breaking news
suprabhatha rao
-
త్వరలోనే జిల్లాలో విజయశాంతి పర్యటన
హవేళిఘణాపూర్(మెదక్) : త్వరలోనే మాజీ ఎంపీ విజయశాంతి మెదజ్ జిల్లాలో పర్యటించనున్నారని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు చౌదరి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని తొగిట గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వచ్చే సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా విజయశాంతి పర్యటించనున్నారన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతారన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ట్రాక్టర్లు పక్కదారి పడుతున్నాయని ఆరోపించారు. రైతుబంధు పథకం కేవలం భూస్వాముల పథకంగా మారిందని, భూయాజమానికి ఎకరానికి రూ. 4వేలు ఇస్తే మరి కౌలు రైతు పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు నిజాం దక్కన్ షుగర్స్ ఫ్యాక్టరీని ప్రభుత్వాధీనం చేస్తామన్న హామీ ఏమైందన్నారు. ఓ వైపు ఎన్డీఎస్ఎల్ ఫ్యాక్టరీ కార్మికులను రోడ్డున పడేస్తు మరోవైపు టీఆర్ఎస్ హయంలోనే గ్రామాభివృద్ధి జరుగుతుందని డప్పు కొట్టుకుంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నాయకులు సిరిమల్లె శ్రీనివాస్, ఆఫీజోద్దీన్, రమేష్‌రెడ్డి, కిషన్‌గౌడ్, శంకర్, లక్ష్మినారాయణ, దుర్గయ్య తదితరులున్నారు. -
14 మండలాలలో జిల్లా కేంద్రం ఏర్పాటా?
పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు మెదక్: దేశంలో ఎక్కడాలేని విధంగా ఒకే నియోజకవర్గం, 14 మండలాలతో మెదక్ జిల్లాను ఏర్పాటు చేయడం దారుణమని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మిగతా జిల్లాల్లో కొత్త మండలాలు ఏర్పాటు చేయగా, మెదక్ జిల్లాలో ఉన్న మండలాలను తొలగించి కొత్త మండలాలను ఏర్పాటు చేయక పోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రజాభిష్టం మేరకే జిల్లాలు, మండలాలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ఇష్టానుసారంగా ఏర్పాటు చేస్తోందన్నారు. మెదక్ జిల్లాలో నర్సాపూర్, ఎల్లారెడ్డి నియోజకవర్గాలను పూర్తిస్థాయిలో కలపాలని ఆయన డిమాండ్‌చేశారు. ప్రస్తుతం హవేళిఘణాపూర్, బూర్గుపల్లి, మాసాయిపేట, నార్సింగిలను మండలాలను చేయాలని డిమాండ్ ఉన్నందున వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అలాగే రామాయంపేటను రెవెన్యూ డివిజన్ చేయాలన్నారు.