breaking news
St johns college
-
‘కోకాకోలా’ క్రికెట్ శిక్షణకు ప్రణీత్ రాజ్ ఎంపిక
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన సెయింట్ జోన్స్ కాలేజి విద్యార్థి ప్రణీత్ రాజ్ ముంబైలో నిర్వహించనున్న కోకాకోలా క్రికెట్ శిక్షణ శిబిరానికి ఎంపికయ్యాడు. క్రికెట్ ఇండియా అకాడమీ ఆధ్వర్యంలో ముంబైలోని ఎయిరిండియా మైదానంలో ఈ నెల 27 వరకు ఈ శిక్షణ శిబిరం కొనసాగనుంది. ఇటీవల నిర్వహించిన అండర్-16 అంతర్ రాష్ట్ర కోకాకోలా క్రికెట్ కప్‌లో ప్రదర్శన ఆధారంగా శిక్షణ శిబిరానికి ఆటగాళ్ల ఎంపిక జరిగింది. మొత్తం 27 మంది ఆటగాళ్లను ఎంపిక చేసిన నిర్వాహకులు వీరిలో ప్రణీత్ రాజ్‌కూ చోటు కల్పించారు. శిక్షణ పూర్తయిన తరువాత ఈ నెల 27న వీరి నుంచి కోకాకోలా ఎలెవన్ జట్టును ఎంపిక చేస్తారు. -
సెయింట్ జోన్స్ గెలుపు
ఇంటర్ స్టేట్ కోకాకోలా కప్ ముంబై: కోకాకోలా ఇంటర్ స్టేట్ అండర్-16 క్రికెట్ టోర్నమెంట్లో హైదరాబాద్‌కు చెందిన సెయింట్ జోన్స్ కాలేజి తొలి విజయం నమోదు చేసింది. బరోడాకు చెందిన శ్రేయాస్ సమర్పణ్ విద్యాలయ్తో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో సెయింట్ జోన్స్ 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సెయింట్ జోన్స్ 45 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి 177 పరుగులు చేసింది. గిరీష్ గౌర్ (70 బంతుల్లో 47; 3 ఫోర్లు), శిరీష్ గౌర్ (40 బంతుల్లో 43; 5 ఫోర్లు, 1 సిక్స్), మికిల్ జైస్వాల్ (37 బంతుల్లో 36; 3 ఫోర్లు) రాణించి జట్టుకు గౌరవప్రదమైన స్కోరునందించారు. శ్రేయాస్ సమర్పణ్ బౌలర్లలో హేమంత్ పండే (2/26), విజయ్ చౌహాన్ (2/31)లు రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం శ్రేయాస్ సమర్పణ్ జట్టు 41.3 ఓవర్లలోనే 170 పరుగులకు ఆలౌటైంది. అభిమన్యుసింగ్ రాజ్‌పుత్ (101 బంతుల్లో 80; 12 ఫోర్లు) అద్భుతంగా ప్రదర్శన కనబరిచినా.. ఇతర బ్యాట్స్‌మెన్ నుంచి అతనికి సహకారం దక్కలేదు. సెయింట్ జోన్స్ బౌలర్లు అభిషేక్ సింగ్ (2/19), రాజ్ మణి(2/32)లు చెరో రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేశారు. నిలకడైన బ్యాటింగ్‌తో సెయింట్ జోన్స్ ఇన్నింగ్స్‌లో కీలకపాత్ర పోషించిన గిరీష్ గౌర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.