సమంతకు మద్దతుగా సుచిత్ర చిత్ర ప్రదర్శన | Sakshi
Sakshi News home page

సమంతకు మద్దతుగా సుచిత్ర చిత్ర ప్రదర్శన

Published Sun, Sep 28 2014 12:52 AM

సమంతకు మద్దతుగా సుచిత్ర చిత్ర ప్రదర్శన

సినీనటి సమంత చేస్తున్న సేవా కార్యక్రమాలకు మద్దతుగా, ఆమె ఆధ్వర్యంలోని ప్రత్యూష ఫౌండేషన్‌కు నిధుల సేకరణ కోసం ప్రముఖ దర్శకుడు శేఖర్ కపూర్ భార్య, చిత్రకారిణి సుచిత్రా కృష్ణమూర్తి ఆదివారం నగరంలోని మ్యూజ్ ఆర్ట్ గ్యాలరీలో చిత్రకళా ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇదే కార్యక్రమంలో ఆమె తాను రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించనున్నారు. సుచిత్రా కృష్ణమూర్తి చిత్రకళా ప్రదర్శన ఆదివారం రాత్రి 7.00 గంటలకు ప్రారంభమవుతుంది. ఇది వారం రోజులు కొనసాగుతుంది. తన సేవా కార్యక్రమాలకు సుచిత్ర చేయూతనివ్వడంపై సమంత హర్షం వ్యక్తం చేశారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement