breaking news
subratoray
-
6 లోగా... 600 కోట్లు కట్టాల్సిందే!
• గడువు పెంచం; కట్టకుంటే మళ్లీ జైలుకు • సహారాకు సుప్రీం కోర్టు స్పష్టీకరణ న్యూఢిల్లీ: సహారా చీఫ్ సుబ్రతోరాయ్ మళ్లీ తీవ్ర ఇబ్బందుల్లో పడుతున్నట్లు కనిపిస్తోంది. పెరోల్ పొడిగింపునకు చెల్లించాల్సిన రూ.600 కోట్లను ఫిబ్రవరి 6వ తేదీలోగా చెల్లించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. గడువును ఎంతమాత్రం పొడిగించేది లేదంటూ... డిపాజిట్ చేయలేకపోతే జైలుకు వెళ్లక తప్పదని పేర్కొంది. ఇప్పటికే ఎక్కువ ఉదారత...: ‘‘ఇప్పటికే ఇతర లిటిగెంట్ ఎవ్వరి విషయంలోనూ చూపనంత సానుకూల వైఖరిని మీ పట్ల ఈ కోర్టు ప్రదర్శించింది. మీరు డిపాజిట్ చెల్లించకుంటే, తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుంది’’ అని జస్టిస్ దీపక్ మిశ్రా, రాజన్ గొగోయ్, ఏకే సిక్రీలతో కొత్తగా ఏర్పాటయిన త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. పెరోల్ పొడిగింపునకు రాయ్ తరఫు న్యాయవాది పదేపదే అభ్యర్థించిన నేపథ్యంలో అత్యున్నత న్యాయస్థానం ఈ విధంగా స్పందించింది. -
సుప్రీంకు విన్నవించిన అంశాలపై ‘మీడియా’లో చర్చ సరికాదు: సహారా
న్యూఢిల్లీ: తమ చీఫ్ సుబ్రతోరాయ్ విడుదల బెయిల్‌కు రూ.10,000 కోట్ల సమీకరణ అంశాలపై సుప్రీంకోర్టు ముందు పేర్కొన్న అంశాలపై బహిరంగ చర్చ, మీడియా ఊహాగానాలు సరికాదని సహారా పేర్కొంది. ఆయా అంశాలు పూర్తిగా కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని పేర్కొంది. సహారా నిధుల సమీకరణపై పెద్ద ఎత్తున సందేహాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. నిధుల సమీకరణకు సుప్రీంకోర్టుకు తాజాగా సంస్థ ఒక ప్రతిపాదనను తెలియజేసింది. చైనా బ్యాంక్ నుంచి సహారా ఆస్తుల తనఖా విడుదలకు స్పెయిన్ బ్యాంక్ బీబీవీఏ రుణం అందించనుందన్నది దీని సారాంశం. అయితే తమ వద్ద ఇటువంటి ప్రతిపాదన ఏదీ లేదని బీబీవీఏ పేర్కొన్నట్లు స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నుంచి వార్తలు వెలువడుతున్నాయి. ఇక హెచ్ఎస్బీసీ రూ.5,000 కోట్లకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వనుందని సహారా పేర్కొంటున్నప్పటికీ, ఆ బ్యాంకు నుంచి సైతం ఈ మేరకు ఎటువంటి ప్రకటనా వెలువడలేదు. హెచ్ఎస్బీసీ ప్రతినిధి అసలు దీనిపై ఎటువంటి వ్యాఖ్యా చేయడానికి నిరాకరించగా, పేరు తెలపడానికి ఇష్టపడని మరో అధికారి అసలు ఇటువంటి ప్రతిపాదనే తమ వద్ద లేదని పేర్కొన్నారు. విదేశాల్లోని ఆస్తుల అమ్మకం, బెయిల్‌కు నిధుల సమీకరణకు సోమవారం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మూడు నెలల సమయం ఇచ్చింది.