breaking news
super series tennis
-
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్
బాసెల్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి మరోసారి మేజర్ టోర్నీలో సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్–300 టోర్నీ స్విస్ ఓపెన్‌లో సాత్విక్ – చిరాగ్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఈ టోర్నీలో ఈ జంట మినహా ఇతర భారత షట్లర్లంతా ముందే నిష్క్రమించగా...వీరిద్దరు మాత్రం తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగారు. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో రెండో సీడ్ సాత్విక్ – చిరాగ్ ద్వయం 19–21, 21–17, 17–21తో మూడో సీడ్ మలేసియా జోడి ఆంగ్ యూ సిన్ – టియో ఈ యీపై విజయం సాధించింది. 69 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను కోల్పోయినా...తర్వాతి రెండు గేమ్‌లలో సత్తా చాటి భారత జంట విజయాన్ని అందుకుంది. నేడు జరిగే ఫైనల్లో చైనాకు చెందిన అన్‌సీడెడ్ జంట రెన్ జియాంగ్ యు – టాన్ ఖియాంగ్‌తో సాత్విక్ – చిరాగ్ తలపడతారు. -
అండర్-14 చాంప్ శివాని
అండర్-16లో రన్నరప్ ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్ సాక్షి, హైదరాబాద్: ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి అమినేని శివాని అండర్-14 బాలికల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. అండర్-16 విభాగంలోనూ ఫైనల్ బరిలోకి దిగిన ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అసోంలోని చాచల్‌లో గత ఐదు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు శుక్రవారం ముగిశాయి. అండర్-14 బాలికల సింగిల్స్ టైటిల్ పోరులో శివాని 6-0, 6-2తో మహారాష్ట్రకు చెందిన సాన్య సింగ్‌పై అలవోక విజయం సాధించింది. బాలుర ఫైనల్లో తమిళనాడు ఆటగాడు సురేశ్ 6-2, 5-7, 7-6 (8/6)తో అమిత్ బెనివాల్ (హర్యానా)పై గెలిచి విజేతగా నిలిచాడు. అండర్-16 బాలికల సింగిల్స్ ఫైనల్లో శివాని 7-5, 5-7, 6-7 (5/7)తో ప్రియాంక కలిత (అసోం) చేతిలో పోరాడి ఓడింది. బాలుర ఫైనల్లో ధ్రువ్ సునిశ్ (మహారాష్ట్ర) 6-3, 6-1తో యుగల్ బన్సాల్ (ఢిల్లీ)పై గెలిచి టైటిల్ అందుకున్నాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో అసోం రాష్ట్రానికి చెందిన మాజీ టెన్నిస్ ఆటగాడు ప్రశాంత దాస్ విజేతలకు బహుమతులు అందజేశారు.