breaking news
stale
-
బీరు బాబులకోసం ఓ యాప్
లండన్ : మండే ఎండలకి చల్లని బీరు తో చెక్ చెప్పాలనుకునే మందుబాబులకు శుభవార్త. మీరు తాగే బీర్ ఎంత ఫ్రెష్ దో, లేదా ఎంత పాతదో కనిపెట్టేసే స్మార్ట్ పద్ధతి ఒకటి అందుబాటులోకి వచ్చింది. అవును... ఇక కాలం చెల్లిన బీరు కారణంగా పార్టీ పాడవుతుందేమో నని బెంగపడొద్దంటూ పరిశోధకులు మద్యం ప్రియులకు ఒక గుడ్ న్యూస్ అందించారు. బీర్ తాజాదనాన్ని పట్టిచ్చే ఒక సరికొత్త యాప్ ను మాడ్రిడ్ కంప్లుటెన్స్ విశ్వవిద్యాలయ రసాయన శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ యాప్ లోని పాలీమర్ సెన్సర్ ద్వారా బీర్ లోని తాజాదనం కొలిచేందుకు అనుమతించే ఒక పద్ధతిని అభివృద్ధి చేశారు. స్మార్ట్ ఫోన్ లోని ఈ యాప్ ద్వారా అతి సులువుగా, చవకగా బీర్ నాణ్యతను కొలిచే యాప్ ను ఎలీనా బెంటిటో, పెనామారియా క్రజ్ అనే పరిశోధకులు డెవలప్ చేశారు.ఇప్పటివరకూ బ్రెవరేజ్ కంపెనీలు క్రొమటోగ్రఫీ పద్ధతుల ఆధారంగా ఫర్ ఫ్యూరల్ ( బీర్ లో కలిపే ఒక రకమైన కృత్రిమ, రంగులేని ద్రవం) ఇతర తాజాదనం సూచికలను కొలిచే వారన్నారు. కానీ వారు ఉపయోగించే ఈ పద్ధతి చాలా ఖరీదుతో కూడుకున్నదని, ఎక్కువ సమయం కూడా తీసుకుంటుందని తెలిపారు. అయితే తమ కొత్త యాప్ లోని సెన్సర్ ద్వారా బీర్ ఫర్ ఫ్యూరల్ శాతం, ఇతర నాణ్యతలను చాలా ఈజీగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. పాత బీరును పరీక్షించినపుడు, పసుపురంగు నుంచి పింక్ రంగుకు మారేలా ఈ సెన్సర్ డిస్క్ ను డిజైన్ చేశామని, దీని ద్వారా డాటాను స్వీకరించి, తద్వారా బీర్ తాజాదనాన్ని కొలవచ్చని పేర్కొన్నారు. కాంటాక్ట్ లెన్స్ లను తయారుచేయడానికి ఉపయోగించే పాలిమర్ నుంచి ఈ సెన్పర్లు తయారు చేసినట్టు తెలిపారు. ఈ డేటా అప్లికేషన్ ఓపెన్ సోర్స్ లో అందుబాటులో ఉందని, ఏ ప్రోగ్రామర్ అయినా దీన్ని తమకనుగుణంగా సవరించుకొని ఉపయోగించుకోవచ్చని చెప్పారు. అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఆ అప్లికేషన్ ఇపుడు అందుబాటులో ఉందని, త్వరలో ఆపిల్ ఫోన్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఎనలిటికల్ కెమిస్ట్రీ జర్నల్ ఇది ఈ పరిశోధన ప్రచురితమైంది. -
ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో పాచిపోయిన ఆహారం!
ప్రముఖ విమాన యాన సంస్థ ఎయిర్ ఇండియా.. ఇటీవల ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటోంది. తాజాగా విమానంలో నిల్వ పదార్థాలను సర్వ్ చేశారంటూ ప్రయాణీకులు గొడవకు దిగారు. మధ్యప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడు సహా విమానంలోని అనేక మంది ప్రయాణీకులకు సిబ్బంది పాడైపోయిన, నాణ్యత లేని ఆహారాన్ని అందించడంతో అసలు గొడవ మొదలైంది. భోపాల్ నుంచి ఢిల్లీ కి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానంలో నాణ్యత లేని ఆహరం అందించారంటూ ప్రయాణీకులు సిబ్బందితో వాదనకు దిగారు. ఎయిర్ ఇండియా ఫైట్ AI-435 లో జరిగిన సంఘటనలో, అదే సమయంలో విమానంలో ప్రయాణిస్తున్న పార్టమెంట్ సభ్యుడు సహా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాక ప్రశ్నించిన వారికి సరైన సమాధానం ఇవ్వని క్రూ ప్రవర్తనపై కూడ అభ్యంతరాలు తెలిపారు. సిబ్బందిపై తగిన చర్యలు తీసుకోవాలని ఎంపీ ఎయిర్ ఇండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఇటీవల తరచుగా విమానాలు ఆలస్యంగా నడవడం, పైలట్లతో గొడవలు వంటి అనేక కారణాలతో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎయిర్ ఇండియా... ప్రస్తుతం నాణ్యత లేని పదార్థాలను ప్రయాణీకులకు అందించి మరోసారి వార్తల్లో నిలిచింది.