breaking news
Stefanos Tsitsipas
-
క్వార్టర్స్ చేరిన అల్కరాజ్కు ఊహించని షాక్!
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాజ్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. గాయం నుంచి కోలుకున్న అల్కరాజ్ సీజన్ చివరి గ్రాండ్‌స్లామ్‌లో మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. భారత కాలమాన ప్రకారం సోమవారం తెల్లవారుజామున జరిగిన ప్రిక్వార్టర్స్‌లో రెండో సీడ్ అల్కరాజ్ 6-4, 6-3, 6-4తో అమెరికాకు చెందిన 20వ సీడ్ టామీ పాల్‌ను వరుస సెట్లలో మట్టికరిపించాడు. రెండు గంటల 20 నిమిషాల పాటు సాగిన పోరులో అల్కరాజ్ 33 విన్నర్లు సంధించి ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ 8వ ర్యాంకర్ బెంజమిన్ షెల్టన్‌ను ఎదుర్కోనున్నాడు. ఇక షెల్టన్ మూడో రౌండ్లో 6-2, 6-3, 6-4తో స్టిఫానోస్ సిట్సిపాస్‌ను వరుస సెట్లలో ఖంగుతినిపించి అల్కరాజ్తో పోరుకు సిద్ధమయ్యాడు.Photo Credit: Twitterఅయితే క్వార్టర్ ఫైనల్లో అల్కరాజ్ తాను తలపడబోయే ప్రత్యర్థిని తప్పుగా ఊహించడం ఆసక్తి రేపింది. టామీ పాల్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత అల్కరాజ్ సెట్ (యూఎస్ ఓపెన్‌లో మ్యాచ్‌లు జరిగే ప్రదేశం)కు వెళ్లాడు. 2003 యూఎస్ ఓపెన్ చాంపియన్ ఆండీ రాడిక్ క్వార్టర్స్‌లో అల్కరాజ్ ఎదుర్కోబోయే చాలెంజర్ గురించి ప్రశ్న అడిగాడు. "మీరు షెల్టన్ లేదా సిట్సిపాస్లో ఒకరితో క్వార్టర్స్ ఆడనున్నారు. మరి ఇద్దరిలో ఎవరితో ఆడడం మీకు ఇష్టం" అని ప్రశ్నించాడు. అయితే ఆండీ రాడిక్ ప్రశ్న పూర్తి కాకముందే.. అతడి ముందు ఉన్న పేపర్‌ను పరిశీలించిన అల్కరాజ్.. "ఓరి దేవుడా, ఇది నేను ఊహించలేదు. మెద్వెదెవ్ లేదా టియాఫోల్లో ఒకరితో తలపడతానని భావించాను. కానీ ఇక్కడ వేరే పేర్లున్నాయి.’’ అని పేర్కొన్నాడు. Photo Credit: Twitterతాను ఒకటి తలిస్తే దైవమొకటి తలచిందన్నట్లుగా తన పరిస్థితి తయారైందని అల్కరాజ్ చెప్పడంతో స్టూడియోలో ఉన్నవారంతా గొల్లుమని నవ్వారు. అల్కరాజ్, ఆండీ రాడిక్ వీడియో సంభాషణ వైరల్‌గా మారింది. ఇక ఫ్రాన్స్‌కు చెందిన టియాఫో డానిల్ మెద్వదెవ్‌ను ఓడించి క్వార్టర్స్‌లో అలెక్స్ మిచెల్సెన్తో పోటీకి సిద్ధమయ్యాడు.టామీ పాల్‌ను ఓడించి క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన కార్లోస్ అల్కరాజ్ కొన్ని రికార్డులు సాధించాడు. యూఎస్ ఓపెన్‌లో క్వార్టర్స్ చేరడం అల్కరాజ్కు ఇది ఐదో సారి. హార్డ్ కోర్టుపై అల్కరాజ్కు ఇది వరుసగా 18వ విజయం కాగా, యూఎస్ ఓపెన్‌లో ఇది వరుసగా 11వ విజయం. ఓవరాల్‌గా అల్కరాజ్ గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో క్వార్టర్ ఫైనల్ చేరడం ఇది 15వ సారి.Undeniable.Carlos Alcaraz dispatches Paul 6-4, 6-3, 6-4 to reach the quarterfinals! pic.twitter.com/9BycpgCDQZ— US Open Tennis (@usopen) September 6, 2026 Alcaraz didn't know he was playing Shelton or Tsitsipas next at the US Open:Carlos: "I thought.. I thought.. Oh my God I thought I was playing Medvedev or Tiafoe. Oh my God." 😭😭😭“You gonna watch the match?"Carlos: "For sure I'm gonna watch it." 😭 pic.twitter.com/P4eRQBzOkp— The Tennis Letter (@TheTennisLetter) September 6, 2026Read: సాత్విక్-చిరాగ్ జోడీకి వైఎస్ జగన్ అభినందనలు -
French Open 2023: రెండో రౌండ్లోకి సబలెంకా, సిట్సిపాస్
పారిస్: అంతా అనుకున్నట్లు జరిగే ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ కూడా సొంతమయ్యే పరిస్థితుల్లో... ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో రెండో ర్యాంకర్ సబలెంకా (బెలారస్) శుభారంభం చేసింది. ఆదివారం మొదలైన సీజన్ రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సబలెంకా రెండో రౌండ్లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్ ప్లేయర్ మార్టా కోస్టుక్తో జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సబలెంకా 6–3, 6–2తో గెలిచింది. 71 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సబలెంకా తన ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 19 విన్నర్స్ కొట్టిన సబలెంకా 21 అనవసర తప్పిదాలు కూడా చేసింది. మరోవైపు ఎనిమిదో సీడ్ మరియా సాకరి (గ్రీస్) తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 7–6 (7/5), 7–5తో సాకరిని ఓడించి రెండో రౌండ్లోకి అడుగు పెట్టింది. 2 గంటల 6 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ముకోవా తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఐదో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్), ఏడో సీడ్ రుబ్లెవ్ (రష్యా), 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా), 13వ సీడ్ హుర్కాజ్ (పోలాండ్) తమ ప్రత్యర్థులపై కష్టపడి గెలిచి రెండో రౌండ్లోకి ప్రవేశించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సిట్సిపాస్ 7–5, 6–3, 4–6, 7–6 (9/7)తో జిరీ వెసిలీ (చెక్ రిపబ్లిక్)పై, రుబ్లెవ్ 6–1, 3–6, 6–3, 6–4తో జెరె (సెర్బియా)పై, హుర్కాజ్ 6–3, 5–7, 4–6, 2–6, 6–4తో డేవిడ్ గాఫిన్ (బెల్జియం)పై, ఖచనోవ్ 3–6, 1–6, 6–2, 6–1, 6–3తో లెస్టిన్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. -
తిరుగులేని జొకోవిచ్.. సిట్సిపాస్కిది రెండోసారి.. ప్రైజ్‌మనీ ఎంతంటే!
గత ఏడాది కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆడేందుకు జొకోవిచ్ మెల్బోర్న్కు వచ్చాడు. కానీ కోవిడ్ టీకా వేసుకోనందుకు... అప్పటి ఆస్ట్రేలియా ప్రభుత్వం జొకోవిచ్ విషయంలో కఠినంగా వ్యవహరించింది. ఒక్కడి కోసం నిబంధనలు మార్చలేమని స్పష్టం చేసింది. విమానాశ్రయంలోనే అతడిని నిర్భంధించింది. జొకోవిచ్ వీసాను రద్దు చేసింది. మూడేళ్లపాటు ఆస్ట్రేలియాలో అడుగు పెట్టకుండా నిషేధం విధించింది. న్యాయపోరాటం చేసినా ఈ సెర్బియా స్టార్‌కు అనుకూల నిర్ణయం రాలేదు. దాంతో అవమానకర రీతిలో జొకోవిచ్ విమానాశ్రయం నుంచే స్వదేశానికి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఏడాది గడిచిపోయింది. కోవిడ్ తీవ్రత తగ్గింది. ఆస్ట్రేలియాలో ప్రభుత్వం కూడా మారిపోయింది. జొకోవిచ్ వీసాను పునరుద్ధరించడం జరిగింది. వెరసి తనకెంతో కలిసొచ్చిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నీలో జొకోవిచ్ పదోసారి విజయగర్జన చేశాడు. మెల్బోర్న్: ఫ్రెంచ్ ఓపెన్ అంటే రాఫెల్ నాదల్... వింబుల్డన్ అంటే రోజర్ ఫెడరర్ గుర్తుకొస్తారు. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే ఎవరు గుర్తుకు రావాలి అన్న ప్రశ్నకు సమాధానం తానేనని సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ నిరూపించాడు. సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తనకు తిరుగులేదని ఈ సెర్బియా యోధుడు మరోసారి చాటుకున్నాడు. ప్రైజ్‌మనీ ఎంతంటే ఆదివారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ ఐదో ర్యాంకర్ జొకోవిచ్ 6–3, 7–6 (7/4), 7–6 (7/4)తో ప్రపంచ మూడో ర్యాంకర్, మూడో సీడ్ సిట్సిపాస్ (గ్రీస్)పై గెలుపొందాడు. విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 29,75,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 17 కోట్ల 22 లక్షలు)... రన్నరప్ సిట్సిపాస్‌కు 16,25,000 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 40 లక్షలు) ప్రైజ్‌మనీ లభించింది. సిట్సిపాస్కిది రెండోసారి సిట్సిపాస్‌తో 2 గంటల 56 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో జొకోవిచ్‌కు ఏదశలోనూ ఆందోళన చెందేరీతిలో ప్రతిఘటన ఎదురుకాలేదు. కీలకదశలో ఈ సెర్బియా స్టార్ పైచేయి సాధించి సిట్సిపాస్‌కు కోలుకునే అవకాశం ఇవ్వలేదు. తొలి సెట్లోని నాలుగో గేమ్‌లో సిట్సిపాస్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ ఆ తర్వాత తన సర్వీస్‌ను నిలబెట్టుకొని 4–1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి అదే జోరులో తొలి సెట్‌ను 36 నిమిషాల్లో దక్కించుకున్నాడు. రెండో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ఫలితంగా సర్వీస్ ఒక్కసారీ బ్రేక్ కాలేదు. స్కోరు 6–6తో సమం కావడంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో జొకోవిచ్ పైచేయి సాధించి 70 నిమిషాల్లో రెండో సెట్‌ను గెల్చుకున్నాడు. మూడో సెట్ తొలి గేమ్‌లో జొకోవిచ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిట్సిపాస్ ఆ వెంటనే తన సర్వీస్‌ను కూడా కోల్పోయాడు. ఆ తర్వాత ఇద్దరూ తమ సర్వీస్‌లను కాపాడుకోవడంతో స్కోరు 6–6తో సమమైంది. మళ్లీ టైబ్రేక్ అనివార్యమైంది. ఈసారీ టైబ్రేక్‌లో జొకోవిచ్ ఆధిపత్యం కనబరిచి 70 నిమిషాల్లో మూడో సెట్‌నూ సొంతం చేసుకొని విజయాన్ని ఖరారు చేసుకున్నాడు. గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో జొకోవిచ్ చేతిలో ఓడిపోవడం సిట్సిపాస్కిది రెండోసారి. 2021 ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్లోనూ జొకోవిచ్ చేతిలో ఓడిపోయాడు. ఫైనల్ గణాంకాలు జొకోవిచ్ వర్సెస్ సిట్సిపాస్ 7 ఏస్‌లు 15 3 డబుల్ ఫాల్ట్‌లు 3 36 విన్నర్స్ 40 22 అనవసర తప్పిదాలు 42 2 బ్రేక్ పాయింట్లు 1 10 నెట్ పాయింట్లు 12 112 మొత్తం పాయింట్లు 94 చదవండి: Shafali Verma: బీసీసీఐ కానుక రూ. 5 కోట్లు! వచ్చే నెలలో ఇంతకంటే పెద్ద ట్రోఫీ కూడా! ఒక చెవితో మాత్రమే వినగలడు.. అయితేనేం.. వాషింగ్టన్ సుందర్ గురించిన ఆసక్తికర విషయాలు 🤯🤯🤯@Infosys • #FindYourNext • #AusOpen • #AO2023 Tsitsipas v Djokovic • Infosys AI Shot of the Day@wwos • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/HlwybwoeWT — #AusOpen (@AustralianOpen) January 29, 2023 Unstoppable 🏆#luzhoulaojiao • @guojiao_1573 • #AusOpen • #AO2023 @wwos • @espn • @Eurosport • @wowowtennis pic.twitter.com/tjwd8QVSJ0 — #AusOpen (@AustralianOpen) January 29, 2023


