breaking news
Stavenjar
-
రాజమౌళిపై రేణు దేశాయ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?
పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇటీవల ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోంది. ఆమె చేసిన కామెంట్స్‌తో మరోసారి చర్చల్లో నిలిచారు. ఎందుకంటే కొద్దిరోజుల క్రితమే తన విడాకుల విషయం, పవన్ గురించి ఆమె పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె దర్శకధీరుడు రాజమౌళిపై చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇంతకీ ఆ పోస్ట్ ఏంటో తెలుసుకుందాం. (ఇది చదవండి: నా విషయంలో పవన్‌ది 100% తప్పే: రేణుదేశాయ్) అయితే తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించిన బాహుబలి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రాన్ని నార్వోలోని స్టావెంజర్ నగరంలోని ఓ థియేటర్లో ప్రదర్శించారు. అక్కడ సినిమా చూసేందుకు రేణ్ దేశాయ్, తన కుమారుడు అకీరా నందన్‌తో కలిసి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె థియేటర్లో సినిమా చూసి సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన లయ.. దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. రేణు తన ఇన్‌స్టాలో రాస్తూ.. ' ఒక భారతీయ సినిమా అంతర్జాతీయంగా గుర్తింపు పొందడం చాలా అద్భుతంగా ఉంది. రాజమౌళి సార్.. మీరు ప్రేక్షకుల కోసం సృష్టించిన అనుభూతిని వర్ణించడానికి నా దగ్గర పదాలు లేవు. స్టావెంజర్లోని థియేటర్లో బాహుబలి చూసిన అనుభవం మరిచిపోలేనిది. ఈ కార్యక్రమానికి నన్ను, అకీరాను ఆహ్వానించినందుకు శోబు సార్‌కు ధన్యవాదాలు.' అంటూ పోస్ట్ చేసింది. అద్భుతమైన లైవ్ ఆర్కెస్ట్రాతో మనం అత్యంత ఇష్టపడే చిత్రాన్ని చూడటం అద్భుతంగా ఉందంటూ రేణుదేశాయ్ ఎమోషనలయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. (ఇది చదవండి: పవన్‌తో విడాకుల టైమ్‌లో జరిగింది ఇదే.. రేణుదేశాయ్ వైరల్ కామెంట్స్ ) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
ఆనంద్‌కు మళ్లీ ‘డ్రా’నే
స్టావెంజర్ (నార్వే): నార్వే చెస్ టోర్నమెంట్లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ‘డ్రా’ల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం జరిగిన మూడో రౌండ్లో అలెగ్జాండర్ గ్రిస్చుక్ (రష్యా)తో జరిగిన గేమ్‌ను విషీ 41 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఈ రౌండ్ అనంతరం ఆనంద్ 1.5 పాయింట్లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. గ్రిస్చుక్ నల్లపావులతో సిసిలియన్ వ్యూహంతో ఆడితే... భారత ప్లేయర్ డొమినిగ్వేజ్ వేరియషన్‌ను అవలంభించాడు. పరస్పరం కొన్ని ఎత్తుల తర్వాత రష్యా ఆటగాడికి గెలిచే అవకాశాలు వచ్చినా.. నిర్ణీత సమయంలోగా ఎత్తులు వేయలేకపోయాడు. క్వీన్ ట్రేడ్ చేసుకోవడంతో ఆనంద్ గేమ్‌పై పట్టు సాధించినా.. గ్రిస్చుక్ అద్భుతమైన డిఫెన్స్‌తో డ్రా వైపు తీసుకెళ్లాడు. వరుసగా రెండు ఓటముల తర్వాత ప్రపంచ చాంపియన్ కార్ల్సన్ (నార్వే)... అనిష్ గిరి (నెదర్లాండ్స్-2)తో జరిగిన గేమ్‌ను 78 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. ఇతర గేమ్‌ల్లో తపలోవ్ (బల్గేరియా-2.5)... లాగ్రావీ (ఫ్రాన్స్-1.5)పై; నకమురా (అమెరికా-2.5)... ఫ్యాబియానో కరుణ (ఇటలీ-1.5)పై గెలవగా, అరోనియన్ (ఆర్మేనియా-1)... హమ్మర్ (నార్వే-1)ల మధ్య జరిగిన గేమ్ డ్రా అయ్యింది.