breaking news
Storage messages
-
మెమరీ క్రిస్టల్లో మన జన్యుక్రమం
లక్షలాది ఏళ్ల క్రితం గ్రహశకలం భూమిని ఢీకొనడంతో అంత పెద్ద డైనోసార్లే నామరూపాల్లేకుండా పోయినట్టు సైన్స్ చెబుతోంది. భవిష్యత్తులో అలాంటి ప్రళయమేదన్నా వచ్చి మానవాళిని అంతం చేస్తే? అలాంటిది జరిగినా మానవ సృష్టి క్రమం కొనసాగేందుకు బ్రిటన్ సైంటిస్టులు ఓ మార్గం ఆలోచించారు. మానవ జన్యు క్రమం మొత్తాన్నీ అత్యాధునిక 5డి మెమరీ క్రిస్టల్లో నిక్షిప్తం చేసి పెట్టారు. దాని సాయంతో మనిషిని తిరిగి సృష్టించవచ్చన్నమాట. సౌతాంప్టన్ వర్సిటీ ఆప్టోఎల్రక్టానిక్స్ రీసెర్చ్ సెంటర్ పరిశోధకులు ఈ క్రిస్టల్‌ను అభివృద్ధి చేశారు. వందల కోట్ల ఏళ్లపాటు చెక్కుచెదరకుండా ఉండేలా దీన్ని తీర్చిదిద్దా రు. చూసేందుకు చిన్నగా ఉన్నా ఇందులో ఏకంగా 360 టెరాబైట్స్ సమాచారాన్ని నిక్షిప్తం చేయవచ్చట! గడ్డకట్టించే చలి మొదలుకుని కాస్మిక్ రేడియేషన్, వెయ్యి డిగ్రీ సెల్సియస్‌కు మించిన ఉష్ణోగ్రత దాకా అన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితులనూ తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఈ క్రిస్టల్ అత్యంత మన్నికైన డిజిటల్ స్టోరేజ్ మెటీరియల్‌గా 2014లోనే గిన్నిస్ రికార్డులకెక్కింది. అంతరించిపోయే జాబితాలో చేరిన జంతు, వృక్ష జాతుల జన్యుక్రమాన్ని భద్రపరిచి ముందు తరాలకు అందించేందుకు కూడా ఈ క్రిస్టల్స్ ఉపయోగపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. 5డి మెమరీ ఎందుకంటే... అత్యంత వేగవంతమైన లేజర్ల సాయంతో 5డి పద్ధతిలో మానవ జన్యు డేటాను క్రిస్టల్లో భద్రపరిచారు. ‘‘తద్వారా సమాచారం పొడవు, ఎత్తు, వెడల్పుతో పాటు స్థితి, దిగి్వన్యాసం (ఓరియంటేషన్) అనే ఐదు విభిన్న డైమెన్షన్లలో క్రిస్టల్‌లోని సూక్ష్మనిర్మాణాల్లో నిక్షిప్తమై ఉంటుంది. తద్వారా అందులోని జన్యుక్రమాన్ని సుదూర భవిష్యత్తులో కూడా వెలికితీసి పునఃసృష్టి చేసేందుకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలుండేలా జాగ్రత్త పడ్డాం’’ అని పరిశోధన సారథి ప్రొఫెసర్ పీటర్ కజాన్స్కీ అన్నారు. అయితే కోట్లాది ఏళ్ల తర్వాత ఈ జన్యుక్రమం ఎవరి చేతికి చిక్కుతుందన్నది ప్రస్తుతానికి అనూహ్యమే. కనుక క్రిస్టల్‌లోని సమాచారమంతా వారికి సులువుగా చిక్కేందుకు వీలుగా అందులో ఒక విజువల్ కీని కూడా ఏర్పాటు చేశారు. క్రిస్టల్లో ఉన్న డేటా స్వరూపం, దాన్నెలా వాడుకోవాలి వంటివన్నీ ఈ కీ ద్వారా సులువుగా అర్థమైపోతాయని కజాన్స్కీ చెప్పుకొచ్చారు. ఈ క్రిస్టల్‌ను ఆ్రస్టియాలో ‘మెమరీ ఆఫ్ మ్యాన్‌కైండ్ ఆరై్కవ్’ టైమ్ క్యాప్సూల్‌లో భద్రపరిచి ఉంచారు. ఇది నిజంగా అద్భుతమేనంటూ ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్‌లో డీఎన్ఏ స్టోరేజ్ విభాగాధిపతి థామస్ హెయ్నిస్ ప్రశంసించారు. అయితే, ‘‘అంతా బాగానే ఉంది. కానీ మానవాళే అంతరించిపోతే ఈ క్రిస్టల్‌ను వాడేదెవరు? అందులోని జన్యుక్రమం సాయంతో మనిíÙని మళ్లీ సృష్టించేదెవరు?’’ అంటూ ఆయన కీలక ప్రశ్నలు సంధించడం విశేషం! – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మెసేజ్‌ల స్టోరేజ్’పై వెనకడుగు
-
‘మెసేజ్‌ల స్టోరేజ్’పై వెనకడుగు
పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఎన్క్రిప్షన్ పాలసీ ఉపసంహరణ * పొరపాట్లు సవరించి సరికొత్త విధానం రూపొందిస్తామని వెల్లడి న్యూఢిల్లీ: ప్రజలు, ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో వివాదాస్పద ఎన్క్రిప్షన్ పాలసీపై కేంద్ర ప్రభుత్వం వెనక్కు తగ్గింది. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్ల నుంచి ఈమెయిల్, వాట్సప్, ఫేస్బుక్, ట్విట ర్ తదితర మాధ్యమాల ద్వారా వెళ్లే అన్ని సందేశాలను సులభంగా అర్థమయ్యే వాక్య రూపంలో సాధారణ వినియోగదారులు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, టెలికం కంపెనీలు, ఇంటర్నెట్ ప్రొవైడర్లు 90 రోజుల పాటు కచ్చితంగా భద్రపరచాలంటూ ఒక ముసాయిదా ఎన్క్రిప్షన్ విధానాన్ని కేంద్రం సోమవారం ఐటీ శాఖ వెబ్సైట్లో పెట్టిన విషయం తెలిసిందే. ఆ సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు కోరినప్పుడు అందించాల్సి ఉంటుందని ఆ పాలసీలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నిబంధనలను పాటించని వారిపై చట్టపరంగా చర్యలుంటాయన్న హెచ్చరికను కూడా అందులో పొందుపర్చారు. దాంతో ప్రతిపక్షాలు, నెటిజన్లు, సామాజిక ఉద్యమకారుల్లో ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. ఈ విధానం తమ సమాచార గోప్యతకు, తమ భద్రతకు భంగకరమని తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. దాంతో మర్నాడే ఆ ముసాయిదా విధానాన్ని వెనక్కు తీసుకుంటున్నామని, సందేశ నిక్షిప్త విధానానికి సంబంధించి త్వరలో స్పష్టమైన పాలసీని తీసుకువస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయంలో కేంద్రం వెనకడుగు వేయడం ప్రభుత్వ తుగ్లక్ తరహా విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుత వ్యతిరేకత సాధించిన విజయమని కాంగ్రెస్ అభివర్ణించింది. అంతకుముందు, వాట్సప్, ఫేస్బుక్, ట్విటర్, తదితర సోషల్ మీడియా సైట్లు, పేమెంట్ గేట్వేలు, ఈ కామర్స్, పాస్వర్డ్ ఆధారిత లావాదేవీలను ఈ విధానం నుంచి మినహాయింపునిచ్చామని మంగళవారం ఉదయం ప్రభుత్వం ప్రకటించింది. ఆ తరువాత, కొన్ని గంటలకే .. మొత్తం ముసాయిదానే వెనక్కు తీసుకుంటున్నట్లు స్పష్టం చేసింది. మంగళవారం కేబినెట్ భేటీ అనంతరం టెలికం, ఐటీశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ దీనిపై వివరణ ఇచ్చారు. ఆ వివరాలు.. * నిజానికి అది ప్రజల సూచనలను కోరుతూ వెల్లడించిన ఎన్క్రిప్షన్ విధాన ముసాయిదా మాత్రమే. అదే ప్రభుత్వ తుది విధానం కాదు. * ముసాయిదాలోని కొన్ని నిబంధనలు అనవసర అపార్థాలకు, గందరగోళానికి తెరతీసేలా ఉన్న విషయాన్ని నేను కూడా గుర్తించాను. వెంటనే ఆ ముసాయిదాను వెనక్కు తీసుకుని, తప్పులను తొలగించి, నూతన ముసాయిదాను రూపొందించాలని ఐటీ శాఖను ఆదేశించాను. * కొత్తగా రూపొందించే విధానంలో సాధారణ వినియోగదారులకు మినహాయింపు ఉంటుంది. సమాచారాన్ని సంకేత రూపంలో నిక్షిప్తం చేసే(ఎన్‌క్రిప్ట్)వారికే ఈ ఎన్క్రిప్షన్ పాలసీ వర్తిస్తుంది. ‘ఎవరికి మినహాయింపు ఉంటుంది.. ఎవరికి వర్తిస్తుంది’ అనే విషయంలో నూతన విధానంలో స్పష్టత ఉంటుంది. * ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ హక్కును మా ప్రభుత్వం గౌరవిస్తుంది. సోషల్ మీడియా క్రియాశీలతను మోదీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. * సైబర్‌క్రైమ్, ఇంటర్నెట్ ఆధారిత నేరాల విస్తృతి పెరుగుతున్న నేపథ్యంలో ఎన్క్రిప్షన్ పాలసీని తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది.