breaking news
Sting
-
రాహుల్ చేతిలో ‘స్టింగ్’.. పెప్సీకోకు కోర్టులో ఊరట
ఎస్ఐఆర్ (SIR), కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు చేపట్టింది. ఢిల్లీ సహా పలు చోట్ల నిరసనల్లో స్పీడ్ పెంచింది. కాగా, మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ చేపట్టిన ఈ నిరసనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఎండలో గంటల తరబడి ఆందోళనలో కూర్చున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొద్దిగా అలసిపోవడంతో ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్‌ను తాగారు. అనంతరం అదే బాటిల్‌ను తన సోదరి, వయనాడ్ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాకు ఇచ్చారు.ఈ క్రమంలో సింగ్ బాటిల్‌ను ప్రియాంక తీసుకునే ముందు వద్దు.. వద్దు అంటూ తిరస్కరించారు. అనంతరం ప్రియాంక ఆ డ్రింక్‌ను తీసుకుని వాసన చూసి.. ఒక సిప్ తీసుకుని మళ్లీ రాహుల్‌కు ఇచ్చేశారు. ఈ సరదా సన్నివేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ గాంధీ రూ.20 ‘స్టింగ్’ తాగడాన్ని కొందరు ఆయన సామాన్య ప్రజలతో మమేకం కావాలనే ప్రయత్నానికి ప్రతీకగా అభివర్ణించారు. మరికొందరు ఇద్దరి మధ్య ఉన్న సోదరసోదరీ అనుబంధాన్ని ప్రస్తావించారు. కొందరు మాత్రం రాజకీయ వ్యంగ్యానికి ఉపయోగించుకున్నారు.ఇదిలా ఉండగా.. ఇక్కడే ఈ ఘటనకు మరో ఆసక్తికరమైన అంశం ఉంది. రాహుల్, ప్రియాంకలు ‘స్టింగ్’ తాగుతున్న సమయంలోనే.. పెప్సీకో ఢిల్లీ హైకోర్టులో ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదాన్ని తమ ఉత్పత్తులపై ఉపయోగించడంపై జరుగుతున్న కేసులో పోరాడుతోంది. పెప్సీకో ఉత్పత్తులపై ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదాన్ని ఉపయోగించడాన్ని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వ్యతిరేకించింది. ఆ పదాన్ని ఉత్పత్తుల లేబుళ్ల నుంచి తొలగించాలని కంపెనీని ఆదేశించింది. అలాగే ఆ లేబుల్‌తో ఉన్న ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవాలని దేశవ్యాప్తంగా ఆహార భద్రతా అధికారులకు సూచించింది.कोई राहुल गांधी को शहजादा बोलता है कोई जमीनी नेता ,पर सच तो यह है यह बंदा आम आदमी की तरह जीवन जीने से कतई परहेज नहीं करता ! LOP होने के बावजूद भी सिंपलीसिटी लाइफस्टाइल में सामान्य रहना कोई राहुल गांधी से सीखे बरहाल Sting energy को फ्री में प्रमोशन मिल गया @RahulGandhi @INCIndia https://t.co/cYIAZiS1iS— Rahul Kumar (@NewsRahulkumar) October 7, 2026దీంతో పెప్సీకో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసులో మంగళవారం కోర్టు కంపెనీకి మధ్యంతర ఊరట ఇచ్చింది. ఇప్పటికే తయారై మార్కెట్లో ఉన్న ‘ఎనర్జీ డ్రింక్’ లేబుల్ ఉన్న స్టాక్‌ను విక్రయించుకోవచ్చని కోర్టు తెలిపింది. అయితే కేసు తుది నిర్ణయం వచ్చే వరకు అదే వివాదాస్పద లేబుల్‌తో కొత్త ఉత్పత్తులను తయారు చేయకూడదని స్పష్టం చేసింది. మరోవైపు ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారనే దానిపై ప్రభుత్వ వర్గాలు వివరణ ఇచ్చాయి. కెఫీన్ ఉన్న పానీయాలను ‘ఎనర్జీ డ్రింక్’గా పిలవడం వల్ల అవి శరీరానికి పోషక శక్తిని లేదా అదనపు శక్తిని అందిస్తాయనే అభిప్రాయం వినియోగదారుల్లో కలగవచ్చని పేర్కొన్నాయి.కెఫీన్ ప్రధానంగా శరీరాన్ని ఉత్తేజపరిచే పదార్థంగా పనిచేస్తుంది. ఇది కొంతసేపు అప్రమత్తతను పెంచి, అలసట అనిపించడాన్ని తగ్గించవచ్చు. అయితే కెఫీన్ స్వయంగా శరీరానికి పోషక శక్తి లేదా క్యాలరీలను అందించదని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అధిక కెఫీన్, అదనపు చక్కెర ఉన్న పానీయాలను యువత, క్రీడాకారులు, ఆరోగ్యంపై శ్రద్ధ చూపేవారిని లక్ష్యంగా చేసుకుని ప్రచారం చేయడం వల్ల వినియోగదారుల ఆరోగ్యంపై ఆందోళనలు తలెత్తుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. అలా ఢిల్లీలో ఒకవైపు నిరసనలో రాహుల్ గాంధీ చేతిలో కనిపించిన ‘స్టింగ్’ ఆసక్తిని రేపగా.. మరోవైపు అదే సమయంలో ‘ఎనర్జీ డ్రింక్’ అనే పదంపై పెప్సీకో కోర్టులో న్యాయపోరాటం చేస్తోంది.ఇదీ చదవండి: జ్ఞానేశ్ కుమార్ టూర్‌కు మళ్లీ బ్రేక్! -
రోజుకొక స్టింగ్తో చిక్కుల్లోకి ఆప్
సాక్షి, న్యూఢిల్లీ: రోజుకొక స్టింగ్ ఆమ్ ఆద్మీ పార్టీని చిక్కుల్లో పెడుతోంది. మొదట మాజీ ఎమ్మెల్యే రాజేష్ గర్గ్ స్టింగ్, ఆ తరువాత మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసిఫ్ మహ్మద్ ఖాన్ స్టింగ్‌లు బయటికొచ్చాయి. తాజాగా ఆప్ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ షాహిద్ ఆజాద్ గురువారం రాత్రి బయటపెట్టిన ఆడియో టేపు కేజ్రీవాల్‌ను ముస్లిం విరోధిగా చూపించింది. ఆయన ముస్లింలకు వారి జనాభా బట్టి టికెట్లు ఇవ్వలేదని ఆజాద్ ఆరోపించారు. నరేంద్ర మోదీ భయం వల్ల ముస్లింలు ఎలాగూ ఆప్కే ఓటు వేస్తారు కనుక ముస్లిం అభ్యర్థులను ఎక్కువగా నిలబె ట్టనవసరం లేదని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారని, అందుకే టికెట్లు ఇవ్వలేదని ఆజాద్ ఆరోపించారు. గత నవంబర్ 24న ఆప్ మైనారిటీ విభాగం సమావేశం జరిగినప్పుడు అర్వింద్ కేజ్రీవాల్ మాటలను ఆడియో టేపులో రికార్డు చేసినట్లు చెబుతున్నారు. ఈ సమావేశంలో ఆప్ మైనారిటీ సెల్ ముస్లింలకు 11 టికెట్లు ఇవ్వాలని కోరిందని, కానీ కేజ్రీవాల్ ముస్లింలు ఎలాగూ ఆప్ వెంట ఉన్నారు కనుక వారికి అన్ని టికెట్లు ఇవ్వనవసరం లేదని అభిప్రాయపడ్డారని ఈ టేపు వెల్లడించింది. ముస్లింలు ఎక్కువగా నివసించే ప్రాంతంలో ముస్లిం అభ్యర్థులను నిలబెట్టడం వల్ల ఓట్లు చీలి బీజేపీ గెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారని ఆడియో టేప్‌లో రికార్డయిన సంభాషణ బట్టి తెలుస్తోంది. నరేంద్ర మోదీ రథాన్ని ఆపగల సామర్థ్యం ఆప్‌కు మాత్రమే ఉందని ముస్లింలు భావిస్తున్నారని, అందువల్ల వారికి ఎక్కువ సీట్లు ఇవ్వనసరం లేదని కేజ్రీవాల్ అనడం ఆడియో టేపులో రికార్డయింది. పార్టీని అప్రదిష్టపాలు చేసేందుకే... తమ పార్టీని , కేజ్రీవాల్‌ను అప్రదిష్టపాలు చేసే కుట్రతో ఈ ఆరోపణలు చేస్తున్నారని ఆప్ నేతలు ఆరోపించారు. ఇదిలా ఉండగా సంజయ్ సింగ్ తనకు మంత్రి పదవి ఇవ్వజూపిన టేపును శుక్రవారం బయటపెడతానని బెదిరించిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆ టేపును బయటపెట్టలేదు. టీవీ చానెల్ ఎడిటర్ ఇంట్లో తాను సంజయ్ సింగ్‌తో మాట్లాడానని, ఎడిటర్ ఉద్యోగాన్ని కాపాడే ఉద్దేశంతో టేపును బయటపెట్టడం లేదని ఆసిఫ్ మహ్మద్ ఖాన్ చెప్పారు. ఎడిటర్ నివాసంలో తాను ఆసిఫ్ మహ్మద్ ఖాన్‌తో మాట్లాడినట్లు సంజయ్ సింగ్ చెప్పారు. అయితే ఆసిఫ్‌కు మంత్రి పదవి ఇవ్వచూపలేదని, ఆసిఫ్ ఆడియో టేపును బయటపెట్టాలని సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు.


