breaking news
Subhamuhurtalu
-
December 2022: వచ్చేస్తున్నాయ్.. కల్యాణ ఘడియలు
సాక్షి, హైదరాబాద్: భాగ్యనగరానికి పెళ్లి కళ రానుంది. మరికొద్ది రోజుల్లో నగరమంతటా బాజాభజంత్రీలు మోగనున్నాయి. మూఢాల కారణంగా మూడు నెలలుగా శుభ కార్యాలు నిలిచిపోయాయి. ఈ నెలాఖరుతో అవి తొలగిపోనున్నాయి. దీంతో డిసెంబరు మొదటి వారం నుంచి పెద్ద సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఇప్పటికే నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫంక్షన్ హాళ్లు. కల్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు బుక్ అయ్యాయి. మరోవైపు కొంతకాలంగా స్తబ్దత నెలకొన్న మార్కెట్లు సైతం క్రమంగా కళకళలాడుతున్నాయి. డిసెంబరు నెలలో కేవలం 5 ముహూర్తాలే ఉండడంతో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. ఈ మేరకు ఒక్కో ఫంక్షన్ హాల్లో రోజుకు కనీసం రెండు పెళ్లిళ్ల చొప్పున బుక్ అయినట్లు నిర్వాహకులు చెబుతున్నారు. డిసెంబరు తర్వాత తిరిగి ఫిబ్రవరి వరకు ముహూర్తాలు లేకపోవడంతోనూ డిమాండ్ ఎక్కువగా ఉన్నట్లు పురోహితులు పేర్కొన్నారు. ఉందిలే మంచి ముహూర్తం.. సాధారణంగా కార్తీకమాసంలో పెళ్లిళ్లు పెద్ద ఎత్తున జరుగుతాయి. కానీ.. ఈసారి శుభకార్యాలకు ఎంతో అనుకూలమైన కార్తీక మాసంలో మూఢాలు ఉండడంతో పెళ్లిళ్లతో పాటు గృహ ప్రవేశాలు వంటి కార్యక్రమాలు కూడా జరగలేదు. అన్ని రకాల శుభ కార్యక్రమాలను నగరవాసులు వాయిదా వేసుకున్నారు. సెప్టెంబరు 22న మొదలైన మూఢాలు ఈ నెల 27 వరకు ఉన్నాయి. దీంతో అందరూ డిసెంబరు ముహూర్తాల కోసమే ఎదురు చూస్తున్నారు. దృక్ సిద్ధాంతం మేరకు డిసెంబరులో 4, 8, 14, 17, 18వ తేదీల్లో దివ్యమైన ముహూర్తాలు ఉన్నట్లు ప్రముఖ వేదపండితులు చిర్రావూరి శివరామకృష్ణ తెలిపారు. పూర్వ సిద్ధాంతం ప్రకారం ఈ నెలలో మరికొన్ని అదనపు ముహూర్తాలు కూడా ఉన్నప్పటికీ ఈ అయిదే ముఖ్యమైనవి కావడంతో ఆయా రోజుల్లోనే ఎక్కువ పెళ్లిళ్లు జరగనున్నట్లు పేర్కొన్నారు. వీటిలో ఎక్కువ శాతం కన్య రాశి, సింహరాశి ముహూర్తాలే ఉన్నాయి. 4వ తేదీ రాత్రి 11.30 గంటలకు, తిరిగి తెల్లవారు జామున ఒంటిగంటకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ►8వ తేదీ గురువారం రాత్రి 11.38 గంటలకు కన్యా లగ్నం, రాత్రి 1.20 గంటలకు నిశీధి ముహూర్తం ఉన్నట్లు పురోహిత వర్గాలు పేర్కొన్నాయి. 14వ తేదీన బుధవారం, మహానక్షత్రం రాత్రి 11.27 గంటలకు మంచి ముహూర్తం ఉంది. 17వ తేదీ రాత్రి హస్తా నక్షత్రం, రాత్రి 11.15 గంటలకు, 18వ తేదీ ఆదివారం చిత్ర నక్షత్రంలో రాత్రి 11.11 గంటలకు,. తిరిగి అర్ధరాత్రి 12.47కు సింహలగ్నం ఉన్నట్లు తెలిపారు. ఆ తర్వాత జనవరి 26వ తేదీ వరకు ఎలాంటి పెళ్లి ముహూర్తాలు లేవు. తిరిగి ఫిబ్రవరి నెలలోనే మరోసారి బాజాభజంత్రీలు మోగనున్నాయి. దీంతో డిసెంబరు ముహూర్తాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంది. ►డిసెంబరు నెలలో వేల సంఖ్యలో పెళ్లిళ్ల కోసం సుమారు 10 వేలకు పైగా ఫంక్షన్ హాళ్లు. మండపాలు తదితర వేదికలు ఇప్పటికే బుక్ అయ్యా యి. సుమారు 25 వేలకు పైగా జంటలు ఈ నెలలో ఒక్కటి కానున్నట్లు పురోహితులు అంచనా వేస్తున్నారు. కానీ.. ఈ సంఖ్య ఇంకా పెరి గే అవకాశం కూడా ఉంది. అలాగే ఫంక్షన్ హాళ్ల కు సైతం ఇంకా డిమాండ్ పెరగనుంది. వస్త్ర దుకాణాలు, బంగారు ఆభరణాల దుకాణాలు, ఇతర మార్కెట్లలో సైతం గిరాకీ ఊపందుకోనుంది. ముహూర్తాలు కూడా కలిసి రావచ్చు దృక్ సిద్ధాంతం ప్రకారం డిసెంబరులో 5 ముహూర్తాలే ఉన్నాయి. కానీ కొందరు పురోహితులు పూర్వసిద్ధాంతాన్ని అనుసరించి ముహూర్తాలను నిర్ణయిస్తారు. ఈ మేరకు డిసెంబరులో మరిన్ని ముహూర్తాలు కూడా ఉండవచ్చు. – చిర్రావూరి శివరామకృష్ణ, వేద పండితులు -
ముహూర్తాల్లేవ్.. శుభకార్యాలకు బ్రేక్
సాక్షి, విద్యానగర్(కరీంనగర్): శ్రావణంలో 15 రోజులపాటు భాజాభజంత్రీలు మోగగా సోమవారం నుంచి డిసెంబర్ 2 వరకు ముహూర్తాలు లేవు. తిరిగి డిసెంబర్ 3 నుంచి 19వ తేదీ వరకు పది ముహూర్తాలే ఉన్నాయి. అప్పటివరకు శుభకార్యాలకు ఆగాల్సిందే. ఈ నెల 24వ తేదీ పవిత్ర శ్రావణ బహుళ ద్వాదశీ బుధవారం పునర్వసు నక్షత్రంతో పెళ్లిళ్లు కాకుండా ఇతర కార్యక్రమాలకు సంబంధించి మంచిరోజులూ ముగుస్తాయి. సెప్టెంబర్ 17 నుంచి శుక్ర మౌఢ్యమి సెప్టెంబర్ 17 భాద్రపద బహుళ సప్తమి నుంచి శుక్ర మౌఢ్యమి ప్రారంభమై అక్టోబర్లో వచ్చే అశ్వయుజ, నవంబర్లో వచ్చే పావన కార్తీక మాసాల్లోనూ కొనసాగుతుంది. మార్గశిర శుద్ధ దశమి డిసెంబర్ 2న ఇది ముగుస్తుంది. డిసెంబర్ 24 నుంచి పుష్యమాసం పుష్యమాసం డిసెంబర్ 24 నుంచి ప్రారంభమై జనవరి 21వ తేదీ వరకు ఉంటుంది ఈ రోజుల్లో శుభముహ్తూరాలు లేవు. తిరిగి జనవరి 22 నుంచి మాఘమాసం ప్రారంభమై, మార్చి 19 వరకు వరుసగా అన్నీ మంచి రోజులే. వివాహాది, సమస్త శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఈ నెల చివరలో పండుగలు ►25న మాసశివరాత్రి ►27న పొలాల అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది. ►30న కుడుముల తదియ ►31న వినాయక చతుర్థి, నవరాత్రోత్సవాలు ప్రారంభం ►సెప్టెంబర్ 9న నిమజ్జనోత్సవం. అస్తమించని మౌఢ్యం.. శుక్రాస్తమయం అస్తమించిన మౌఢ్యమని, దీన్నే శుక్ర మౌఢ్యమి అని అంటారు. ఇది ఉన్న కాలంలో గ్రహాలు çశుభ ఫలితాలు ఇవ్వవు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేపట్టవద్దు. కొత్తగా ఎలాంటి పనులు ప్రారంభించకూడదు. – మంగళంపల్లి శ్రీనివాసశర్మ, నగర వైదిక పురోహితుడు, కరీంనగర్ డిసెంబర్లోనే ముహూర్తాలు.. శ్రావణంలో శుభకార్యాలకు ముహూర్తాలు సోమవారంతో ముగుస్తాయి. మళ్లీ డిసెంబర్ వచ్చే మార్గశిర వరకు ఆగాల్సిందే. ఆ నెలలోనూ కేవలం 10 రోజులే ముహూర్తాలున్నాయి. మళ్లీ జనవరి 22 నుంచి మాఘమాసంలో ఉంటాయి. – పవనకృష్ణ శర్మ, ప్రధానార్చకుడు, శ్రీదుర్గాభవాని ఆలయం, నగునూర్, కరీంనగర్ -
మూడు ముళ్లకు వేళాయె!.. నేటి నుంచి జూన్ 23 వరకు శుభ దినాలే
సాక్షి, ఆళ్లగడ్డ రూరల్: మాంగల్యం తంతునా.. మమ జీవనం హేతునా.. కంఠే భద్మామి సుభగే...త్వం జీవ శరశరం.. అంటూ పెళ్లిలో వినిపించే మంత్రాలు ఈ సారి మారుమోగనున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి పూర్తిగా దూరం కావడంతో పల్లెల్లో, పట్టణాల్లో పరిణయ ఝరి పరిమళించనుంది. గత రెండేళ్లలో కేవలం వధూవరుల బంధువులు 10 నుంచి 20 మందికి మాత్రమే అనుమతులు ఉండటంతో పెళ్లిళ్లలో కళ తప్పింది. ఈసారి ఏప్రిల్ 13 నుంచి జూన్ 23 వరకు శుభ ముహూర్తాలు ఉన్నాయి. దీంతో యువతీ యువకులు, తల్లిదండ్రులు సంబర పడుతున్నారు. మొదలైన సందడి ఇప్పటికే కొందరు పెళ్లికార్డులు ఆర్డర్లు ఇస్తూనే కల్యాణ మండపాలు అడ్వాన్సులు ఇచ్చి మరీ బుక్ చేసుకోవడం మొదలెట్టారు. మంచి ముహూర్తం కోసం పురోహితులను కలుసుకోవడం ముమ్మరం చేస్తున్నారు. మేమేం తక్కువా అంటూ మహిళలు కొందరు బంగారు నగలు కొంటుంటే... మరికొందరు చీరలు కొనడం మొదలు పెట్టారు. ఇలా ఎవరి పనుల్లో వారు బిజీబిజీగా ఉన్నారు. ఒక పెళ్లి ఎంతో మందికి ఉపాధి పెళ్లంటే రెండు కుటుంబాలు కలవడం అంటారు. అంతేకాదు పెళ్లి ఏర్పాట్లలో ఎంతో మందికి ఉపాధి లభిస్తుంది. పెళ్లంటే ముందుగా గుర్చొచ్చేవి పెళ్లి పత్రికలు, నూతన పట్టు చీరలు, వధూవరుల పరిణయ పట్టు వస్త్రాలు, ఫొటోలు, వీడియోలు, ట్రావెల్స్ ఏజెంట్లు, పెళ్లి మండపాలు, పురోహితులు, సాంస్కృతిక కళాకారులు, ఎలక్రీ షియన్స్, బ్యాండ్ మేళం వారు. వీరంతా రెండేళ్లుగా ఉపాధి లేక అగచాట్లు పడ్డారు. ప్రస్తుతం ముహూర్తాలు ఉండటంతో ఉపాధి దొరుకుతుందని వారంతా సంబర పడుతున్నారు. మూడు నెలలు ముహూర్తాలే శుభకృత్ నామ సంవత్సరంలో వివాహాలు, శుభకార్యాల ముహూర్త తేదీలు ఏప్రిల్ : 13, 14, 15, 16, 17, 21, 22, 24 మే : 3, 4, 13, 14, 15, 18, 20, 21, 22, 25 జూన్ : 1, 3, 5 8, 9, 10, 15, 17, 18, 19, 22, 23 శుభలేఖలకు ఆర్డర్లు ఇస్తున్నారు ఇప్పటికే పెళ్లిళ్లు, వివిధ శుభ కార్యక్రమాల కోసం ఆహ్వాన పత్రికలు, పెళ్లి పత్రికల కోసం ఆర్డర్లు వస్తున్నాయి. ప్రస్తుతం పోటీ ప్రపంచంలో వివిధ రకాల డిజైన్లతో శుభలేఖలు సిద్ధం చేశాం. రూ.5 నుంచి రూ.వందల విలువైన పత్రికలు అందుబాటులో ఉంచాం. ఈసారి కరోనా లేనందున వ్యాపారాలు బాగా జరుగుతాయని ఆశిస్తున్నాం. –ప్రసాద్, పెళ్లి పత్రికల ప్రింటర్స్, ఆళ్లగడ్డ మెండుగా శుభకార్యాలు ఈసారి శుభముహూర్తాలు మూడు నెలల్లో మెండుగా ఉన్నాయి. పెళ్లిళ్లు, వివిధ శుభకార్యాలకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ముఖ్యంగా వేసవిలో పనులు ఉండవు కాబట్టి పెళ్లిళ్లకు ఏప్రిల్, మే, జూన్ నెలలు వరంలా మారనున్నాయి. ఇప్పటికే చాలా మంది పెళ్లి, శుభ కార్యాలకు ముహుర్తాలకు సంబంధించి లగ్నపత్రికలు రాయించుకుంటున్నారు. –విజయ్స్వామి, పురోహితుడు, అహోబిలం -
శ్రీ జయ నామ సంవత్సరం - శుభముహూర్తాలు 2014 -15
చైత్ర మాసం ఏప్రిల్ 4 శుక్ర, శు.పంచమి, రోహిణి నక్షత్రం, మిథున లగ్నం ప.11.54కు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. 5 శని, షష్టి తత్కాల సప్తమి, మృగశిర నక్షత్రం మకర లగ్నం రా.2.12కు వివాహాలు. 9 బుధ, దశమి, పుష్యమి నక్షత్రం, వృషభలగ్నం ఉ.8.53కు అన్నప్రాశన, శంకుస్థాపన, ఉపనయన, గృహప్రవేశాలు, క్రయవిక్రయాలు. 10 గురు, దశమి తత్కాల ఏకాదశి, మఖ నక్షత్రం, వృశ్చిక లగ్నం రా.9.09కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు, 11 శుక్ర, ఏకాదశి తత్కాల ద్వాదశి మఖ నక్షత్రం, మిథున లగ్నం ప.11.31కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, ఉపనయన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. 17 గురు, బ.విదియ తత్కాల తదియ, అనూరాధ నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.11.53కు వివాహ, గృహప్రవేశాలు. 20 ఆది, పంచమి తత్కాల షష్టి , మూల నక్షత్రం, కర్కాటక లగ్నం ప.11.54కు అన్నప్రాశన, క్రయవిక్రయాలు, సాధారణ పనులు. 21 సోమ, సప్తమి, ఉత్తరాషాఢ నక్షత్రం, రా.11.34కు గర్భాదాన, గృహప్రవేశాలు. 22 గురు, దశమి, ధనిష్ట నక్షత్రం, వృషభలగ్నం ఉ.7.50కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహాలు, ఉపనయనాలు. తిరిగి రా.11.22కు శతభిషం నక్షత్రం, ధనుస్సు లగ్నంలో వివాహ, గృహప్రవేశ, గర్భాదానాలు. 25 శుక్ర, ఏకాదశి, శతభిషం నక్షత్రం, వృషభలగ్నం ఉ.7.45కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, దేవతాప్రతిష్ఠలు. వైశాఖ మాసం మే 1 గురు,శు.విదియ తత్కాల తదియ, రోహిణి నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.10.54కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు., రా.12.34కు మకరలగ్నంలో వివాహాలు. 2 శుక్ర, తదియ తత్కాల చవితి, మృగశిర నక్షత్రం, వృశ్చిక లగ్నం రా.7.40కు వివాహ, గృహప్రవేశాలు, మకర లగ్నం రా.12.21కు వివాహాలు. 5 సోమ, షష్టి, పునర్వసు నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.54కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, దేవతాప్రతిష్ట, క్రయవిక్రయాలు. పుష్యమి నక్షత్రం, వృశ్చికలగ్నంలో రా.7.29కు గర్భాదానం. 7 బుధ, అష్టమి తత్కాల నవమి, మఖ నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.10.32కు వివాహ, గర్భాదానాలు. 8 గురు, నవమి, మఖ నక్షత్రం, వృశ్చికలగ్నం రా.7.16కు వివాహ, గృహప్రవేశ, గర్భాదానాలు. 10 శని, ఏకాదశి, ఉత్తర నక్షత్రం, మిథున లగ్నం ఉ.9.34కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 12 సోమ, త్రయోదశి, చిత్త నక్షత్రం, మిథున లగ్నం ఉ.9.36కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 15 గురు, బ.పాడ్యమి, అనూరాధ నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.18కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, వివాహాలు, క్రయవిక్రయాలు. రా.9.59కు ధనుస్సు, రా.11.28కు మకరలగ్నాలలో వివాహ, గర్భాదానాలు. 17 శని, తదియ, మూల నక్షత్రం, మిథునలగ్నం ఉ.9.09కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, వివాహ, క్రయవిక్రయాలు. రా.11.24కు మకరలగ్నంలో వివాహాలు. 19 సోమ, పంచమి, ఉత్తరాషాఢ నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.9.54కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 22 గురు, అష్టమి తత్కాల న వమి, శతభిషం నక్షత్రం, మిథునలగ్నం ఉ.8.48కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, వివాహాలు. 23 శుక్ర, నవమి తత్కాల దశమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, మకర లగ్నం రా.10.58కు వివాహాలు, గర్భాదానాలు. జ్యేష్ఠ మాసం జూన్ 1 ఆది, శు.చవితి, పునర్వసు నక్షత్రం, మిథునలగ్నం ఉ.8.09కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, క్రయవిక్రయాలు. 2 సోమ, పంచమి, పుష్యమి నక్షత్రం, మిథునలగ్నం ఉ.8.06కు అన్నప్రాశ న, అక్షరస్వీకార, శంకుస్థాపన, గృహప్రవేశాలు, దేవతాప్రతిష్ట, ఉపనయనాలు. తిరిగి రా.10.18కు మకరలగ్నంలో గృహప్రవేశాలు. 4 బుధ, షష్టి తత్కాల సప్తమి, మఖ నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.8.52కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, గృహప్రవేశాలు, వివాహ, ఉపనయనాలు. 12 గురు, చతుర్దశి, అనూరాధ నక్షత్రం, మిథునలగ్నం ఉ.7.29, కర్కాటక లగ్నం 8.26కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, శంకుస్థాపన, గృహప్రవేశాలు, క్రయవిక్రయాలు. 13 శుక్ర, పౌర్ణమి తత్కాల బ.పాడ్యమి, మూల నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.8.09కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు. 14 శని,బ. పాడ్యమి తత్కాల విదియ, మూల నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.8.19కు అన్నప్రాశన, అక్షరస్వీకార, శంకుస్థాపన, ఉపనయన, వివాహాలు, క్రయవిక్రయాలు. 16 సోమ, చవితి, ఉత్తరాషాఢ నక్షత్రం, కర్కాటకలగ్నం ఉ.8.09కు అన్నప్రాశన, అక్షరస్వీకార, ఉపనయన, శంకుస్థాపన, క్రయవిక్రయాలు. 20 శుక్ర అష్టమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, సింహలగ్నం ఉ.11.09కు అన్నప్రాశన, ఉపనయన, అక్షరస్వీకార, వివాహాలు. తె.4.05కు రేవతి నక్షత్రం, వృషభలగ్నంలో శంకుస్థాపన, గృహప్రవేశ, శంకుస్థాపనలు. 21 శని, నవమి, రేవతి నక్షత్రం, సింహలగ్నం ఉ.11.02కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశాలు, క్రయవిక్రయాలు. తె.4.03కు అశ్వని నక్షత్రం, వృషభలగ్నంలో శంకుస్థాపన, వివాహాలు. 22 ఆది, దశమి, అశ్వని నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.7.44కు అన్నప్రాశన, అక్షరస్వీకార, వివాహ, ఉపనయన, శంకుస్థాపన, దేవతా ప్రతిష్టలు, క్రయవిక్రయాలు. ఆషాఢమాసం జూలై 2 బుధ,శు.పంచమి, మఖ నక్షత్రం, కర్కాటక లగ్నం, ఉ.7.09కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. 4 గురు, సప్తమి, ఉత్తర నక్షత్రం, సింహ లగ్నం ఉ.10.10కు అన్నప్రాశన, క్రయవిక్రయాలు, ప.3.34కు వృశ్చిక లగ్నంలో క్రయవిక్రయాలు. 7 సోమ, దశమి, స్వాతి నక్షత్రం, సింహలగ్నం ఉ.9.57కు అన్నప్రాశన, క్రయవిక్రయాలు. 13 ఆది, బ.పాడ్యమి, ఉత్తరాషాఢ నక్ష త్రం, కర్కాటక లగ్నం ఉ.6.24కు సాధారణ కార్యాలు, ప.2.58కు వృశ్చిక లగ్నంలో క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. 14 సోమ, విదియ, శ్రవణం నక్షత్రం, కర్కాటక లగ్నం ఉ.6.19కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. 18 శుక్ర, సప్తమి, రేవతి నక్షత్రం, వృశ్చికలగ్నం ప.2.42కు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. రిజిస్ట్రేషన్లు. శ్రావణమాసం ఆగస్టు 1 శుక్ర, శు.పంచమి తత్కాల షష్టి, హస్త నక్షత్రం, ధనుస్సు లగ్నం సా.4.56కు క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు. 10 ఆది, పౌర్ణమి, శ్రవణం నక్షత్రం, కుంభలగ్నం రా.8.10కు సాధారణ కార్యాలు, శుభకార్యాల ప్రస్తావన. 11 సోమ, బ.పాడ్యమి, ధనిష్ఠ నక్షత్రం, సింహలగ్నం ఉ.7.43కు అన్నప్రాశన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. రా.12.44కు వృషభలగ్నంలో గృహప్రవేశాలు. 13 బుధ, చవితి, ఉత్తరాభాద్ర నక్షత్రం, కుంభలగ్నం రా.7.54కు వివాహ, గర్భాదాన, గృహప్రవేశాలు. రా.12.32కు వృషభలగ్నంలో వివాహ, గృహప్రవేశాలు. 14 గురు, చవితి, రేవతి నక్షత్రం, కుంభలగ్నం రా.7.54కు, వృషభలగ్నం రా.12.32కు, మిథున లగ్నం తె.3.21కు వివాహ, గృహప్రవేశాలు, 15 శుక్ర, పంచమి, రేవతి నక్షత్రం ధనుస్సు లగ్నం సా.4.03 క్రయవిక్రయాలు, అగ్రిమెంట్లు, సాధారణ కార్యాలు. తె.3.17 మిథునలగ్నం వివాహాలు. 20 బుధ, దశమి, మృగశిర నక్షత్రం, కన్యాలగ్నం ఉ.8.43కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. భాద్రపద మాసం సెప్టెంబర్ 1 సోమ, శు.సప్తమి, అనూరాధ నక్షత్రం, మకరలగ్నం సా.4.24కు వ్యాపారాలు, ఆర్థిక వ్యవహారాలు. 5 శుక్ర, ఏకాదశి, ఉత్తరాషాఢ నక్షత్రం మకరలగ్నం సా.4.18కు సాధారణ కార్యాలు, వ్యాపారాలు. 6 శని, ద్వాదశి, శ్రవణం నక్షత్రం, వృశ్చికలగ్నం ప.11.23కు అన్నప్రాశన, వ్యాపారాలు, ఆర్ధిక వ్యవహారాలు. 10 బుధ, బ.పాడ్యమి తత్కాల విదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం, మకర లగ్నం ప.3.49కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 12 శుక్ర, చవితి, అశ్వని నక్షత్రం, మకరలగ్నం ప.3.42కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. ఆశ్వయుజ మాసం సెప్టెంబర్ 26 శుక్ర, శు.విదియ తత్కాల తదియ, చిత్త నక్షత్రం, మకరలగ్నం ప.2.47కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 27 శని, తదియ, స్వాతి నక్షత్రం, ధనుస్సు లగ్నం ప.1.12కు వ్యాపార, సాధారణ కార్యాలు. ఆర్థిక లావాదేవీలు. అక్టోబర్ 1 బుధ, ఆశ్వయుజ శు.సప్తమి, మూల నక్షత్రం, మకరలగ్నం ప.2.27కు వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 3 శుక్ర, నవమి తత్కాల దశమి, ఉత్తరాషాఢ నక్షత్రం, కుంభలగ్నం సా.4.35కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 5 ఆది, ద్వాదశి, ధనిష్ఠ నక్షత్రం, ధనుస్సు లగ్నం ప.12.40కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. 8 బుధ, పౌర్ణమి, రేవతి నక్షత్రం, కుంభలగ్నం సా.4.17కు వ్యాపారాలు, ఆర్థిక లావాదే వీలు. 9 గురు, బ.పాడ్యమి, ఆశ్వని నక్షత్రం, ధనుస్సులగ్నం ప.12.24కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. 17 శుక్ర, నవమి, పుష్యమి నక్షత్రం, ధనుస్సు లగ్నం ప.11.54కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. 19 ఆది, ఏకాదశి, మఖ నక్షత్రం, మకర లగ్నం ప.1.16కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. కార్తీక మాసం అక్టోబర్ 26 ఆది, శు.తదియ, అనూరాధ నక్షత్రం, మకర లగ్నం ప.12.48కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 30 గురు, సప్తమి, ఉత్తరాషాఢ నక్షత్రం, వృశ్చికలగ్నం ఉ.7.48కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. నవంబర్ 1 శని, కార్తీక శు.నవమి, ధనిష్ట నక్షత్రం, కుంభలగ్నం ప.2.43కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 5 బుధ, త్రయోదశి, రేవతి నక్షత్రం, మీన లగ్నం ప.3.09కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. 6 గురు, పౌర్ణమి, అశ్వని నక్షత్రం, మకరలగ్నం ప.12.04కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. రిజిస్ట్రేషన్లు. 9 ఆది, బ.తదియ, రోహిణి నక్ష త్రం, మకరలగ్నం ప.11.50కు సాధారణ కార్యాలు, ఆర్థిక, వ్యాపార లావాదేవీలు. 13 గురు, సప్తమి, పుష్యమి నక్షత్రం మకరలగ్నం ప.11.36కు అన్నప్రాశన, వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 17 సోమ, దశమి, ఉత్తర నక్షత్రం, మకరలగ్నం ఉ.11.17కు సాధారణ కార్యాలు, అన్నప్రాశనలు, వ్యాపారాలు. మార్గశిర మాసం డిసెంబర్ 3 బుధ, శు.ద్వాదశి, అశ్వని నక్షత్రం, ధనుస్సు లగ్నం ఉ.8.48కు అన్నప్రాశన, వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 7 ఆది, బ.పాడ్యమి, మృగశిర నక్షత్రం, ధనుస్సు లగ్నం ఉ.8.32కు అన్నప్రాశన, గృహప్రవేశ, వివాహ, వ్యాపారాలు. సింహలగ్నంలో రా.11.55కు వివాహ, గృహప్రవేశాలు. 10 బుధ, చవితి, పుష్యమి నక్షత్రం ధనుస్సు లగ్నం ఉ.8.19కు అన్నప్రాశన, గృహప్రవేశాలు, వ్యాపార లావాదేవీలు. తులాలగ్నం తె.4.12కు గృహప్రవేశాలు. 12 శుక్ర, షష్టి, మఖ నక్షత్రం, తులాలగ్నం తె.4.07కు వివాహ, గృహప్రవేశాలు. 13 శని, సప్తమి, పుబ్బ నక్షత్రం, కుంభలగ్నం ప.11.54కు సాధారణ కార్యాలు. 14 సోమ, నవమి, ఉత్తర నక్షత్రం, ధనుస్సులగ్నం ఉ.7.57కు, కుంభలగ్నం ఉ.11.46కు అన్నప్రాశన, గృహప్రవేశాలు,క్రయవిక్రయాలు. 17 బుధ, దశమి, తత్కాల ఏకాదశి, చిత్త నక్షత్రం, మేషలగ్నం ప.2.54కు వ్యాపారాలు, సాధారణ కార్యాలు. పుష్యమాసం డిసెంబర్ 24 బుధ, శు.తదియ, ఉత్తరాషాఢ నక్షత్రం, కుంభలగ్నం ప.11.14కు అన్నప్రాశన, వ్యాపార, ఆర్థిక లావాదేవీలు. 26 శుక్ర, పంచమి, ధనిష్ట నక్షత్రం, కుంభలగ్నం ప.11.06కు అన్నప్రాశన, సాధారణ కార్యాలు. 27 శని, షష్టి, శతభిషం నక్షత్రం, కుంభలగ్నం ప.11.03కు అన్నప్రాశన, వ్యాపార లావాదేవీలు. 28 ఆది, సప్తమి, ఉత్తరాభాద్ర నక్షత్రం, మేషలగ్నం ప.2.10కు వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీలు. జనవరి - 2015 7 బుధ, బ.విదియ, పుష్యమి నక్షత్రం, మకరలగ్నం ఉ.8.02 అన్నప్రాశన, వ్యాపారాదులు. 11 ఆది, షష్టి, ఉత్తర నక్షత్రం, మీనలగ్నం ఉ.10.44కు సాధారణ కార్యాలు. మాఘమాసం జనవరి 22 గురు, శు.తదియ, ధనిష్ఠ నక్షత్రం,, మిథునలగ్నం సా.4.44కు క్రయవిక్రయాలు, వ్యాపారాదులు. ధనుస్సు లగ్నం తె.5.30గంటలకు వివాహ, శంకుస్థాపన, గృహప్రవేశాలు. 24 శని, చవితి తత్కాల పంచమి,ఉత్తరాభాద్ర నక్షత్రం, తులాలగ్నం రా.1.15 వివాహాలు. 25 ఆది, పంచమి, రేవతి నక్షత్రం తులాలగ్నం రా.1.11 వివాహాలు. 29 గురు, దశమి, రోహిణిన క్షత్రం, ధనుస్సు లగ్నం తె.5.02 వివాహాలు, గృహప్రవేశాలు. 30 శుక్ర, ఏకాదశి తత్కాల ద్వాదశి, మృగశిర నక్షత్రం, ధనుస్సు లగ్నం తె.5.01 వివాహాలు, గృహప్రవేశాలు. 31 శని, ద్వాదశి, మృగశిర నక్షత్రం, మేషలగ్నం ఉ.11.53 ఉపనయనం, వివాహ, గృహ ప్రవేశాలు. ఫిబ్రవరి 2 సోమ, చతుర్దశి, పుష్యమి నక్షత్రం, తులాలగ్నం రా.12.41 గృహప్రవేశాలు. 4 బుధ, బ.పాడ్యమి, మఖ నక్షత్రం, తులాలగ్నం రా.12.34 వివాహాలు,ధనుస్సు లగ్నం తె.4.41 వివాహాలు, గృహప్రవేశాలు. 6 శుక్ర, బ.విదియ తత్కాల తదియ, ఉత్తర నక్షత్రం, ధనుస్సు లగ్నం తె.4.32 వివాహాలు, గృహప్రవేశాలు. 9 సోమ, బ.పంచమి, చిత్త నక్షత్రం,, మేషలగ్నం ఉ.11.22 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయన, శంకుస్థాపన, గృహప్రవేశాలు. 11 బుధ, బ.సప్తమి, స్వాతి నక్షత్రం, మేషలగ్నం ఉ.11.11 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు, శంకుస్థాపనలు. 12 గురు, అష్టమి తత్కాల నవమి అనూరాధ నక్షత్రం, ధనుస్సు లగ్నం తె.4.09 వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు. 14 శని, దశమి తత్కాల ఏకాదశి, మూల నక్షత్రం, మకర లగ్నం తె.5.31 వివాహాలు, గృహప్రవేశాలు, శంకుస్థాపనలు. 15 ఆది, ఏకాదశి, మూల నక్షత్రం, మేషలగ్నం ఉ.10.54 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు, శంకుస్థాపనలు. ఫాల్గుణమాసం ఫిబ్రవరి 21 శని, శు.తదియ, ఉత్తరాభాద్ర నక్షత్రం, తులాలగ్నం రా.11.26 వివాహాలు, ధనుస్సులగ్నం తె.3.33 వివాహాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు. 22 ఆది, శు.చవితి, రేవతి నక్షత్రం, తులాలగ్నం రా.11.22 వివాహాలు, గర్భాదానాలు. 25 బుధ, శు.సప్తమి తత్కాల అష్టమి, రోహిణి నక్షత్రం, తులాలగ్నం రా.11.10 వివాహాలు. మార్చి 1 ఆది, శు.ఏకాదశి తత్కాల ద్వాదశి, పునర్వసు నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.10.49 శంకుస్థాపనలు, గృహప్రవేశాలు. 2 సోమ, ద్వాదశి తత్కాల త్రయోదశి, పుష్యమి నక్షత్రం,, ధనుస్సు లగ్నం రా.2.57 శంకుస్థాపన, గృహప్రవేశాలు. 4 బుధ, చతుర్దశి, మఖ నక్షత్రం, తులాలగ్నం రా.10.41 వివాహాలు, ధనుస్సు లగ్నం రా.2.48 వివాహాలు, శంకుస్థాపన, గృహప్రవేశాలు. 6 శుక్ర, బహుళ పాడ్యమి, ఉత్తర నక్షత్రం, ధనుస్సు లగ్నం రా.2.39 వివాహాలు,శంకుస్థాపన, గృహప్రవేశాలు. 7 శని, విదియ, ఉత్తర నక్షత్రం మేష లగ్నం ఉ.9.35 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, శంకుస్థాపనలు. ధనుస్సు లగ్నం రా.2.37 వివాహాలు, శంకుస్థాపనలు, గృహప్రవేశాలు. 8 ఆది, తదియ, హస్త నక్షత్రం, మేషలగ్నం ఉ.9.30 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయనం, వివాహాలు, శంకుస్థాపనలు. రా.10.24 చిత్త నక్షత్రం, తులా లగ్నంలో వివాహాలు. 9 సోమ, చవితి, చిత్త నక్షత్రం, మేష లగ్నం ఉ.9.26 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, ఉపనయన, శంకుస్థాపన, వ్యాపారాలు. 11 బుధ, పంచమి తత్కాల షష్టి, అనూరాధ నక్షత్రం తులాలగ్నం రా.10.12 వివాహాలు. 12 గురు, షష్టి తత్కాల సప్తమి, అనూరాధ నక్షత్రం మేష లగ్నం ఉ.9.15 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వివాహాలు, ఉపనయనం, శంకుస్థాపనలు. 14 శని, నవమి, మూల నక్షత్రం, మేషలగ్నం ఉ.9.07 అన్నప్రాశన, అక్షరాభ్యాసం, వివాహాలు ఉపనయనం శంకుస్థాపనలు. 15 ఆది, దశమి, ఉత్తరాషాఢ నక్షత్రం ధనుస్సు లగ్నం రా.2.03 వివాహ, గృహప్రవేశాలు.