breaking news
surya prabha
-
స్టేజీ మీద భర్తను చితకబాదిన భార్య!
-
స్టేజీ మీద భర్తను చితకబాదిన భార్య!
సాధారణంగా ఎక్కడైనా భర్త తనను మోసం చేశాడంటూ అతడి భార్య ఆరోపిస్తూ భర్త ఇంటి ముందు గొడవ చేయడం, పోలీసులను ఆశ్రయించడం చూస్తుంటాం. కానీ ఇక్కడ మాత్రం కాస్త వెరైటీ ఘటన చోటుచేసుకుంది. స్టేజీపై పుస్తకావిష్కరణ జరుగుతుండగా భర్తను పట్టుకుని ఓ వివాహిత చితకబాదింది. నగరంలోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ఈ ఘటన జరిగింది. ఆ వివరాలిలా ఉన్నాయి... చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో మంగళవారం రాత్రి పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. అయితే ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. పుస్తకావిష్కరణ కార్యక్రమం జరుగుతుండగా, స్టేజీపైకి ఎక్కిన ఓ వివాహిత తన భర్తను అందరూ చూస్తుండగానే చితకబాదింది. ఆమెతో పాటు మరికొంత మంది వ్యక్తులు వేదిక మీద ఆ వ్యక్తి మీద దాడి చేశారు. వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించారు. తన పేరు సూర్యప్రభ అని ఆ వివాహిత పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.