breaking news
sundraiah nagar
-
విజయవాడలో పేలుడు కలకలం
విజయవాడ: విజయవాడలోని సుందరయ్యనగర్‌లో పేలుడు కలకలం సృష్టించింది. కాలనీకి చెందిన పద్మారావు ఇంట్లో పెద్ద శబ్ధంతో పేలుడు సంభవించింది. కంప్యూటర్ ఆన్ చేయడంతోటే ఒక్కసారిగా పెద్ద శబ్ధంతో పాటు పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. పేలుడు ధాటికి ఇంట్లోని వస్తువులతో పాటు పార్కింగ్‌లో ఉన్న కారు, పక్కనున్న నాలుగు ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పద్మారావుతో పాటు పనిమనషి జ్యోష్నకు గాయాలయ్యాయి. వీరిని స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. భారీ పేలుడుతో స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి యత్నిస్తున్నారు. గ్యాస్‌సిలిండర్ లీక్ అవుతున్న సమయంలో కంప్యూటర్ ఆన్ చేయడంతో.. షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు ఎగిసిపడ్డట్లు స్థానికులు భావిస్తున్నారు. -
విజయవాడలో పేలుడు కలకలం