తంలో నష్టపోయాం. అయితే, సంక్రాంతికి వస్తున్నాం సినిమా వల్ల బయటపడ్డాం. గేమ్ ఛేంజర్ నష్టాన్ని సుమారు 70 శాతం వరకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కవర్ చేసింది. దర్శకుడు అనిల్ రావిపూడి లేకుంటే ఈరోజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఉండేది కాదని చెబుతాను. మమ్మల్ని తిరిగి నిలబెట్టింది అనిల్ అని నేను నమ్ముతా.' అని శిరీష్ రెడ్డి అన్నారు. -
ఎస్వీసీ ఆఫీస్‌కు దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఎఫ్డీసీ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) ఇళ్లు, ఆఫీసులలో నాలుగోరోజు కూడా ఐటీ సోదాలు(Income Tax Officer) జరుగుతున్నాయి. తనిఖీల్లో భాగంగా ఇప్పటికే భారీగా పలు డాక్యుమెంట్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దిల్రాజును ఆయన నిర్మాణ సంస్థ శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌కు సంబంధించిన ఆఫీస్‌కు ఆదాయపన్ను శాఖ అధికారులు తీసుకెళ్లారు.దిల్ రాజు నివాసంలో ఐటీ సోదాలు దాదాపు ముగిశాయి. నాలుగు రోజుల పాటు కొనసాగిన ఈ సోదాలలో పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒక మహిళా అధికారి సమక్షంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. దిల్ రాజు నివాసం నుంచి వారు తాజాగా సాగర్ సొసైటీలోని తన ఎస్వీసీ కార్యాలయానికి వెళ్లారు. తమ వాహనంలోనే దిల్ రాజును వారు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఎస్వీసీ ఆఫీస్‌లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు దిల్ రాజు సోదరుడు శిరీశ్ నివాసంలో ఐటీ సోదాలు ముగిశాయి. వారు నిర్మించిన పలు సినిమాలకు సంబంధించి ఆర్థిక లావాదేవీలు, పన్ను చెల్లింపుల విషయంలో అవకతవకలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ రైడ్స్ గురించి అధికారులు ఇప్పటి వరకు ఎక్కడా ఎలాంటి విషయాలు ప్రకటించలేదు. -
నేడు, రేపు ‘ఇండియా ప్రాపర్టీ.కామ్’ ప్రాపర్టీ షో
సాక్షి, హైదరాబాద్: ఇండియా ప్రాపర్టీ డాట్ కామ్ ఆధ్వర్యంలో ‘గృహప్రవేశం’ పేరుతో శని, ఆదివారాల్లో ప్రాపర్టీ షో జరగనుంది. మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జరిగే ఈ ప్రదర్శనలో టాప్ 60 మంది బిల్డర్లు 200కు పైగా కొత్త ప్రాజెక్టులను ప్రదర్శిస్తారు. దాదాపు రూ. 50 కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా. అపర్ణా, ఎస్వీసీ, ఎన్సీసీ, సైబర్‌సిటీ, విశాల్ వంటి నిర్మాణ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలూ ఈ ప్రదర్శనలో పాల్గొంటాయి. క్రెడాయ్ జాతీయ అధ్యక్షుడు సి. శేఖర్ రెడ్డి, ఏపీ ప్రెసిడెంట్ రాం రెడ్డి, ఇండియా ప్రాపర్టీ.కామ్ సీఈఓ గణేష్ వాసుదేవన్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. గృహశోభ ఉట్టిపడాలంటే రోజూ గార్డెనింగ్‌కు సమయాన్ని కేటాయించాలి.మొకట్కలు ఎంపిక చేసుకొనే ముందు అవి పెరిగే ఎత్తు, పూల రంగు తదితర అంశాలను గుర్తించాలి. వాతావరణ పరిస్థితులను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. పూల మొక్కలు పొదల మాదిరిగా పెరిగే మొక్కలు, తీగలతో అల్లుకుపోయే మొక్కలు గార్డెన్లో పెంచుకోవచ్చు. ఏ మొక్కకు ఎంత నీరు పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. మొక్కలు నాటిన మొదటివారంలో రోజూ నీరు పెట్టాలి. రెండో వారం నుంచి రెండు రోజులకొకసారి నీరు పెట్టొచ్చు. అయితే ఇది అన్ని మొక్కలకు వర్తించదు. కొన్ని రకాల పూల మొక్కలకు ప్రతి రోజూ నీరు పెట్టాల్సి ఉంటుంది. ఏపుగా పెరిగిన చెట్లు ప్రహరీ గోడ చుట్టూ ఉంటే సూర్యరశ్మి తగినంత పడే అవకాశం ఉండదు. ఇంట్లోకి వెలుతురు బాగారావాలంటే ఇంటి చుట్టూ కాకుండా సూర్యర శ్మి పడే ప్రాంతాలను ఖాళీగా ఉండేలా చూసుకోవాలి. మొక్కలు కొనుగోలు చేసేటప్పుడు సూర్యరశ్మి అవసరమయ్యే మొక్కలు, నీడనిచ్చే మొక్కలను పెంచుకుంటే మంచిది. ఆహ్లాదమిచ్చే పూల మొక్కలతో పాటు కూరగాయల మొక్కలకూ కాస్త స్థలం కేటాయించుకుంటే మీ ఇల్లు పచ్చగా చూడముచ్చటగా ఉంటుంది.