breaking news
sports assocation
-
దొరికిపోయినా దబాయింపు!
సాక్షి, అమరావతి: మెగా డీఎస్సీ 2025 అక్రమాలను కప్పిపుచ్చేందుకు చంద్రబాబు సర్కారు నానా తంటాలు పడుతోంది. అక్రమాల మయంగా మారిన నియామక ప్రక్రియలో రోజుకో కొత్త కోణం వెలుగులోకి రావడం.. స్పోర్ట్స్ కోటా ముసుగులో ఇష్టారాజ్యంగా జీవోలు.. ప్రతిభ, పారదర్శకతకు పాతర.. బాధిత అభ్యర్థులు తమకు జరిగిన అన్యాయాన్ని ఒక్కొక్కరుగా బహిర్గతం చేయడం.. విద్యాశాఖ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయడంతోపాటు సీబీఐ విచారణకు ఆదేశించాలనే డిమాండ్ సర్వత్రా వినిపిస్తుండటంతో బాబు సర్కారు కట్టు కథలు వినిపిస్తోంది. సర్టీఫికెట్లు చూపించాలని అడిగితే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగింది. ఉన్నతాధికారులను రంగంలోకి దించి తప్పులను కప్పిపుచ్చే యత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తమీమ్ అన్సారియా, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) వైస్ చైర్మన్ ఎస్.భరణి సోమవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ కుంభకోణంపై వరుసగా వస్తున్న కథనాల్లో వాస్తవం లేదంటూనే, జూడో అసోసియేషన్ ఇచ్చిన ప్రతి సర్టీఫికెట్పైనా విచారణ జరుగుతుందని చెప్పారు. తద్వారా తప్పిదాలను పరోక్షంగా అంగీకరించారు! ముఖ్యంగా కర్నూలుకు చెందిన టీచర్ ప్రభాకర్‌పై వచ్చిన ఆరోపణల్లో కొంత గందరగోళం ఉందని, విచారణకు త్రిసభ్య కమిటీని నియమించామని చెప్పడం గమనార్హం. మాట్లాడుతున్న భరణి, అన్సారియా అసోసియేషన్లు చెప్పిందే వేదం..! స్పోర్ట్స్ అసోసియేషన్లు జారీ చేసిన సర్టీఫికెట్ల ఆధారంగానే అభ్యర్థుల అర్హతలను పరిగణించినట్లు శాప్ వైస్ చైర్మన్ భరణి పేర్కొన్నారు. సర్టీఫికెట్లను పూర్తిస్థాయిలో పరిశీలించే అధికారం, వ్యవస్థ తమ పరిధిలో లేదని ఆమె చెప్పడం గమనార్హం. సాధారణంగా అసోసియేషన్లు జారీ చేసే ధ్రువపత్రాలను ఒరిజినల్‌గానే భావిస్తామని ఆమె స్పష్టం చేశారు. అంటే.. టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడిగా ఉన్న అసోసియేషన్‌కు కనీసం గుర్తింపు లేకపోయినా, నిబంధనల ప్రకారం అసోసియేషన్ సెక్రటరీ మాత్రమే అభ్యర్ధుల ధృవీకరణ లేఖపై సంతకం చేయాల్సి ఉన్నా, కూన సంతకం ఆధారంగా ఉద్యోగాలు ఇచ్చేస్తారా? అని మీడియా ప్రశ్నించగా.. కూన రవికుమార్‌ను తాము ఎమ్మెల్యేగా చూడటం లేదని, అసోసియేషన్ అధ్యక్షుడిగానే చూస్తున్నామని, ఆయన సంతకాన్ని ఆమోదించాలని ఫెడరేషన్ చెప్పిందని భరణి పేర్కొన్నారు. అభ్యర్థి పెద అప్పలరాజు తన సర్టిఫికెట్లను ఆన్లైన్లో తప్పుగా అప్లోడ్ చేశారని, ఆయన సర్టిఫికెట్తో పాటు సోదరుడి సర్టీఫికెట్ కూడా ఇచ్చారని, ఇది కేవలం మానవ తప్పిదమని వెనకేసుకొచ్చారు. భార్యాభర్తలకు ఉద్యోగాలు రాకూడదా? 41 ఏళ్లు ఉన్న వారికి ఉద్యోగం ఇవ్వకూడదా? అని ప్రశ్నించారు. ఎలాంటి మార్కులు రాకపోయినా, స్పోర్ట్స్ మెరిట్ ఉంటే ఉద్యోగాలిస్తామని చెప్పారు. జరగని టోర్నమెంట్‌పై దాటవేత.. ‘ఖమ్మంలో టోర్నమెంట్ జరిగిందంటూ జూడో సర్టీఫికెట్లతో వచ్చిన నలుగురు అభ్యర్ధులకు ఉద్యోగాలిచ్చారు. కానీ అక్కడ అసలు ఆ టోర్నమెంట్ జరగలేదు. జరగని టోర్నమెంట్లో పాల్గొని, సర్టీఫికెట్లు ఎలా తెచ్చారని విచారణ జరిపారా?’ అని ప్రశ్నించగా.. ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తాము ఏమీ మాట్లాడలేమని భరణి సమాధానం దాటవేశారు. 372 సర్టీఫికెట్లపై విచారణ చేయడం సాధ్యం కాదన్నారు. సర్టీఫికెట్లు ఇచ్చేది మేం కాదు.. కేసులు పెడతాం! టీచర్లందరికీ టెట్ తప్పనిసరి అని అన్సారియా స్పష్టం చేశారు. వల్లూరులో టీచర్‌గా నియమించిన ప్రభాకర్ టెట్‌లో అర్హత సాధించలేదు కదా? అని ప్రశ్నించగా.. టెట్ ఎన్నిసార్లయినా రాయవచ్చని, అతడు ఒకసారి రాసినప్పుడు 77 మార్కులతో అర్హత సాధించాడని, అయినప్పటికీ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కర్నూలులో ఉష అనే ఉపాధ్యాయురాలు టెట్‌లో తెలుగు సబ్జెక్ట్‌లో అర్హత సాధించలేదు. అలాంటప్పుడు ఆమెకు ఉద్యోగం ఎలా ఇచ్చారన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఏ సబ్జెక్ట్ బోధించే టీచర్ ఆ సబ్జెక్టులో టెట్ అర్హత సాధించాల్సిన అవసరం లేదని అన్సారియా పేర్కొన్నారు. ‘ఈడబ్ల్యూఎస్ సర్టీఫికెట్లలో చాలా వరకూ ఫేక్ అని ఇప్పటికే రుజువైంది. ఆర్థికంగా బలంగా ఉన్నవారికి కూడా ఇచ్చి వాటి ఆధారంగా డీఎస్సీలో ఉద్యోగాలు కట్టబెట్టారు..’ అనే ప్రశ్నలపై అన్సారియా దాటవేత ధోరణి ప్రదర్శించారు. ఆ అంశం తమ పరిధిలోనిది కాదన్నారు. సర్టిఫికెట్లు ఇచ్చేది తహసీల్దార్లు కాబట్టి రెవెన్యూ విభాగానికి చెప్పి విచారణ చేయిస్తామంటూ తప్పించుకున్నారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన 372 మందికి ఫోన్లు చేసి సర్టీఫికెట్లు చూపించాలని అడుగుతున్నారని, అలా ఎవరైనా అడిగితే వారిపై చర్యలు తీసుకుంటామని అన్సారియా హెచ్చరించారు. కుప్పంలో ఇలాంటి ఘటన జరిగితే 24 గంటల్లోనే ఓ విలేకరి, కెమెరామెన్‌పై కేసు నమోదు చేశామన్నారు. -
క్రీడా మంత్రి హడావిడి సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఒక వైపు సీమాంధ్రలో సమైక్య ఉద్యమం... మరో వైపు తెలంగాణాలో శాంతి ర్యాలీలు వగైరా సాగుతూనే ఉన్నాయి. కీలక ప్రభుత్వ శాఖలు దాదాపుగా స్థంభించిపోయా యి. ఇలాంటి స్థితిలో క్రీడా శాఖ మంత్రి వట్టి వసంత కుమార్‌కు ఒక్కసారిగా రాష్ట్రంలో క్రీడలపై ప్రేమ కలిగింది. దాంతో ఈ శాఖ సమీక్ష నిర్వహించేందుకు సిద్ధమైపోయారు. అదేదో రాష్ట్రంలో క్రీడాభివృద్ధి గురించో, మినీ స్టేడియాల నిర్మాణం గురించో, లేదంటే పేద క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందించడం గురించో అయితే ఫర్వాలేదు. అయితే కేవలం కొంత మందికి వ్యక్తిగత ప్రయోజనం కలిగించేందుకే ఈ హడావిడి సమావేశం ఏర్పాటు చేసినట్లు సమాచారం. క్రీడా శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ మరో మూడు రోజుల్లో విధుల్లో చేరాల్సి ఉంది. ఆయన ఈ సమావేశంలో పాల్గొనలేదు. పైగా సాధారణంగా మంత్రులు సమీక్షలు జరిపే సచివాలయంలో కాకుండా దీనిని లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేశారు. ఇదేమీ అంత అత్యవసర సమావేశం కాదు. ఇందులో వాస్తవానికి సమీక్షకంటే... నిబంధనలకు విరుద్ధంగా తనకు కావాల్సిన ఫైళ్లు సిద్ధం చేయమంటూ ‘శాప్’ అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచిన పీవీ సింధుకు రూ. 50 లక్షలు ఇచ్చే విధంగా ఫైలు సిద్ధం చేయాలంటూ ‘శాప్’ అధికారులను మంత్రి ఆదేశించినట్లు సమాచారం. నిబంధనల ప్రకారం సింధు రూ.5 లక్షలకే అర్హురాలు. థాయ్‌లాండ్ గ్రాండ్‌ప్రి గోల్డ్, మాల్దీవ్స్ చాలెంజ్ టోర్నీలో విజేతలుగా నిలిచిన శ్రీకాంత్, నందగోపాల్‌లకు కూడా ఇదే తరహాలో నగదు పురస్కారం ఇప్పించాలని మంత్రి భావిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కృష్ణా జిల్లాకు చెందిన ఒక చెస్ క్రీడాకారిణికి, గుంటూరులో హాకీ టోర్నీ నిర్వహణకు హాకీ ఆంధ్రప్రదేశ్‌కు రూ. 25 లక్షలు ఇచ్చేందుకు... ఇలా మంత్రిగారి సమీక్ష మొత్తం వీటిపైనే సాగింది. హాకీ సమాఖ్యలో నెలకొన్న విభేదాల నేపథ్యంలో డబ్బులు ఇవ్వడం వీలు కాదంటూ రెండు వారాల క్రితమే హాకీ సంఘం అభ్యర్థనను ‘శాప్’ తిప్పి పంపింది. ఇప్పుడు అదే ఫైలును మంత్రి ముందుకు నెడుతున్నట్టు సమాచారం. రాష్ట్ర మంత్రిని ఆటతో సంబంధం లేని కొంత మంది వ్యక్తులు బాగా తప్పుదోవ పట్టిస్తున్నట్లుగా మాకు తెలుస్తోంది. కేవలం బ్యాడ్మింటన్ మాత్రమే క్రీడ అన్నట్లుగా వారు మంత్రికి మార్గ నిర్దేశనం చేస్తున్నారు. తగిన నిధులు లేక రాష్ట్రంలో క్రీడాభివృద్ధి ఆగిపోయింది. మూడేళ్లుగా టోర్నీల కోసం ఖర్చు పెట్టిన రూ. 80 లక్షలు ఇవ్వాలంటూ స్వయంగా ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసి ఆరు నెలలు కావస్తున్నా ఇంకా పైసా రాలేదు. ఇప్పుడు ఒక్కో ఆటగాడికి లక్షలు కుమ్మరించాలని ప్రయత్నించడం నిజంగా అన్యాయం. - ఏపీ ఒలింపిక్ సంఘం ప్రతినిధి ఆవేదన -

కౌశల్-గిరీశ్ జోడీకే టైటిల్
సాక్షి, హైదరాబాద్: ఇన్లాండ్ జాతీయ హోబి 16 సెయిలింగ్ చాంపియన్‌షిప్‌లో ఆర్టిలరీ వాటర్ స్పోర్ట్స్ అసోసియేషన్ (ఏడబ్ల్యూఎస్‌ఏ) కు చెందిన కౌశల్ కుమార్ యాదవ్-గిరీశ్ జోడి విజేతగా నిలిచింది. హుస్సేన్ సాగర్ జలాల్లో బుధవారం ఈ పోటీలు ముగిశాయి. మొత్తం 12 రేస్‌ల అనంతరం ఈ జంట ఓవరాల్‌గా 21 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం అందుకుంది. ఏడబ్ల్యూఎస్‌ఏ కే చెందిన సెయిలింగ్ జంట కె.యాకోబు-రాజీవ్ కుమార్‌లకు రెండో స్థానం లభించింది. రజతం గెలుచుకున్న ఈ జోడికి మొత్తం 28 పాయింట్లు లభించాయి. ఐఎన్డబ్ల్యూఎస్కు చెందిన ఇమోలెమ్‌నాక్-శేఖర్ యాదవ్‌లు కాంస్యం గెలుచుకున్నారు. ఓవరాల్‌గా 37 పాయింట్లతో వీరు మూడో స్థానంలో నిలిచారు. బుధవారం చివరి రోజు పోటీల్లో రెండు రేస్‌లు జరిగాయి. 11వ రేస్‌లో ఇమోలెమ్‌నాక్-శేఖర్ యాదవ్ గెలవగా, కమలేశ్ పటేల్-రావంకర్ కు రెండో స్థానం, బ్రిజ్రాజ్వర్మ-పంకజ్లకు మూడో స్థానం లభించింది. 12వ రేస్‌ను యాకోబు-రాజీవ్ గెలుచుకున్నారు. పవన్-సుఖేర్ రెండో స్థానంలో నిలవగా, కౌశల్-గిరీశ్‌లకు మూడో స్థానం దక్కింది. విజేతలకు ఆర్టిలరీ సెంటర్ కమాండెంట్ ఎన్ఎస్ జాదవ్, ఏడబ్ల్యూఎస్‌ఏ ఓఐసీ మేజర్ విమల్ కాంతవాల్ బహుమతులు అందజేశారు.