breaking news
sulthan bazar
-
భవనం పూర్తి కాదు.. కష్టాలు తీరవు
సుల్తాన్‌బజార్: సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడకు వచ్చే గర్భిణులు, తోడుగా వచ్చే సహాయకులకు కనీస వసతులు లేక అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో నిలుచునే చోటు లేకపోవడంతో చాలామంది ప్రాగంణంలోను, చెట్టు కింద ఉండాల్సిన పరిస్థితి. రోగులు, వారి బంధువులు అందరూ బయటే ఉండటంతో ఆ ప్రాంతమంతా అపరిశుభ్రంగా మారుతోంది. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి ప్రతిరోజు వందల సంఖ్యలో రోగులు వైద్యం కోసం వస్తుంటారు. ఇన్ పేషెంట్‌గా ఉన్న వారికోసం వారి బంధువుల సైతం రావడంతో నిత్యం ఆస్పత్రిలో జన సంఖ్య పెరుగుతూ వస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ ప్రాంగణంలో మరో కొత్త భవనం నిర్మాణం చేపట్టింది. అయితే, గత మూడేళ్లుగా నిర్మాణ పనులు నత్త నడకన నడుస్తుండటంతో రోగులకు, వారి సహాయకులకు ఇబ్బందులు తప్పడంలేదు. దీంతో వారు ఆస్పత్రి ఆవరణలో నేలపైనే భోజనాలు చేయడం, అక్కడే కునుకు తీయడం చేస్తుండడంతో అక్కడ అపరిశుభ్ర వాతావరణం నెలకొంటోంది. నూతన భవనం త్వరగా పూర్తయితే గాని రోగులకు ఈ పాట్లు తప్పవు. -
గో రక్షకులపై వేధింపులు తగదు: వీహెచ్‌పీ
సుల్తాన్ బజార్: తెలంగాణలో గో రక్షకులపై పోలీసులు అమానుష దాడులకు పాల్పడుతున్నారని వీహెచ్‌పీ నేతలు ఆరోపించారు. ఆదివారం కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర స్ధాయి ప్రచార విభాగం సమావేశం నిర్వహించారు. వీహెచ్‌పీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి ఆకారపు కేశవరాజు, రాష్ట్ర సహ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, రావినూతల శశిధర్, సత్యనారాయణలు హాజరై ప్రసంగించారు. తెలంగాణ ప్రాంతంలో 1948 కంటే ముందు కొనసాగిన హిందూ వ్యతిరేక పాలన నేడు మళ్లీ 2014 నుంచి కొనసాగుతుందని వారు ఆరోపించారు. ఖాశీం రజ్వీ ఏ విధంగానైతే హిందువులపై బరితెగించి దాడి చేశాడో, అదేరీతిలో ఇప్పటి పోలీసులు వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ మద్దతుతో రెచ్చిపోతున్న ఎంఐఎం నేతలు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారన్నారు. వారి సూచనల మేరకే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. దీనిపై డీజీపీ స్పందించాలని వారు కోరారు. లేనిపక్షంలో డీజీపీ కార్యాలయం ముందు ఆందోళనకు దిగుతామని వారు హెచ్చరించారు. చిన్న చిన్న జంతువులను హింసిస్తే, అప్పటికప్పుడు వాలిపోయే జంతు ప్రేమికులు గోహత్యలు జరుగుతుంటే ఎందుకు స్పందించడంలేదని నిలదీశారు. సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రచార ప్రముఖ్‌లు హాజరయ్యారు. అంతకుముందు భారతమాత విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేశారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ ప్రచార విభాగం నాయకులు రాంబాబు, అనిల్‌యాదవ్, రాధాకష్ణ,రాజేందర్, కృష్ణ, ధీరజ్, కైలాష్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ పిల్లలకు పాలివ్వడానికి అనుమతి లేదు!
సాక్షి, సిటీబ్యూరో: పాపం ఆ పసికందులు జన్మించి రెండు రోజులవుతున్నా ఇప్పటి వరకు వారు తల్లిపాలకు నోచుకోలేదు. పిల్లల చెంతనే ఉన్నా పాలివ్వలేని స్థితిలో కన్న తల్లుల బాధ వర్ణణాతీతం. బిడ్డ ఆరోగ్యం కోసం పుట్టిన వెంటనే ముర్రుపాలు పట్టాల్సి ఉంది. అయితే పుట్టిన శిశువుల్లో ఎవరు ఎవరి బిడ్డో అనే అంశం ఇంకా తేలక పోవడంతో ఇటు తల్లులు, అటు చిన్నారులు నరకయాతన అనుభవిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా, నోముల గ్రామానికి చెందిన గర్భిణి రమాదేవి మంగళవారం మధ్యాహ్నం ఓ శిశువుకు జన్మనివ్వగా, ఇదే సమయంలో మహబూబ్‌నగర్ జిల్లా, కడ్తాల్‌కు చెందిన రజిత కూడా అదే ఆస్పత్రిలో ప్రసవించింది. నవజాత శిశువుల్లో ఒకరు ఆడబిడ్డ కాగా, మరొకరు మగ బిడ్డ. బిడ్డలను తల్లులకు అప్పగించే సమయంలో శిశువులు తారుమారు కావడంతో మగశిశువు తమ వాడంటే, కాదు తమ వాడని ఇరువురు బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు, వైద్యులు జోక్యం చేసుకుని ఆయా శిశువులను డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇద్దరు దంపతులతో పాటు శిశువులను నుంచి రక్తపు నమూనాలు సేకరించారు. రజిత మగబిడ్డను ప్రసవించిందని, తమ బిడ్డను తమకు ఇప్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఆమె తరపు బంధువులు బుధవారం కూడా ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. ఇందుకు పోటీగా రమాదేవి బంధువులు సైతం ఆందోళనకు పూనుకోవడంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. గుక్కపట్టి ఏడుస్తున్న శిశువులు.. ఈ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఆస్పత్రి వైద్యులు సుల్తాన్‌బజార్ పోలీసులను ఆశ్రయించారు. వివాదం తేలే వరకు శిశువులను చైల్డ్‌కేర్ సెంటర్లో ఉంచాల్సిందిగా వారు ఆదేశించారు. అమ్మ పొత్తిళ్లలో హాయిగా సేదతీరాల్సిన ఆ శిశువులు ఒకే గదిలో వేర్వేరు ఉయ్యాలల్లో ఆకలితో అలమటిస్తూ గుక్కపట్టి ఏడుస్తున్నారు. వీరిని తాకేందుకు తల్లులకు అనుమతి ఇవ్వకపోవడంతో జన్మనిచ్చిన తల్లులు పక్కనే ఉన్నా...దగ్గరి తీసుకుని పాలు ఇవ్వలేని దుస్థితి. ఆస్పత్రి ఆయాలు ఇతరుల నుంచి పాలు సేకరించి పడుతున్నా..శిశువులు ఏడుపు ఆపడం లేదు. ఇదిలా ఉండగా ఈ అంశంపై పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయక పోవడం విశేషం. తల్లిదండ్రులు, పిల్లల నుంచి సేకరించిన రక్తపు నమూనాలను డీఎన్ఏకు పంపలేదు. వీరి వరుస ఆందోళనలతో తోటి గర్భిణులు, వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఆయాల కక్కుర్తి వల్లే.. పురిటినొప్పులతో బాధపడుతూ సుఖప్రసవం కోసం ఆస్పత్రికి చేరుకున్న గర్భిణులకు ఇక్కడి ఆయాలు, సెక్యురిటీ సిబ్బంది చుక్క లు చూపెడుతున్నారు. గేటు దగ్గర ఉన్న సెక్యురిటీ మొదలు పేగుతెంచుకుని పుట్టిన బిడ్డను చూడాలన్నా అడిగినంత ఇచ్చుకోవాల్సిందే. కేవలం వైద్యానికే కాదు పుట్టులకు కూడా ఇక్కడ ధరలు నిర్ణయించారు. ఆడబిడ్డ పుడితే రూ.700, మగ బిడ్డ పుడితే రూ.1200 వసూలు చేస్తున్నారు. దీనిపై ఎవరైనా ప్రశ్నిస్తే బిడ్డను చూపించకుండా తల్లలకు శోకాన్ని మిగిల్చుతున్నారు. ఆస్పత్రిలో రోజుకు సగటున 25–30 ప్రసవాలు జరుగుతుండగా, ఒక్కో ప్రసవానికి సగటున రూ.10 00 చొప్పున రూ.30 వేలకుపైనే అక్రమ వసూళ్లు జరుగుతుండటం విశేషం. రమాదేవి, రజిత బిడ్డల తారుమారు విషయంలోనూ ఇదే కోణం వెలుగు చూడటం కొసమెరుపు. -
గాడ్గిల్ వ్యాఖ్యలకు నిరసనగా సుల్తాన్‌బజార్ బంద్