అండర్-14 చాంప్ శివాని | under-14 champion shivani | Sakshi
Sakshi News home page

అండర్-14 చాంప్ శివాని

Jul 25 2014 11:46 PM | Updated on Sep 4 2018 5:07 PM

అండర్-14 చాంప్ శివాని - Sakshi

అండర్-14 చాంప్ శివాని

ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి అమినేని శివాని అండర్-14 బాలికల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది.

అండర్-16లో రన్నరప్
 ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్
 
 సాక్షి, హైదరాబాద్: ఐటా సూపర్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్‌లో తెలుగమ్మాయి అమినేని శివాని అండర్-14 బాలికల సింగిల్స్ టైటిల్ కైవసం చేసుకుంది. అండర్-16 విభాగంలోనూ ఫైనల్ బరిలోకి దిగిన ఆమె రన్నరప్‌తో సరిపెట్టుకుంది. అసోంలోని చాచల్‌లో గత ఐదు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు శుక్రవారం ముగిశాయి.
 
  అండర్-14 బాలికల సింగిల్స్ టైటిల్ పోరులో శివాని 6-0, 6-2తో మహారాష్ట్రకు చెందిన సాన్య సింగ్‌పై అలవోక విజయం సాధించింది. బాలుర ఫైనల్లో తమిళనాడు ఆటగాడు సురేశ్ 6-2, 5-7, 7-6 (8/6)తో అమిత్ బెనివాల్ (హర్యానా)పై గెలిచి విజేతగా నిలిచాడు. అండర్-16 బాలికల సింగిల్స్ ఫైనల్లో శివాని 7-5, 5-7, 6-7 (5/7)తో ప్రియాంక కలిత (అసోం) చేతిలో పోరాడి ఓడింది. బాలుర ఫైనల్లో ధ్రువ్ సునిశ్ (మహారాష్ట్ర) 6-3, 6-1తో యుగల్ బన్సాల్ (ఢిల్లీ)పై గెలిచి టైటిల్ అందుకున్నాడు. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమంలో అసోం రాష్ట్రానికి చెందిన మాజీ టెన్నిస్ ఆటగాడు ప్రశాంత దాస్ విజేతలకు బహుమతులు అందజేశారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement