breaking news
State youth
-
దేశ సేవకు సింగరేణి యువత
వరంగల్ స్పోర్ట్స్: భరతమాత సేవకు మేము సైతం అంటున్నారు సింగరేణి యువత.. సరిహద్దుల్లో పహారా కాసే అవకాశం కోసం పరితపిస్తున్నారు. సైనికుడిగా మారాలన్న ఆశయంతో పట్టుదలతో కఠోర సాధన చేసి.. వారం రోజులుగా హన్మకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో కొనసాగుతున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొంటున్నారు. ఇప్పటి వరకు 150 మంది యువకులు ఆర్మీలోని వివిధ కేటగిరీల్లోని ఉద్యోగం కోసం పోటీ పడగా 93 మంది ఇప్పటి వరకు ఎంపికయ్యారు. రెండు నెలలుగా శిక్షణ... యువత ఆకాంక్షను నెరవేర్చేందుకు సింగరేణి సేవా సమితి ఆధ్వర్యంలో రెండు నెలలుగా మెరుగైన శిక్షణ అందించింది. అంతేకాదు ర్యాలీలో పాల్గొంటున్న యువతకు హన్మకొండలో ఉచిత భోజన, ఇతర వసతులను ఏర్పాటు చేసింది. సింగరేణి సీఎండీ శ్రీధర్, భూపాలపల్లి జనరల్ మేనేజర్ గురువయ్య ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన శిక్షణను పూర్తి స్థాయిలో యువకులు సద్వినియోగం చేసుకున్నారు. సింగరేణి పరిధిలోని భూపాలపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లందు, రామగుండంలోని మూడు ఏరియాలు, బెల్లంపల్లి, మందమర్రి మొత్తం పది ప్రాంతాల్లో యువతకు ఉద్యోగ కల్పన కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సింగరేణి సేవా సమితి పేరుతో సంస్థను స్థాపించారు. 2000 సంవత్సరంలో ఏర్పాటైన ఈ సంస్థ ద్వారా సింగరేణి కార్మికుల పిల్లలు, ఆ పరిధిలోని నిరుద్యోగ యువతకు శిక్షణ అందిస్తున్నారు. సింగరేణిలోని ఆయా ప్రాంతాల్లో విధుల్లో స్పోర్ట్స్ కోఆర్డినేటర్లు యువతకు ఫిజికల్‌గా ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు 18 సంవత్సరాలలో శిక్షణ పొందిన వారిలో 1000 మంది వరకు ఆర్మీలో వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలు చేస్తుండడం విశేషం. యువతకు శిక్షణ ఇచ్చేందుకు సింగరేణి కోఆర్డినేషన్ విభాగం ఏర్పాటు చేశారు. ఈ విభాగం ద్వారా ప్రతి ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీకి నిధులను సైతం విడుదల చేస్తున్నారు. ఈసారి దాదాపు రెండు నెలల పాటు 150 మంది అభ్యర్థులు శిక్షణ ఇచ్చారు. హన్మకొండలోని జేఎన్ఎస్లో ఈనెల 22 నుంచి నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో ఇప్పటి వరకు 104 మంది అభ్యర్థులు వివిధ కేటగిరీల్లో పాల్గొన్నారు. అందులో 67 మంది దేహదారుఢ్య పరీక్షలో నెగ్గి మెడికల్ టెస్ట్‌కు క్వాలీఫై కాగా, 26 మంది మెడికల్ పరీక్షల్లో సైతం అర్హత సాధించి రాత పరీక్ష సిద్ధమవుతున్నారు. ఇక మరో 9 మంది మెడికల్ టెస్ట్‌లో అర్హతను కోల్పోయారు. ట్రేడ్‌మెన్‌కు ఎంపికయ్యాను జవాన్ ఉద్యోగం చేయాలన్న నా ఆశయం నేటి నెరవేరింది. నెల రోజులకు నాకు శిక్షణ అందించిన సింగరేణి సేవా సమితికి ప్రత్యేక కృతజ్ఞతలు. మా ఊరిలో కొందరు ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నారు. వారిని చూసినప్పటి నుంచి నేనూ ఆర్మీలో చేరాలనుకున్నాను. ఏడాదిగా ప్రతి రోజు వ్యాయామం చేస్తున్నాను. అనుకున్న ఉద్యోగం రావడం సంతోషంగా ఉంది. జీఎం పంపిన చెక్కును కలెక్టర్ అమ్రపాలికి అందజేస్తున్న నోడల్ ఆఫీసర్ సాధన్ -
ఉపాధి కల్పనే లక్ష్యం
⇒ పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక విడుదల చేసిన కేటీఆర్ ⇒ పెట్టుబడులను ఆకర్షించేందుకే పరిమితం కాబోం ⇒ కొత్త రంగాలపై దృష్టి సారిస్తూ సెక్టోరల్ పాలసీలు తీసుకొస్తాం ⇒ రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమలను విస్తరిస్తాం ⇒ త్వరలో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ ⇒ వచ్చే ఏడాది రాష్ట్రంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహిస్తామని వెల్లడి సాక్షి, హైదరాబాద్: కేవలం పెట్టుబడులను ఆకర్షించేందుకే కాకుండా.. రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక రంగంపై దృష్టి సారించామని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు పేర్కొన్నారు. పారిశ్రామిక రంగంలో రాష్ట్రానికి ఉన్న బలంపై ఆధారపడుతూనే.. కొత్త రంగాలపై దృష్టి సారించేలా ‘సెక్టోరల్ థింకింగ్ పాలసీ’లకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పారిశ్రామిక ప్రగతి హైదరాబాద్ పరిసరాలకే పరిమితం కాకుండా రాష్ట్రమంతటికీ విస్తరించేలా ఇండస్ట్రియల్ ప్రమోషన్‌పై దృష్టి సారిస్తామని చెప్పారు. సులభ వాణిజ్యంతోపాటు తక్కువ వ్యయంతో, ఎక్కువ నాణ్యత కలిగిన ఉత్పత్తుల తయారీతో ఉపాధి అవకాశాలు పెరిగేలా చూస్తామని వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో పరిశ్రమలు, మైనింగ్ శాఖల ద్వితీయ వార్షిక నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. టీ-హబ్ తరహా స్ఫూర్తిని పారిశ్రామిక రంగానికి విస్తరిస్తామని... ప్రైవేటు భాగస్వామ్యంతో ఏర్పాటయ్యే ‘రిచ్’ను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా ప్రకటించారు. కీలక రంగాల్లో తెలంగాణ యువతకు ఉపాధి దక్కేలా టాస్క్ తరహాలో నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అమెరికాలోనూ మన విధానం..! రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని.. అమెరికాలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలనే యోచనలో అక్కడి పలు రాష్ట్రాలు ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు. టీఎస్ఐపాస్ను ప్రధాని మోదీ సహా అనేక మంది ప్రశంసించారన్నారు. ఆదిభట్ల ఏరోస్పేస్ సెజ్‌లో తయారయ్యే హెలికాప్టర్‌ను అమెరికా అధ్యక్షుడు ఒబామా ఉపయోస్తున్నారన్నారు. లైఫ్‌సైన్స్, ఫార్మా, బల్క్ డ్రగ్ రంగాల్లో అభివృద్ధిని స్థిరీకరిస్తూ... కొత్తగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో బలోపేతమయ్యేందుకు ప్రయత్నిస్తామని తెలి పారు. మెడికల్ డివెజైస్, ఫుడ్ ప్రాసెసింగ్, సీడ్ పార్కుల ద్వారా భారీగా ఉపాధి లభించే అవకాశమున్నందున భవిష్యత్తులో వాటికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, హార్డ్‌వేర్ ఉత్పత్తులకు సంబంధించి జపాన్, దక్షిణ కొరియా, తైవాన్, అమెరికాలో కంట్రీ డెస్కులు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు కేటీఆర్ తెలిపారు. త్వరలోనే ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ పాలసీని ప్రకటిస్తామన్నారు. వచ్చే ఏడాది ఆరంభంలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌ను నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఫార్మాసిటీ, టెక్స్టైల్ పార్కు ఏర్పాటును ఈ ఏడాది కొలిక్కి తెస్తామన్నారు. మైనింగ్ లక్ష్యం రూ.4 వేల కోట్లు మైనింగ్ ఆదాయం 2015-16లో 41 శాతం వృద్ధి చెందిందని.. రికార్డు స్థాయిలో రూ.2,774 కోట్లు ఖజానాకు సమకూరాయని కేటీఆర్ వెల్లడించారు. 2016-17లో రూ.4 వేల కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాయల్టీ వసూలు, సీనరేజీ చెల్లింపు, ఆన్లైన్లో అనుమతులు, మినరల్ కన్సెన్షన్స్ తదితర విధానాల్లో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నామని తెలిపారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా, మైనింగ్ కార్మికుల రక్షణను కూడా దృష్టిలో పెట్టుకుని ‘మైనింగ్ సేఫ్టీ యాక్ట్’ను అమలు చేస్తామని ప్రకటించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు. టీఎస్ఎండీసీ ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఇప్పటి వరకు ఇసుక అమ్మకాల ద్వారా రూ.436 కోట్లు ఆర్జించిందని కేటీఆర్ వెల్లడించారు. 31 పరిశ్రమలకు అనుమతులు టీఎస్ ఐపాస్‌లో భాగంగా ఏడో విడతలో 31 పరిశ్రమలకు మంత్రి కేటీఆర్ అనుమతి పత్రాలు అందజేశారు. ఈ పరిశ్రమల ద్వారా రూ.2,374 కోట్ల పెట్టుబడులతో 5,800 మందికి ప్రత్యక్ష ఉపాధి దక్కుతుందని వెల్లడించారు. సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యద ర్శి అరవింద్ కుమార్, ఉప కార్యదర్శి సైదా, కమిషనర్ మాణిక్‌రాజ్, టీఎస్ఎండీసీ ఎండీ ఇలంబర్తి, టీఎస్ఐఐసీ ఎండీ ఈ.వి.నర్సింహారెడ్డి, మైన్స్ విభాగం డెరైక్టర్ సుశీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.