State government neglect
-
సీజేఐకి ఇచ్చే గౌరవం ఇదేనా?
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ తీవ్ర అసంతృప్తి వెలిబుచ్చారు. సీజేఐగా బాధ్యతలు చేపట్టాక ఆదివారం ఆయన తొలిసారి తన సొంత రాష్ట్రం మహారాష్ట్రలో పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. సీజేఐ తొలిసారి అధికారిక పర్యటనకు వస్తే ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు డీజీపీ లేదా నగర పోలీసు కమిషనర్ స్వాగతం పలకాల్సి ఉంటుంది. ఈ నెల 14న సీజేఐగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ గవాయ్‌ని మహారాష్ట్ర, గోవా బార్ కౌన్సిల్ సన్మానించింది. ఆ కార్యక్రమం నిమిత్తం ఆయన ఆదివారం ముంబై చేరుకున్నారు. సీఎస్, డీజీపీ, పోలీసు కమిషనర్ స్వాగతం పలకకపోవడం చర్చనీయాంశంగా మారింది. అనంతరం సన్మాన కార్యక్రమంలో జస్టిస్ గవాయ్ దీన్ని ఎత్తి చూపారు. ‘‘నేను మహారాష్ట్రలోనే పుట్టి పెరిగా. సీజేఐ హోదాలో తొలిసారి సొంత రాష్ట్రానికి వస్తే ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానించకపోవడం ఏ మేరకు సబబో సీఎస్, డీజీపీ ఆలోచించుకోవాలి. నేనేమీ ప్రొటోకాల్ కోసం బలవంతం చేయడం లేదు. ఇలాంటి చిన్నచిన్న విషయాలు పట్టించుకోను. కాకపోతే ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ మరో వ్యవస్థకు ఇవ్వాల్సిన గౌరవం గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే దీన్ని ప్రస్తావిస్తున్నా’’ అని వివరించారు. ‘‘ఇక్కడ నా స్థానంలో మరొకరు ఉండి ఉంటే రాజ్యాంగంలోని ఆరి్టకల్ 142ను ప్రయోగించేవారు’’ అని జస్టిస్ గవాయ్ సరదాగా వ్యాఖ్యానించారు.రాజ్యాంగమే అత్యున్నతం ప్రజాస్వామ్యంలో రాజ్యాంగమే అత్యున్నతమని సీజేఐ గవాయ్ స్పష్టం చేశారు. శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు కలిసికట్టుగా పనిచేయాలని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్‌కు ఉన్నప్పటికీ రాజ్యాంగ మౌలిక నిర్మాణాన్ని మాత్రం అది మార్చలేదని తేల్చిచెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనం ఇదేనన్నారు. తాను వెలువరించిన 50 కీలక తీర్పులతో కూడిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. నేరగాళ్ల ఇళ్లను కూల్చడం (బుల్డోజర్ న్యాయం) కూడదంటూ తానిచి్చన తీర్పు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. -
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆత్మహత్యలు
సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వైఎస్సార్ సీపీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రభుత్వం ఒకేసారి పంట రుణాలు మాఫీ చేయకుండా విడతల వారీగా చేయడమే రైతుల ఆత్మహత్యలకు కారణమని వైఎస్సాఆర్ సీపీ భావిస్తోందన్నారు. ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని, రైతులు మనోధైర్యం కోల్పోవద్దని సూచించారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు వైఎస్సార్సీపీ ప్రణాళిక రూపొందిస్తుందన్నారు. వరంగల్ జిల్లాలో షర్మిల రెండోదశ పరామర్శయాత్ర ముగింపు సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం ఇసిపేటలో శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలను చూసిన వైఎస్ఆర్ ఉచిత కరెంటు ఇచ్చారని, కనీస మద్దతు ధర పెరి గేలా చేశారని, నష్టపరిహారాన్ని పెంచారన్నారు. వీటితోపాటు రుణాలు మాఫీ చేయడంతో వైఎస్ హయాంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయన్నారు. 2 దశల్లో 10 రోజుల్లో కలిపి వరంగల్ జిల్లాలో ఇప్పటికి 62 కుటుంబాలను షర్మిల పరామర్శించినట్లు తెలిపారు. ఈ యాత్రలో ఆరడుగులు లేని ఇళ్లలో ఉంటున్నవారిని కలసినట్లు చెప్పారు. వైఎస్ఆర్ ఉంటే పేదలందరికీ పక్కా ఇళ్లు ఉండేవన్నారు. ఈ విషయాన్ని పేదలే చెబుతున్నారన్నారు. వరంగల్ జిల్లాలో మిగిలిన 11 కుటుంబాలను పరామర్శించేందుకు సెప్టెం బర్ 21, 22 తేదీల్లో మూడోదశ యాత్ర నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ యాత్ర సెప్టెంబర్ 22న వరంగల్‌లో ముగిసి, కరీంనగర్ జిల్లాలో మొదలవుతుందన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం.. కేంద్రం తాత్సారం
- ప్రత్యేక హోదా సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జునరావు - ఢిల్లీలో జగన్ దీక్షకు మద్దతుగా గుంటూరులో ‘నగర యువజన దీక్ష’ పట్నంబజారు(గుంటూరు) : రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రత్యేకహోదా విషయంలో కేంద్రప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని ప్రత్యేకహోదా సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జునరావు ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షకు మద్దతుగా సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ‘నగర యువజన దీక్ష’ నిర్వహించారు. పార్టీ యువజన విభాగం నేత ఎలికా శ్రీకాంత్‌యాదవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. దీక్షను ప్రారంభించిన మల్లికార్జునరావుమాట్లాడుతూ మంగళవారం జరిగే బంద్‌కు పూర్తిస్థాయిలో అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. శ్రీకాంత్‌యాదవ్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధన విషయంలో చంద్రబాబు సర్కార్‌కు ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. మహిళా విభాగం నగర అధ్యక్షురాలు గనిక ఝాన్సీరాణి మాట్లాడుతూ ప్రత్యేకహోదాపై మాటలు చెప్పి కేంద్ర మంత్రుల పదవులు తెచ్చుకున్న నేతలు ఇప్పుడు ఏమైపోయారని ప్రశ్నించారు. మైనారిటీ విభాగం నగరాధ్యక్షుడు షేక్ జానీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం ప్రాణత్యాగాలకైనా సిద్ధమేనని తిరుపతి సంఘటనతో సుస్పష్టం అయిందన్నారు. బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కోవూరి సునీల్‌కుమార్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య తదితరులు మాట్లాడారు. తొలుత తిరుపతిలో ప్రత్యేకహోదా కోసం ఆత్మహత్యకు పాల్పడిన మునికోటి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రాన్ని అందజేశారు. కా ర్యక్రమంలో వైఎస్సార్సీపీ పలు విభాగాల నేత లు నిమ్మరాజు శారదాలక్ష్మి, కొట్టె కవిత, షేక్ ర బ్బానీ, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, నాగం కాశీ విశ్వనాథ్, మెట్టు వెంకటప్పారెడ్డి, చింకా శ్రీని వాసరావు, మెహమూద్, జూలూరి హేమంగదగుప్తా, కాటూరి విజయ్, గోపాల్, బాబ్జీ, యిర్రి సాయి. ఐలా శ్రీనివాసరావు, మేరువ నర్సిరెడ్డి, కడియాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.