breaking news
Suchitra Krishna murthy
-
కేతన్ హత్య : సియాకు సపోర్ట్ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటు
పుణేకు చెందిన రియల్టర్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలు సియా గోయల్‌కు మద్దుతుగా నిలుస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అదే క్రమంలో నిందితురాలు సియాను దుమ్మెత్తి పోస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. బలవంతపు పెళ్లి పర్యవసానమే ఇది అంటూ సియాను సమర్థించడానికి ప్రయత్నించిన ఒక నెటిజన్‌పై నటి, గాయని సుచిత్ర కృష్ణమూర్తి తీవ్రంగా మండిపడ్డారు. నేరపూరిత ప్రవర్తనను సమర్థించడానికి ఎలాంటి సంస్కృతి లేదా వ్యక్తిగత పరిస్థితులను వాడుకోలేమంటా విమర్శలు గుప్పించారు. అసలు ఏమైంది అంటే... ప్రియుడితో కలిసి కాబోయే భర్త కేతన్ అగర్వాల్‌ను హత్య చేసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా గోయల్‌పై సానుభూతి చూపిస్తూ, ఎక్స్ (ట్విట్టర్)లో ఒక యూజర్ స్పందించారు. బలవంతపు వివాహాల వల్లే ఇలా జరుగుతోందని వ్యాఖ్యానించాడు. ఒకవేళ సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి అమెరికా లేదా యూరప్‌లో ఉండి ఉంటే, వారు లివ్-ఇన్ రిలేషన్షిప్లో ఉండేవారని, అప్పుడు కేతన్ అగర్వాల్ ఈ కథలోకి వచ్చేవాడే కాదని పేర్కొన్నాడు. దీనిపై సుచిత్ర కృష్ణమూర్తి ఘాటుగా స్పందించారు.నటి సుచిత్ర కృష్ణమూర్తి కౌంటర్ఒకవేళ సియాపై పెళ్లికి ఒత్తిడి తెచ్చినప్పటికీ, హింసకు పాల్పడకుండా ఆమెకు అనేక చట్టపరమైన, వ్యక్తిగత మార్గాలు ఉన్నాయంటూ కౌంటరిచ్చారు. "ఏ సంస్కృతి కూడా నేరపూరిత ప్రవర్తనను సమర్థించదు. ఇలాంటి నేరాలను సమర్థించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఆమె ఇల్లు వదిలి పారిపోవచ్చు, లేదా తన సమ్మతి లేకుండా బలవంతంగా పెళ్లి చేస్తున్నందుకు కుటుంబంపై కేసు కూడా పెట్టాల్సింది. కానీ, పక్కా ప్రణాళికతో తన కాబోయే భర్తను కొండపై నుండి నెట్టి చంపడం అనేది కేవలం ఒక సైకోపాత్ (ఉన్మాది) మనస్తత్వం మాత్రమే" అంటూ ఎక్స్‌లో సుచిత్ర విరుచుకుపడ్డారు.ఇదీ చదవండి : కేతన్ హత్య : కోడ్‌వర్డ్స్ , ఎమోజీలతో సియా ‘సీక్రెట్ చాట్స్’కాగా జూన్18న లోహగఢ్ కోట దగ్గర ట్రెకింగ్ చేస్తుండగా కేతన్ అగర్వాల్ మరణించాడు. మొదట ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా భావించి నప్పటికీ, పోలీసుల దర్యాప్తులో ఇదొక ప్రణాళికాబద్ధమైన హత్యగా తేలింది. కేతన్ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు వారిద్దరిని అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉంది.ఇదీ చదవండి: ప్రేయసితో కలిసి భార్యను కాల్చి చంపి, నేపాల్ చెక్కేశాడు! -
డేటింగ్ సైట్లో తల్లి పేరు ఉంచిన కూతురు.. అసభ్యకరంగా మెసేజ్‌లు
Actress Suchitra Krishnamoorthi Reveals Her Daughter Forced Into Dating: 1991లో వచ్చిన మలయాళ చిత్రం 'కిలుక్కింపెట్టి'తో జయరామ్ సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది సుచిత్రా కృష్ణమూర్తి. తర్వాత తమిళ చిత్రం 'శివరంజని'లో టైటిల్ రోల్ పోషించి ఆకట్టుకుంది. తర్వాత షారుక్ ఖాన్ కభీ హా కభీ నా, జజ్బాత్ ఆగ్, రోమియో అక్బర్ వాల్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది ఈ 46 ఏళ్ల ముంబై నటి. సుచిత్రా కృష్ణమూర్తి నటిగానే కాకుండా గాయనీగా కూడా పేరు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన 'భూల్ భులయా 2', 'గిల్టీ మైండ్స్' వెబ్ సిరీస్‌లో నటించింది. అయితే తాజాగా సుచిత్రా కృష్ణమూర్తి పలు ఆసక్తికర విషయాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఇటీవల ఓ ప్రెస్ ఇంటరాక్షన్‌లో తన కన్న కూతురే తనను డేటింగ్ చేయమని బలవంతపెట్టినట్లుగా చెప్పుకొచ్చింది. చదవండి: 13 ఏళ్ల పిల్లల నుంచి అత్యాచార బెదిరింపులు, తట్టుకోలేకపోయాను: నటి అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దర్శకుడు శేఖర్ కపూర్‌ను వివాహం చేసుకున్న సుచిత్రా ఎనిమిదేళ్లకు 2007లో విడాకులు తీసుకుంది. ఈ జంటకు కావేరి కపూర్ అనే కుమార్తె ఉంది. 'నా విడాకుల తర్వాత నా కూతురు కావేరి నా పేరును డేటింగ్ సైట్లో నమోదు చేసింది. పురుషులతో డేటింగ్ చేయమని బలవంతం కూడా చేసింది. ఎవరికీ తెలియని ఓ వ్యక్తితో రిలేషన్షిప్లో ఉన్నానని, తర్వాత అతనితో కూడా విడిపోయానని, ఇప్పుడు నేను ఉన్నది డేటింగ్ చేసేందుకు కాదని నా కుమార్తెకు అర్థమయ్యేలా చెప్పాను. తర్వాత నాకు అసభ్యకరంగా మెసేజ్‌లు రావడంతో డేటింగ్ సైట్లో నా ప్రొఫైల్‌ను తొలగించింది.' అని సుచిత్రా కృష్ణమూర్తి పేర్కొంది. కాగా సుచిత్రా కుమార్తె కావేరి 'అవర్ లవ్ స్టోరీ'తో నటిగా ఎంట్రీ ఇవ్వనుంది. చదవండి: ముసలిదానివైపోతున్నావ్.. అంటూ అనసూయపై కామెంట్లు చదవండి: 'బ్రహ్మాస్త్ర'కు నిరసన సెగ.. బాయ్‌కాట్ పేరిట ట్రెండింగ్.. ఎందుకంటే ? -
ఆర్యన్ డ్రగ్స్ వివాదంపై షారుక్‌కి.. మద్దతు తెలిపిన బాలీవుడ్ ప్రముఖులు
డ్రగ్స్ కేసులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొత్తం 8మందిని అరెస్ట్ చేసిన పోలీసులు వారందరికీ వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కోర్టులో హాజరు పరిచారు. అయితే డ్రగ్స్ కేసు విషయంలో పలువురు బాలీవుడ్ సెలబ్రీటీలు షారుక్ ఖాన్‌కి మద్దతు ప్రకటించారు. అందులో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ తల్లి పూజా భట్ ఒకరు. ‘చాహత్’లో బాద్షాతో కలిసి పని చేసిన ఈ నటి ‘నేను మీకు సపోర్టుగా నిలుస్తున్నాను షారుఖ్. ఇది మీకు అవసరం లేకపోవచ్చు. కానీ నేను చేస్తాను. ఈ సమయం కూడా గడిచిపోతుంది’ అని సోషల్ మీడియాలో ట్వీట్ చేసింది. అంతేకాకుండా ‘కభీ హన్ కభీ నా’ మూవీలో షారుక్‌తో కలిసి నటించిన సుచిత్ర కృష్ణమూర్తి సైతం ఆయనకు సపోర్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పిల్లలు ఇబ్బందులు పడడం చూడడం కంటే పెద్ద కష్టం తల్లిండ్రులకు ఏది ఉండదని నటి తెలిపింది. అంతేకాకుండా..‘ ఇంతకుముందు కూడా ఇలాగే బాలీవుడ్ నటులపై రైడ్స్ జరిగాయి. కానీ అందులో ఏం దొరకలేదు. ఏది ప్రూవ్ కాలేదు. మాతో తమషా చేయడం మామూలు అయిపోయింది కానీ అది మా ఫేమ్‌ని దెబ్బతీస్తుంది’ అని రాసుకొచ్చింది. అయితే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్స్ యాక్ట్ ప్రకారం ఏదైనా మాదక ద్రవ్యం లేదా సైకోట్రోపిక్ పదార్థాన్ని వినియోగించినందుకు వివిధ సెక్షన్ల కింద ఎన్సీబీ ముగ్గురిపై కేసులు నమోదు చేసిందని తెలుస్తోంది. చదవండి: షారుక్ కొడుకు ఫోన్ సీజ్.. డ్రగ్స్ కేసులో ప్రమేయంపై విచారణ? I stand in solidarity with you @iamsrk Not that you need it. But I do. This too, shall pass. 🙏 — Pooja Bhatt (@PoojaB1972) October 3, 2021 For all those targetting #Bollywood remember all the #NCB raids on filmstars? Yes nothing was found and nothing was proved. #Bollywood gawking is a tamasha. Its the price of fame — Suchitra Krishnamoorthi (@suchitrak) October 3, 2021 Nothing harder for a parent than seeing their child in distress. Prayers to all 🙏 — Suchitra Krishnamoorthi (@suchitrak) October 3, 2021 -
సమంతకు మద్దతుగా సుచిత్ర చిత్ర ప్రదర్శన
సినీనటి సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలకు మద్దతుగా, ఆమె ఆధ్వర్యంలోని ప్రత్యూష ఫౌండేషన్‌కు నిధుల సేకరణ కోసం ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ భార్య, చిత్రకారిణి సుచిత్రా కృష్ణమూర్తి ఆదివారం నగరంలోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇదే కార్యక్రమంలో ఆమె తాను రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. సుచిత్రా కృష్ణమూర్తి చిత్రకళా ప్రదర్శన ఆదివారం రాత్రి 7.00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది వారం రోజులు కొనసాగుతుంది. తన సేవా కార్యక్రమాలకు సుచిత్ర చేయూతనివ్వడంపై సమంత హర్షం వ్యక్తం చేశారు.


