breaking news
suyapeta
-
ఉమ్మడి జిల్లాలో గులాబీ జెండా ఎగురవేస్తాం
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ జెండా జయకేతనం ఎగురవేస్తుందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 500 మంది టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుపుఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్ఎస్ జెండా జయకేతనం ఎగురవేస్తోందని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని వివిధ పార్టీలకు చెందిన సుమారు 500 మంది టీఆర్ఎస్లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. 12 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాలు గెలుపుఖాయమన్నారు. ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని తేల్చిచెప్పారు. ప్రజలు మంచి చెడును గమనిస్తున్నారని, చెడును తుంగలో తొక్కడం ఖాయమన్నారు. సిండికేట్ వ్యాపారాలను ప్రోత్సహించిన వారికి గుణపాఠం తప్పదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందని హెచ్చరించారు. దొంగలు..దొంగలు.. కలిసి ఊర్లు తిరుగుతున్నారని, వాళ్లకు ప్రజా వ్యతిరేకత తప్పదన్నారు. గత ఎన్నికల్లో సిగ్గు లేకుండా తిట్టుకున్న వారే కలిసి తిరుగుతుంటే సూర్యాపేట ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలో రూ.2468 కోట్ల అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. రబీలో సాగర్ జలాలలతో రెండో పంటను అందుకున్న రైతులు ఆనందం పడుతుంటే సాగర్ ఎమ్మెల్యే జానారెడ్డి మాత్రం చివరి భూములకు నీళ్లు కావాలని కోరడం ఏంటని ప్రశ్నించారు. జానారెడ్డి చివరి భూముల్లో తిరుగుతుండడం చూస్తుంటే ఆయనతో పనిచేయించినట్లుగా తనకు ఆనందంగా ఉందన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో వార్డులు పర్యటిస్తున్న దామోదర్‌రెడ్డి గతంలో పర్యటించి అభివృద్ధి చేస్తే బాగుండేదన్నారు. ఇప్పటికైనా ఎన్ని వార్డులు తిరిగినా అవసరమైన పనులు చూపిస్తే అభివృద్ధి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నమన్నారు. కలెక్టరేట్ నిర్మాణం, ఎస్పీ కార్యాలయ నిర్మాణం, రోడ్ల వెడల్పు, కమ్యూనిటీ హాళ్లు, సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దేందుకు ’20కోట్లు ఖర్చు చేశామన్నారు. పుల్లారెడ్డి చెరుకు కోసం రూ.12 కోట్లు మంజూరయ్యాని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా మెడికల్ కళాశాల సూర్యాపేటకు మంజూరు చేయించిన ఘనత తమదేనన్నారు. అభివృద్ధికి మరోసారి ప్రజలు పట్టం కట్టనున్నారని చెప్పారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్, తాహేర్‌పాషా, బూరబాల సైదులు, మహేశ్వరి, రమణ, నర్సింహారావు, బాషా, శ్రీనివాస్, యాదగిరి పాల్గొన్నారు. -
అసౌకర్యాలకు నిలయం.. కొత్తబస్టాండ్
సూర్యాపేటటౌన్ : పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ అసౌకర్యాలకు నిలయంగా మారింది. మూత్రశాలల నుంచి వచ్చే దుర్వాసనతో ప్రయాణికులు, కార్మికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం వేలాది మంది ప్రయాణికులు బస్టాంyŠ కు వస్తున్నప్పటికీ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. బస్టాండ్ ఆవరణలో చెత్తాచెదారంతో దోమలు, ఈగలు విపరీతంగా ఉన్నాయి. పందులు బస్టాండ్ ఆవరణలోనే సంచరిస్తున్నాయి. ముఖ్యంగా బస్టాండ్‌లో ఉన్న మురుగు దొడ్లు దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో ప్రయాణికులు బస్టాండ్‌లో కూర్చునే పరిస్థితి లేదు. ప్రయాణికులు బస్సు కోసం కొద్ది సేపు వేచి చూడాల్సినప్పుడు మరుగుదొడ్ల దుర్వాసనతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరుగుదొడ్లు రోజు రోజు శుభ్రం చేయించకపోవడంతోనే ఇలా దుర్వాసన వస్తుందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. మరుగు దొడ్లు శుభ్రం చేయించడంలో అధికారులు పట్టించుకోవడం లేదు. కొద్దిపాటి వర్షం వస్తే చాలు బస్టాండ్ ఆవరణలో నీళ్లు నిలిచి పందులు, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. ప్రయాణికులకు మంచినీటి సౌకర్యం కూడా లేదు. దీంతో ప్రయాణికులు ఒక్క బాటిల్‌కు రూ. 20 నుంచి రూ. 30వరకు వెచ్చించి కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్టాండ్‌లో ఫ్యాన్లు లేకపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి నిత్యం వేలాది మంది ప్రయాణికులు వచ్చే ఈబస్టాండ్‌లో మరుగు దొడ్లు దుర్వాసన రాకుండా చేయాలని, మంచినీటి సౌకర్యంతో పాటు బస్టాండ్‌లో నెలకొన్న పలు సమస్యలు పరిష్కరించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దుర్వాసనతో ఉండలేకపోతున్నాం – పిట్టల జానయ్య, ప్రయాణికుడు మరుగుదొడ్ల దుర్వాసనతో బస్టాండ్‌లోకి వచ్చి నిలబడలేకపోతున్నాం. బస్సు కోసం కొద్ది సేపు చూడాలంటే దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నాం. మరుగు దొడ్లు రోజు రోజు శుభ్రం చేయించాలి. అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి. మంచినీటి సౌకర్యం కల్పించాలి – పి.లింగస్వామి, ప్రయాణికుడు బస్టాండ్‌లో మంచినీటి సౌకర్యం లేదు. దీంతో మంచినీటి బాటిల్‌ను రూ. 20 వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. అవి ఒక్కడికే సరిపోతున్నాయి. ముగ్గురు నలుగురు తాగాలంటే రూ. 100 వరకు వెచ్చించాల్సి వస్తుంది. ఆర్టీసీ అధికారులు స్పందించి మంచినీటి సౌకర్యం కల్పించాలి.