breaking news
suit and tie
-
సూట్స్‌ని స్టైలిష్‌గా కుట్టేదాం ఇలా..!
సూట్స్ కోసం ఖరీదైన ఫ్యాబ్రిక్స్ కొనుగోలు చేయడం మాత్రమే కాదు వాటిని అంతే స్టైల్‌గా స్టిచ్ చేయడం కూడా ముఖ్యమే. ఎంత మంచి బ్రాండెడ్ క్లాత్ తీసుకున్నా స్టిచ్చింగ్ కుదరకపోతే.. ఆ ఖర్చు బూడిదలో పోసిన పన్నీరే. ముఖ్యంగా విభిన్న హోదాల్లో ఉంటూ సూట్స్ ధరించేవారికి ఆ హోదాకు తగ్గట్టు కుట్టు కూడా కుదరాలి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ బ్రాండ్స్ తామే స్టిచ్చింగ్ సేవలను అందిస్తున్నాయి. ఈ విషయంలో మరొక అడుగు ముందుకేసిన.. ప్రముఖ అంతర్జాతీయ బ్రాండ్. హైదరాబాద్ నగరవాసులకు ఉచితంగా స్టిచ్చింగ్ సేవల్ని పరిచయం చేస్తూ మేడ్ ఫర్ యూ స్టిచ్డ్ ఫర్ ఫ్రీ పేరిట ఓ కాన్సెప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ విషయాన్ని ఆ సంస్థ రిటైల్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ప్రణవ్ డేవ్ తెలిపారు. ఈ పంధాను మరిన్ని బ్రాండ్స్ అనుసరిస్తే.. వేల రూపాయలు వ్యయమయ్యే స్టిచ్చింగ్ సేవలు ఉచితంగా అందించే పరిస్థితి కనిపిస్తోంది. (చదవండి: సమ్మర్లో కాటన్ డ్రెస్‌లతో స్టైలిష్‌గా ఉండొచ్చు ఇలా..!) -
సూటేసుకుని.. టై కట్టుకుని.. బుద్ధిగా!
ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకెర్బెర్గ్ సాధారణంగా ఎక్కడైనా సరే ఓ టీషర్టు, జీన్సు ప్యాంటు వేసుకుని, స్నీకర్స్ తొడుక్కుని వెళ్లిపోతాడు. కానీ.. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలవడానికి వెళ్లినప్పుడు మాత్రం బాగా డార్క్ కలర్ సూట్ వేసుకుని, టై కూడా కట్టుకుని మరీ బుద్ధిమంతుడైన విద్యార్థిలా వెళ్లి కూర్చున్నాడు. తమ సోషల్ మీడియా కారణంగా మారుమూల గ్రామాల వాళ్లకు కూడా ప్రధానమంత్రి అంటే ఎవరో, ఆయనేంటో తెలుస్తోందని జుకెర్బెర్గ్ అన్నాడు. భారతదేశంలో కేవలం 24.3 కోట్ల మందికి మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం ఉందని, ఇక్కడ ఇంకా చాలా విస్తరించే అవకాశం ఉందని తెలిపాడు. వందకోట్ల మందికి పైగా ప్రజలు ఇంకా ఇంటర్నెట్ పొందాల్సి ఉందని, ఇది కేవలం ఒక్క ఫేస్బుక్కే కాక.. అందరికీ సమస్యేనని అన్నాడు. రెండు రోజుల పర్యటన కోసం భారతదేశానికి వచ్చిన మార్క్ జుకెర్బెర్గ్.. ఇక్కడ ఇంటర్నెట్.ఆర్గ్ నిర్వహించే ఓ సదస్సులో కూడా పాల్గొంటున్నాడు. కనెక్టివిటీ అనేది ప్రస్తుత తరానికి ప్రాథమిక హక్కు అని చెప్పాడు. భారతదేశం తమకు చాలా ముఖ్యమైనదని, ఇక్కడ అంతగా జనానికి నచ్చని యాప్‌లు ప్రవేశపెట్టి రిస్కు తీసుకోలేమని తెలిపాడు. అందుకే జాంబియాలో ప్రవేశపెట్టిన యాప్‌ను ఇక్కడకు తేవట్లేదన్నాడు.