breaking news
Straight Film
-
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా!
‘‘నేను తెలుగులో స్ట్రయిట్ ఫిలిం చేస్తానని చెప్పా. ఇచ్చిన మాట ప్రకారం ఈ సినిమా చేశాను. నన్ను స్టార్ చేసిన తెలుగు ప్రేక్షకుల కోసం ఈ సినిమా చేశాను’’ అని కమల్‌హాసన్ అన్నారు. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, శ్రీ గోకులం మూవీస్ సంయుక్తంగా రాజేష్ ఎం సెల్వ దర్శకత్వంలో ఎస్. చంద్రహాసన్, కమల్‌హాసన్ నిర్మించిన చిత్రం ‘చీకటి రాజ్యం’. కమల్‌హాసన్, త్రిష, ప్రకాశ్‌రాజ్, మధుశాలిని ముఖ్య తారలుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్, మేకింగ్ వీడియోను సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. కమల్‌హాసన్ మాట్లాడుతూ - ‘‘నేను నేషనల్ స్టార్‌గా మొదలైంది తెలుగు సినిమాలతోనే. రికార్డ్స్ పరంగా చెప్పాలంటే తెలుగులోనే నాకు ఎక్కువ ఉన్నాయి. తమి ళ్లో కూడా అన్ని రికార్డ్స్ ఉండవు. అందుకే తెలుగులో నేను ఆర్డినరీ సినిమాలు చేయడానికి ఇష్టపడను. ‘చీకటి రాజ్యం’ ఆర్డినరీ సినిమా కాదు. దీన్ని మీరే ఎక్స్ట్రార్డినరీ ఫిలిమ్ చేయాలి. వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ ఇది మెమెరబుల్ మూవీ’’ అన్నారు. రచయిత అబ్బూరి రవి మాట్లాడుతూ - ‘‘హాలీవుడ్ శైలిలో ఒకే పాయింట్ మీద సాగే కథతో సినిమా ఉంటుంది. సినిమా మొదలైన పది నిమిషాలకు మన హార్ట్‌బీట్ కూడా పెరుగుతుంది. థ్రిల్లర్ తరహాలో ఉత్కంఠకు గురి చేస్తుంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, నటి మధుశాలిని తదితరులు పాల్గొన్నారు. -
క్రేజీ హీరోతో స్ట్రయిట్ సినిమా!
పాత్రికేయునిగా, అనువాద చిత్రాల నిర్మాతగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న సురేష్ కొండేటి త్వరలో ఓ స్ట్రయిట్ చిత్రాన్ని నిర్మించనున్నారు. నేడు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా శనివారం ఓ ప్రకటన ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలియజేశారు. ‘‘తమిళంలో ఏడు కోట్ల నిర్మాణ వ్యయంతో రూపొందిన చిత్రం ‘వరుత్తపడాద వాలిబర్ సంగమ్’. గత నెల 6న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికి 40 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది కోలీవుడ్‌లో రికార్డ్. ఇంకా అద్భుతమైన వసూళ్లతో ఈ సినిమా దూసుకుపోతుండటం విశేషం. శివకార్తికేయన్, సత్యరాజ్, శ్రీదివ్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి పొన్రామ్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ చిత్రం రీమేక్ రైట్స్ కోసం చాలామంది నిర్మాతలు తెలుగు నుంచి పోటీపడ్డారు. కానీ ఈ సినిమాపై నమ్మకంతో ఫ్యాన్సీ రేట్ ఆఫర్ చేసి మరీ చిత్రాన్ని తీసుకున్నాం. తెలుగులో ఓ యంగ్ క్రేజీ హీరో ఈ చిత్రంలో నటిస్తారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో ప్రకటిస్తాం’’ అని తెలిపారు.