breaking news
Summer coaching camps
-
ఆటల పండుగ వచ్చేసింది...ఇవిగో పూర్తి వివరాలు
సనత్‌నగర్: వేసవి సెలవుల జోష్ మొదలైంది. నిన్నమొన్నటి వరకు పుస్తకాలతో కుస్తీపట్టిన చిన్నారులు ఇక మైదానాల్లో తమకిష్టమైన క్రీడల్లో సందడి చేయనున్నారు. ప్రతియేటా లాగానే ఈ సారి కూడా జీహెచ్ఎంసీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణను చేపట్టింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోడ్ వల్ల ఈ సారి కాస్తా ఆలస్యం కాగా ఎలాంటి హంగూ ఆర్బాటం లేకుండా వేసవి క్రీడా శిబిరాలు అందుబాటులోకి వచ్చాయి. వేసవి క్రీడా శిక్షణ సామగ్రి సైతం ఆయా డివిజన్లకు చేరుకున్నాయి. సనత్‌నగర్, అమీర్‌పేట డివిజన్లలో అతిపెద్ద క్రీడా సౌధాలతో పాటు మైదానాలకు కొదువ లేదు. గ్రేటర్లో ఎక్కడా లేనివిధంగా అన్ని రకాల ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్‌లో ఆయా చోట్ల శిక్షణ కొనసాగుతుంటుంది. సాధారణంగానే నిరంతర శిక్షణ ఉంటుంది. అయితే వేసవి సెలవుల దృష్ట్యా వాటి స్థానంలో శనివారం నుంచి మే 31 వరకు ప్రత్యేక శిక్షణ కొనసాగనుంది. ఇదీ చదవండి: Pahalgam గడువు లోపు వెళ్లకపోతే...తప్పదు భారీ మూల్యం! ఎప్పటిలాగానే అమీర్‌పేట్ జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్‌లోని స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లతో పాటు వివిధ క్రీడా ప్రాంగణాలు వేసవి శిక్షణ శిబిరాలకు వేదికయ్యాయి. క్రికెట్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, స్కేటింగ్, షటిల్, జిమ్, బ్యాడ్మింటన్, జిమ్నాస్టిక్, హాకీ, యోగ, చెస్, కరాటే....ఇలా వివిధ రకాల క్రీడాంశాల్లో జీహెచ్ఎంసీ తరుపున శిక్షణ ఇస్తున్నారు. వేసవి శిక్షణ శిబిరాల ద్వారా కొనసాగే ఆటల్లో శిక్షణ పొందేందుకు 5 నుంచి 16 ఏళ్ళ మధ్య వయస్సున్న వారు అర్హులుగా నిర్ణయించారు. ఆసక్తి గల బాలబాలికలు ఆన్లైన్లో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని జీహెచ్ఎంసీ క్రీడా విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ మాధవి తెలిపారు. వేసవి శిబిరాల్లో స్విమ్మింగ్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ మినహాయించి అన్ని క్రీడల్లో శిక్షణ పొందేందుకు రూ.10 ఫీజు చెల్లించి పేరు నమోదు చేసుకోవచ్చు. స్కేటింగ్, క్రికెట్లో మాత్రం వేసవి శిక్షణ కోసం రూ.50లు చెల్లించాల్సి ఉంటుంది. స్విమ్మింగ్ శిక్షణకు రూ.500లు చెల్లించాలి.వేసవి శిక్షణ శిబిరాలకు హాజరయ్యే బాలబాలికలు స్పోర్ట్స్.జీహెచ్ఎంసీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లోకి వెళ్లి పిల్లల పేరు, వివరాలు నమోదు చేసి, ఇష్టమైన క్రీడను ఎంపిక చేసుకుని సూచించిన ఫీజును ఆన్లైన్లో చెల్లించవచ్చు. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు వేసవి శిక్షణ శిబిరాలు కొనసాగుతాయి. స్కేటింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: పవన్‌కుమార్ ఫోన్: 98665 13604 బాక్సింగ్ వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: ప్రకాశ్ ఫోన్: 93907 65412 జిమ్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.200, కోచ్: విక్రమ్ ఫోన్: 91772 85745 బ్యాడ్మింటన్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: సురేష్ ఫోన్: 99498 14362 హాకీవేదిక: అమీర్‌పేట్ క్రీడామైదానం ఫీజు: రూ.10, కోచ్: దర్శన్‌సింగ్ , ఫోన్: 98497 21703 కరాటే వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.10, కోచ్: బాబు, ఫోన్: 96181 33057జిమ్నాస్టిక్వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మహేష్ ఫోన్: 90002 77716 యోగా వేదిక: జీహెచ్ఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్, అమీర్‌పేట్ డీకేరోడ్డు ఫీజు: రూ.50, కోచ్: మనోజ్ ఫోన్: 99639 78509 హ్యాండ్‌బాల్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.10, కోచ్: ఇమ్రాన్‌ఖాన్ ఫోన్: 91772 39786 బాస్కెట్‌బాల్ వేదిక: సనత్‌నగర్ ఎస్ఆర్టీకాలనీ ఇమ్మానుయేల్ చర్చి సమీపంలోని గ్రౌండ్ ఫీజు: రూ.10 కోచ్: నయిముద్దీన్, ఫోన్: 98483 96922వాలీబాల్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ ఫీజు: రూ.10, కోచ్: చిన్ని, పెద్ది ఫోన్ :99599 51499 క్రికెట్ వేదిక: సనత్‌నగర్ లేబర్ వెల్ఫేర్ గ్రౌండ్ , ఫీజు: రూ.100, కోచ్: రాజ్‌కిరణ్ ఫోన్: 97041 59549 ఇదీ చదవండి: చింత చిగురా మజాకా.. కాస్త దట్టిస్తే చాలు ఆహా..! -
మొక్కుబడిగా జీహెచ్ఎంసీ శిబిరాలు
ఎల్బీ స్టేడియం : ఘనచరిత్ర ఉన్న జీహెచ్ఎంసీ వేసవి శిక్షణ శిబిరాలు ఈ ఏడాది మొక్కుబడిగా సాగుతున్నాయి. ప్రతి యేటా ఏప్రిల్ చివరి వారంలో అట్టహాసంగా ఆరంభమయ్యే ఈ శిబిరాలు ఈ యేడు అంతంత మాత్రం నిర్వహణతో వెలవెలబోతున్నాయి. ఇంకా చెప్పాలంటే జీహెచ్ఎంసీ ఇప్పటికీ అధికారికంగా ఈ శిబిరాలను ప్రారంభించలేదు. నగరంలో అక్కడక్కడ ఉన్న ప్లే గ్రౌండ్స్‌లో స్థానిక అధికారుల నేతృత్వంలో అరకొరగా సాగుతున్నాయి. యేటికేడు భారీ ఎత్తున నిర్వహించే సమ్మర్ కోచింగ్ క్యాంపులు ఈ వేసవిలో ఒక్కసారిగా డీలాపడిపోయాయి. దీనికి గల కారణాలను మాత్రం సంబంధిత అధికారులు స్పష్టంగా వెల్లడించడం లేదు. దీనిపై పలు క్రీడా సంఘాలు, క్రీడాకారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఏ నగర పాలక సంస్థ చేపట్టని విధంగా జీహెచ్ఎంసీ (అప్పటి ఎంసీహెచ్) ఈ శిబిరాలకు 1968లో శ్రీకారం చుట్టింది. ఇంతింతై వటుడింతై అన్నట్లు... అప్పట్లో కేవలం పది మైదానాల్లో కేవలం 15 మంది కోచ్‌లతో 1400 మంది చిన్నారుల శిక్షణతో ఆరంభమైన ఈ శిబిరాలు తదనంతరం వందల మైదానాల్లో వేయి మంది కోచ్‌లతో నిర్వహించే స్థాయికి చేరుకుంది. సౌత్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సెంట్రల్ ఇలా ఐదు జోన్లలోని 18 సర్కిళ్లలో ఉన్న 150 డివిజన్లలో ప్రతి వేసవిలోనూ క్యాంపులను నిర్వహించేవారు. ఈ శిబిరాల్లో సుమారు లక్ష మంది ఔత్సాహిక క్రీడాకారులు కేవలం నామమాత్రపు ఫీజుతో శిక్షణ తీసుకునేవారు. కొన్ని క్రీడాంశాలకైతే ఉచితంగానే శిక్షణ ఇస్తారు. ఆరేళ్ల నుంచి 18 ఏళ్ల బాలబాలికలు ఈ శిబిరాల్లో పాల్గొనేవారు. భారీ ఎత్తున 52 క్రీడాంశాల్లో నిర్వహించిన ఈ వేసవి క్రీడా శిక్షణ శిబిరాల ద్వారానే పలువురు వెలుగులోకి వచ్చారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో రాణించి హైదరాబాద్ సత్తాచాటుకున్నారు. అయితే ఇంతటి చరిత్ర ఉన్న ఈ శిబిరాలను జీహెచ్ఎంసీ క్రీడాధికారులు ఈ ఏడాది విస్మరించారు. ఏమైనా నిధుల కొరతా?... అంటే అదీ లేదు. ఎందుకంటే అందుబాటులో రూ. 10 కోట్ల బడ్జెట్ ఉన్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల పెద్ద ఎత్తున శిబిరాలను నిర్వహించలేకపోయారు. క్రీడలకు, క్రీడాకారులకు భారీ ప్రోత్సాహకాలంటూ ప్రకటనలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా జీహెచ్ఎంసీ శిబిరాలవైపు కన్నెత్తి చూడలేదు. ఇప్పుడు స్పెషల్ కమిషనర్ ఏలుబడిలో ఉన్న జీహెచ్ఎంసీ పాలక మండలి నిర్వాకంపై నగరానికి చెందిన పలు పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.