breaking news
Summer season Soft drinks
-
సరిలేరు తనకెవ్వరు..!!
వేసవిలో మండుటెండల్లో ఖానా పూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చే వారికి పట్టణానికి చెందిన జనార్దన్ అంబలి పోసి ఆకలి తీరుస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. పట్టణంలోని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వద్ద డాక్యుమెంట్ రైటర్‌గా (లేఖరిగా) పనిచేస్తున్న పల్లికొండ జనార్దన్ తాను సంపాదించిన దాంట్లోంచి కొంత సామాజిక కార్యక్రమాలకు వెచ్చిస్తున్నాడు.ఎలాంటి ప్రచార ఆర్భాటం లేకుండా రాజకీయాలకతీతంగా తొమ్మిదేళ్లుగా సామాజిక సేవచేస్తూ అందరి మన్ననలు పొందుతూ పలువురికి మార్గదర్శిగా నిలుస్తున్నాడు. ఏటా వేసవి ప్రారంభం కాగానే మూడు నెలల పాటు ప్రజలకు అంబలిని అందిస్తున్నారు.రద్దీ పెరిగినా వెనక్కి తగ్గకుండా..పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు గతంలో అంతగా జనం వచ్చేవారు కాదు. ప్రస్తుతం ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ సేవలు పెంచడంతో రద్దీ పెరిగింది. అయినప్పటికీ ప్రతీరోజు వెయ్యిమందికి పైగా జనానికి ఉచితంగా అంబ లి అందిస్తున్నాడు. దీనికి తోడు రూ.50 వెచ్చించి ఆర్టీసీ బస్టాండ్‌లో కూల్ వాటర్ ఫ్రీజర్ ఏర్పాటు చేసి ప్రజల దాహం తీరుస్తున్నాడు. 7 పదుల వయస్సులోనూ అధైర్యపడకుండా తన సేవలు కొనసాగిస్తున్నాడు.అంబలితో ఆరోగ్యం..అంబలి తాగడం ద్వారా వేడిమి నుంచి చల్లద నం పొందడంతో పాటు ఎన్నో పోషక విలువలు అందుతాయి. దీంతో చిన్నా, పెద్ద తేడా లేకుండా అంబలి సేవిస్తున్నారు.భవిష్యత్‌లోనూ అందిస్తా..నాటి కాలంలో ప్రతీ వేసవిలో అంబలి తాగడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు వడదెబ్బల నుంచి ఉపశమనం పొందేవారు. తొమ్మిదేళ్ల క్రితం కార్యక్రమం చేపట్టా. భవిష్యత్తులోనూ అందిస్తా.– పల్లికొండ జనార్దన్, అంబలి దాతకొన్నేళ్లుగా తాగుతున్నాం..ఆర్టీసీ బస్టాండ్‌లో జనార్దన్ ఉచితంగా అందించే అంబలిని కొన్నేళ్లుగా తాగుతున్నాం. వేసవి వచ్చిందంటే బస్టాండ్‌లో జనార్దన్ అంబలి ఉంటుందని గుర్తుకు వస్తుంది. ఎన్ని పనులున్నా వదిలివెళ్లి అంబలి తాగుతున్నాం.– కరిపె రాజశేఖర్, ఖానాపూర్ఇవి చదవండి: ఆరేళ్లుగా పిజ్జా లాగించేస్తున్నాడు.. కానీ అతను..! -
మార్కెట్ ఏటా రూ. 5 వేల కోట్లు
మార్కెట్ ఏటా రూ. 5 వేల కోట్లు ఆరోగ్యంపై శ్రద్ధ, మారుతున్నజీవనశైలితో జోరుగా వ్యాపారం వేసవి కాలంలో మరింత వృద్ధి: నిపుణులు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వేసవి కాలం వచ్చేసిందంటే చాలు శీతల పానీయాల మార్కెట్ జోరందుకుంటుంది. మరీ ఎక్కువగా పళ్ల రసాల పానీయాల మార్కెట్ చెప్పనక్కర్లేదు. ఎంతలా అంటే అక్షరాల రూ.5 వేల కోట్లు. దేశవ్యాప్తంగా ప్యాకెట్ పళ్ల రసాల పానీయాల మార్కెట్ ఏటా 30 శాతం వృద్ధిని కనబరుస్తోందని నిపుణులు చెబుతున్నారు. తలసరి ఆదాయం పెరగటం, ప్రజల జీవన శైలిలో మార్పు, ఆరోగ్యంపై శ్రద్ధ పెరగటం, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా సులువుగా లభ్యమవటం వంటివెన్నో మార్కెట్ వృద్ధికి కారణమౌతున్నాయంటున్నారు విశ్లేషకులు. శీతల పానీయాల మార్కెట్లో శరవేగంగా వృద్ధి చెందే విభాగమేదైనా ఉందంటే అది పళ్ల రసాల పానీయాల మార్కెటే అని చెప్పాలి. దశాబ్ద కాలంగా ఏటా 30-40 శాతం వృద్ధిని కనబరుస్తుండటమే ఇందుకు ఉదాహరణ అని రవి ఫుడ్స్ ప్రై.లి. ఎండీ రాజేంద్రన్ అగర్వాల్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు చెప్పారు. ప్రస్తుతం రూ.5 వేల కోట్లుగా ప్యాకేజ్డ్ పళ్ల రసాల శీతల పానీయాల మార్కెట్.. రానున్న ఐదేళ్లలో మరో 15 శాతం వృద్ధి రేటుతో రూ.12 వేలు నుంచి రూ.15 వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేశారాయన. ‘పళ్ల రసాల పానీయాల తలసరి వాడకం ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటుంది. అక్కడి వాతావరణ పరిస్థితులు, ప్రజల లైఫ్ స్టైల్ వంటివెన్నో వాడకం తీరులో వ్యత్యాసాన్ని చూపిస్తాయి. ప్యాకేజ్డ్ పళ్ల రసాల తలసరి వాడకం జర్మనీలో 45 లీటర్లు, స్విట్జర్లాండ్‌లో 42.5 లీటర్లు, యునెటైడ్ స్టేట్స్లో 39 లీటర్లుగా ఉంది. అదే, మన దేశంలో అయితే కేవలం 20 ఎంఎల్ మాత్రమే ఉంది’ అని రాజేంద్రన్ చెప్పారు. చిన్న ప్యాకెట్లకే గిరాకీ.. ప్యాకేజ్డ్ పళ్ల రసాల డిమాండ్‌ను చూసి లోకల్ సంస్థలే కాదు జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు కూడా ఈ వ్యాపారంపై దృష్టి సారించాయి. మెట్రో నగరాల్లో అయితే పళ్ల రసాలను బ్రేక్ ఫాస్ట్లాగా మారింది. సాయంత్రం వేళల్లో స్నాక్స్ లాగా వినియోగిస్తున్నారు. ప్రత్యేకించి వేసవి కాలంలో వీటి గిరాకీ మరీ ఎక్కువగా ఉంటుంది. ఇటీవలే స్విట్జర్లాండ్‌కు చెందిన కేప్రిసన్ సంస్థ మామిడి, యాపిల్, మిక్స్డ్ ఫ్రూట్ పళ్ల రసాలను విడుదల చేసింది. హైదరాబాద్‌లో కేప్రిసన్ ఎస్‌డీయూ బేవరేజెస్ ప్లాంటును ప్రారంభించినట్లు ఎస్‌డీయూ ఎండీ కిశోర్ అగర్వాల్ చెప్పారు. తొలి దశలో రూ.50 కోట్లు పెట్టుబడి పెట్టామన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ రోజురోజుకూ వీటి వాడకం పెరగడం వల్ల ప్రత్యేకించి దృష్టి సారించామన్నారు. తయారీలో కావాల్సిన పళ్లను స్థానికంగా, ఫ్లేవర్లను జర్మనీ, జపాన్ వంటి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. చిన్న ప్యాకెట్లయితే ధర తక్కువగా ఉండటం, ఎక్కడైనా లభ్యమవటం, ఎక్కడైనా తాగొచ్చు వంటి అనేక కారణాల వల్ల పెద్ద కంపెనీలు కూడా చిన్న ప్యాకెట్లలోనే పళ్ల రసాలను విడుదల చేస్తున్నాయి. పెప్సీ, కోకకోలా, మాజా, స్లయిస్, ఆప్పీ వంటి బ్రాండ్లెన్నో మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వ్యాపారంలో మూడు విభాగాలు.. ప్యాకేజ్డ్ పళ్ల రసాల శీతల పానీయాల మార్కెట్లో మూడు విభాగాలుంటాయి. ఫ్రూంట్ డ్రింక్స్, జ్యూసులు, నెక్టర్ డ్రింక్స్ (తేనె). ఫ్రూట్ డ్రింక్స్: ఇందులో 30 శాతం పళ్ల రసాలుంటాయి. దేశ వ్యాప్తంగా ప్యాకేజ్డ్ పళ్ల రసాల శీతల పానీయాల మార్కెట్లో ఫ్రూట్ డ్రింక్స్ మార్కెట్ వాటా 60 శాతం. ఫ్రూటీ, జంపిన్, మాజా వంటివి ఈ కేటగిరీలో అత్యంత ప్రజాదరణ పొందినవి. జ్యూస్: ఇందులో వంద శాతం పళ్ల రసమే ఉంటుంది. మొత్తం మార్కెట్లో జ్యూస్ వాటా 30%. నెక్టర్ డ్రింక్స్: వీటిలో 25-90% పళ్ల రసం ఉంటుంది. మొత్తం మార్కెట్లో నెక్టర్ డ్రింక్స్ వాటా కేవలం 10 శాతమే ఉందని నిపుణులు చెబుతున్నారు.